S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీటిడిపికి ఢోకా లేదు

హైదరాబాద్:తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లిపోయినంతమాత్రాన పార్టీకి నష్టం లేదని, ప్రజల్లో ఆదరణ ఉందని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీడిపి తుడిచిపెట్టుకుపోయిందన్న టిఆర్‌ఎస్ నేతల ఫ్రచారంలో అర్థం లేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో వైకాపా తుడిచిపెట్టుకుపోతున్న విషయాన్ని గమనించాలని అన్నారు.

గుంటూరు బాధితులు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా

గుంటూరు:పట్టణంలోని లక్ష్మీనగర్‌లో మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటవలో మరణించిన ఏడుగురి కుటుంబాలకు రూ. 20 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకుకూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో వడగాలులు తప్పవు

హైదరాబాద్:ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మరోవారం రోజులపాటు వడగాలులు వీస్తాయని, మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వారం ఆలస్యంగా రుతుపవనాలు

న్యూదిల్లి: దేశంలోకి రుతుపవనాల రాక వారం ఆలస్యం కాబోతోందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. దేశంలోని కేరళ తీరాన్ని జూన్ 1న తాకాల్సిన రుతుపవనాలు 7వ తేదీని పలకరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఘర్షణే...తిరుగుబాటు కాదు

న్యూదిల్లి:ఈశాన్య రాష్ట్రంలోని ఓ పదాతిదళంలో సైనికులు తిరుగుబాటు చేశారన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. రోజువారీ శిక్షణలో పాల్గొన్న ఓ సైనికుడు గుండెపోటుతో మరణించడంతో తోటి సైనికులు భావోద్వేగానికి గురై ఆందోళనకు దిగారని, ఈ సందర్భంగా సైనికాధికారులతో వారు ఘర్షణపడ్డారని పేర్కొంది. అది తిరుగుబాటు కాదని తెలిపింది.

మేయర్ రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి!

విజయవాడ, మే 14: మహిళలకు రక్షణ కల్పిచాలని, కీచక పర్వం నడుపుతున్న తెలుగుదేశం కార్పొరేటర్లను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా కార్పొరేషన్ వద్ద ధర్నా చేస్తున్న మహిళా సంఘాల నేతలను, కార్యకర్తలను నగర మేయర్ అరెస్టు చేయటాన్ని తీవ్రంగా నిరసిస్తూ శనివారం రాత్రి సిపిఐ, సిపియం, సిపిఐ (ఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో కృష్ణలంక పోలీస స్టేషను వద్ద ధర్నా జరిగింది. వామపక్ష పార్టీల నేతలు స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి మేయర్, పోలీసుల అనుచిత వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.

వక్ఫ్‌బోర్డు ఆస్తులు కొల్లగొడుతున్నారు

పాతబస్తీ, మే 14: కోట్లాది రూపాయలు విలువైన వక్ఫ్‌బోర్డు ఆస్తులు కొల్లగొడుతున్న జలీల్‌ఖాన్ తనను కాపాడుకోవటం కోసం అధికార తెలుగుదేశం పార్టీలో చేరారని మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం పాతబస్తీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెలంపల్లి మాట్లాడారు. జలీల్‌ఖాన్ ఎమ్మెల్యే అయిన తరువాత నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోకపోయినా వక్ఫ్‌బోర్డు ఆస్తులను కొల్లగొట్టి తన ఖాతాలో వేసుకోవటంలో అభివృద్ధి చెందాడని ఎద్దెవా చేశారు.

తప్పు చేసినట్టు రుజువు చేస్తే మూకుమ్మడిగా రాజీనామా

విజయవాడ (కార్పొరేషన్), మే 14: కేవలం రాజకీయ లబ్ధికోసమే సిపిఎం, సిపిఐ నేతలు తమ అధ్యయన యాత్రపై లేనిపోని విమర్శలు చేసి కాలం గడుపుతున్నారని, యాత్రలో కార్పొరేటర్లు ఎవరైనా తప్పు చేశారని రుజువు చేస్తే యాత్రకు వెళ్లిన వారందరం రాజీనామా చేస్తామని, రుజువు చేయలేని పక్షంలో తమ తప్పును ఒప్పుకొని నగర ప్రజలకు వామపక్షాల నేతలు క్షమాపణలు చెప్పాలని నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, టిడిపి ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు పేర్కొన్నారు.

తప్పూ చేయలేదు

విజయవాడ (కార్పొరేషన్), మే 14: అధ్యయన యాత్ర నుంచి ఢిల్లీ తిరుగు విమాన ప్రయాణంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని, ప్రయాణం సమయంలో నిద్రలో వచ్చిన గురక వల్లనే తాను విచారణ ఎదుర్కొన్నానని 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పక్క సీట్లో కూర్చొన్న మహిళా ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదు ఆయన ఖండించారు. నిద్ర సమయంలో తనకు వచ్చిన గురక వలనే కాకుండా తాను తనపై తూలినట్టుగా వచ్చిన అభియోగం తప్పించి మరే ఇతర నేర పూరితమైన చర్యలకు పాల్పడలేదన్నారు.

కృష్ణాలో రన్నింగ్‌లో లక్ష పైగా ఫైళ్లు

విజయవాడ, మే 14: కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఇ-ఆఫీస్ విధానాన్ని అమలు పరుస్తున్నారని సుమారు లక్ష ఫైల్స్ రన్నింగ్‌లో ఉన్నాయని జిల్లా కలెక్టర్ బాబు ఎ ప్రధాన మంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్, ఆధార్ డైరెక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండేకు తెలిపారు. గన్నవరం మండలంలో ఇ-పోస్ ద్వారా పెన్షన్, క్యాష్ లెస్ పిడిఎస్ పంపిణీ, ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఆన్‌లైన్‌లో రేషన్ పంపిణీ అంశాలను వీరు పరిశీలించారు. భోజనానంతరం మధ్యాహ్నం గన్నవరం తహశీల్దార్ కార్యాలయంలో ఇ-ఆఫీస్ అమలు విధానాన్ని కలెక్టర్ వివరించారు. తహశీల్దార్ మాధురి, ఇ-ఆఫీస్ ద్వారా ఫైల్స్ నడిపే పద్దతిని స్క్రీన్‌పై చూపించారు.

Pages