S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిట్టర్ ఫ్రీ జోన్లలో

విజయవాడ (కార్పొరేషన్), మే 15: నగరంలో ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న లిట్టర్ ఫ్రీ జోన్ల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంతకుముందు జివిబి సంస్థ ద్వారా ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన అధికారులు ప్రస్తుతం ఆ సంస్థ కాంట్రాక్ట్ ముగియడమే కాకుండా వారి చర్యలపై సంతృప్తి చెందని అధికారులు కాంట్రాక్ట్‌ను అమలును రద్దు చేశారు. దీంతో విఎంసి ప్రజారోగ్యశాఖకు చెందిన పారిశుద్ధ్య కార్మికులతోనే లిట్టర్ ఫ్రీ జోన్లలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ చేపట్టిన విఎంసి అధికారులు ప్రస్తుతం ఆయా పనులను మరింత విస్తృత పర్చి నూరుశాతం లిట్టర్ ఫీ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అవును... మేం కావలికుక్కలమే!

విజయవాడ, మే 15: రెండేళ్లుగా నగర పాలన సాగిస్తున్న తెలుగుదేశం మేయరు, కార్పొరేటర్ల అవినీతిని ఎండగట్టటంలో కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌లను ఎండగట్టటంలో భూదందాలను, కబ్జాలను వెలికితీయటంలో కమ్యూనిస్టులు కావలి కుక్కల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, డి.కాశీనాథ్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయం, దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ మదమెక్కి మహిళల పట్ల కీచకుల్లా వ్యవహరిస్తున్న కార్పొరేటర్లను వెనకేసుకురావటానికి నగర మేయర్‌కు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు.

ప్రశాంతంగా టిఎస్ ఎంసెట్..

బెంజిసర్కిల్, మే 15: తెలంగాణా రాష్ట్రంలోని మెడికల్, ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి నిర్వహించి తెలంగాణా రాష్ట్ర ఎంసెట్ పరీక్ష నగరంలో ప్రశాంత వాతావణంలో నిర్వహించారు. నీట్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ పరీక్షను ఆదివారం నగరంలోని పలు సెంటర్లలో అధికారులు పగ్భందీ ఏర్పట్లు ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు పరీక్షకు ఒక్క నిముషం అలస్యమైన అనుమతించమన్న ఖచ్చితంగా అమలు చేసారు. దీని కారణంగా పలువురు విద్యార్థులు పరీక్షను వ్రాయకుండా వెనుదిరిగారు.

కనకదుర్గమ్మ సాక్షిగా... భక్తుల పాట్లు

ఇంద్రకీలాద్రి, మే 15: కనకదుర్గనగర్‌లో భక్తులకు అవసరమైన అన్ని రకాలైన వౌలిక సదుపాయాల కల్పనలో దుర్గగుడి అధికారులు ఘోరంగా విఫలం చెందినట్లు ఇక్కడ ఉన్న అరకొర వసతులే స్పష్టం చేస్తున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా దుర్గఘాట్ మొత్తం కూల్చేస్తారు. ప్రస్తుతం కనకదుర్గనగర్‌లోనే భక్తులు తలనీలాలు సమర్పణ, స్నానాలు, వాహానాల పార్కింగ్, తదితర వాటిని దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేసారు. భక్తులు తలానీలు సమర్పించుకోవటానికి చేసిన కేశఖండనశాఖ అధిక సంఖ్యలోవచ్చే భక్తుల అవసరాలు తీర్చలేక పోతోందన్న విమర్శనలు వినబడుతున్నాయి.

కార్పొరేటర్ చంటిపై బిగుస్తున్న ఉచ్చు

విజయవాడ (కార్పొరేషన్), మే 15: విమానయాన ప్రయాణంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగాను, అనుచితంగాను ప్రవర్తించాడన్న విషయంపై నేరారోపణలు ఎదుర్కొంటున్న నగర 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) పై ఉచ్చు బిగుస్తోంది. సదరు ప్రయాణికురాలి ఫిర్యాదును పరిగణలోకి తీసుకొన్న శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు చంటిని విచారించేందుకు గాను పోలీసులు విజయవాడ నగరానికి వచ్చి ఆయన నోటీసులిచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

జూన్ 30 నాటికి పుష్కర పనుల పూర్తి

విజయవాడ (కార్పొరేషన్), మే 15: రాబోయే కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, పుష్కరాలకు విచ్చేసే భక్తులకు సకల సదుపాయాలను కల్పించడమే కాకుండా వారి రాకపోకలకు అనువైన ప్రయాణ సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నగరంలో జరుగుతున్న పుష్కర పనులు, పుష్కర ప్రాంతాలను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేస్తూ జూన్ 30 కల్లా ఆయా అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మిషన్ కాకతీయలో అధికారుల మాయ..!

గోవిందరావుపేట, మే 15: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనులలో అధికారుల నిర్లక్ష్యంగా ఏమేరకు ఉందొ అవగతం అవుతుంది. గోలుసు కట్టు చెఱువులు నిండుగా ఉంటేనే భూమిలో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, రైతులకు పంటలు పండుతాయనే మహోన్నత లక్ష్యంతో కోట్లాది రూపాయల నిదులన వెచ్చిస్తున్నా..కింది స్ధాయి అధికారల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యాం నెరవేరక పోగా పలు విమర్శలకు తావిస్తుంది. వివరాలలోకి వెలితే మిషన్ కాకతీయ రెండవ విడత పనులలో భాగంగా గోవిందరావుపేట మండలంలో 20 పనులకు గానూ 248.89కోట్ల నిదులు మంజూరీ అయ్యాయి.

కల్వర్టు పనులను వెంటనే చేపట్టాలి

ఆత్మకూరు, మే 15: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ నుండి శాయంపేట మండల కేంద్రం వరకు 6కోట్లతో బిటి రోడ్డుకు నిధులు మంజూరు కాగా శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు సుమారు ఆరు నెలల క్రితం పనులను ప్రారంభించారు. కాంట్రాక్టర్ పనుల్లో భాగంగా రెండు చోట్ల కల్వర్టులను నిర్మించేందుకు గోతులు తవ్వి తాత్కాళిక రోడ్డును నిర్మించి పనులు ప్రారంభించడం లేదని తిరుమలగిరి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో కోలవాగు, మాటువాగు నుండి తీవ్రంగా వరద వస్తుందని, దానివల్ల డైవర్షన్ రోడ్డు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తిరుమలగిరి గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

గాలివాన బీభత్సం

జనగామ టౌన్, మే 15: గత రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి జనగామ పట్టణంతో పాటు పలు మండలాల్లో అనేక ఆర్థికనష్టం జరిగింది. జనగామ మండలం రఘునాథపల్లి, బచ్చన్నపేట, లింగాలఘణపురం, నర్మెట మండలాల్లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో ఆకాశం దద్దరిల్లింది. పలుచోట్ల పిడుగులు పడి పశువులు మృత్యువాతపడగా, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. సుమారుగా 60ఇండ్లవరకు పూర్తిగా ధ్వంసం కాగా వందలాది ఇళ్లు పాక్షికంగా కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

రైతు సంక్షేమమే టిఆర్‌ఎస్ ధ్యేయం

నర్సంపేట, మే 15: రైతు సంక్షేమమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ క్రమంలో నర్సంపేట నియోజకవర్గాన్ని నీటి సర్క్యూట్ హౌజ్‌గా తీర్దిదిద్ది రైతాంగానికి రెండు పంటల నీరు అందిస్తామని టిఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలోని మాధన్నపేట, రంగయ్య చెరువు, పాఖాల చెరువులకు ఎస్సారెస్పీ, గోదావరి జలాలను మళ్లించి ఈప్రాంత రైతాంగానికి సాగునీరు అందించేందుకు గత ఆరు నెలల నుండి తగిన ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి అందజేశామని చెప్పారు.

Pages