S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా వారిని విడిచిపెట్టండి

చర్ల, ఏప్రిల్ 30: చర్ల మండలం బోదనెల్లికి చెందిన కుంజం బుజ్జిబాబు, పొడియం సారయ్యలు ఎవరికీ ఏ హానీ తలపెట్టే వారు కాదని, మావోయిస్టులు మరోసారి ఆలోచించి సహృదయంతో వారిని విడిచి పెట్టాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు బోదనెల్లి గ్రామస్తులు మావోయిస్టు పార్టీని వేడుకుంటున్నారు. గిరిజనులను కిడ్నాప్ చేసిన సందర్భంగా అక్కడ గ్రామానికి వెళ్లిన విలేఖర్లతో అక్కడి గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రెండు వారాల క్రితం కుంజం బుజ్జిబాబును మావోయిస్టులు తీసుకెళ్లారని, అలాగే మూడురోజుల క్రితం మళ్లీ ఇదే గ్రామానికి చెందిన పొడియం సారయ్యను మావోయిస్టులు అపహరించారని గ్రామస్తులు తెలిపారు.

వెంకన్న బంగారం ఇక బ్యాంకుల్లో భద్రం

హైదరాబాద్, ఏప్రిల్ 30: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన 7.5 టన్నుల బంగారాన్ని పసిడి నగదీకరణ పథకం (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్) ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నామని తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జిఎంఎస్ ద్వారా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 1.3 టన్నుల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేశామన్నారు.

పాలేరు ఎన్నికల పరిశీలకుడిగా పళనిస్వామి

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 30: పాలేరు ఉప ఎన్నికను పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకుడిగా తమిళనాడు రాష్ట్రంలోని స్లమ్ క్లియరెన్స్ ఎండిగా పని చేస్తున్న పళనిస్వామిని నియమించారు. కాగా ఆయన శనివారం ఖమ్మం చేరుకొని నామినేషన్ల వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దానకిషోర్‌తో కలిసి ఎన్నికల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ దానకిషోర్ ఎన్నికల పరిశీలకుడికి పాలేరు నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రవర్తనా నియావళి ప్రకారం ఏర్పాటు చేసిన బృందాలు, వాటికి అదనంగా ఒక్కొ బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 30: పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలు 50వేలు, అంతకంటే ఎక్కువ నమోదు తమ వెంట తీసుకెళ్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని జెసి దివ్య వెల్లడించారు. శనివారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వీడియో మానిటరింగ్ బృందాలు, ఎంపిఎంసి కమిటీ, ఫ్లయిండ్ స్క్వాడ్ బృందాలు ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జెసి దివ్య మాట్లాడుతూ స్టాటిక్ సెర్ప్‌లైన్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటి వరకు ఒక్క చోట కూడా నగదు సీజ్ చేయకపోవటం సరికాదని, ఇప్పటి నుంచైనా అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.

తాగునీటి ఎద్దడిపై ఫిర్యాదులొస్తే ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులదే బాధ్యత

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 30: జిల్లాలో తాగునీటి ఎద్దడిపై ఫిర్యాదులోస్తే దానికి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ దానకిషోర్ హెచ్చరించారు. శనివారం కలెక్టర్ దానకిషోర్ ఎంపిడివోలు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిధుల కొరత లేకున్నప్పటికీ ఉన్న నిధులతో సక్రమంగా వినియోగించి నీటి సమస్యను తీర్చాలన్నారు. ప్రతి మండలానికి 2లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినా వాటిని వినియోగించకపోవటంతో పనితీరు అర్థమవుతుందన్నారు. పశువులకు పశుగ్రాసం, నీటి కొరత లేకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విలువలు తెలియని టిఆర్‌ఎస్

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర సమితి సంప్రదాయాలు, విలువలు తెలియని పార్టీ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య విమర్శించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార దాహం తప్ప టిఆర్‌ఎస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు ప్రజల మనోభావాలు పట్టవని ఆరోపించారు. పాలేరు ఉప ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణిని కాదని టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టడం, బరిలో మంత్రి తుమ్మల ఉండడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.

ఆదరిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

తిరుమలాయపాలెం, ఏప్రిల్ 30: పాలేరు ఉప ఎన్నికల్లో తనను ఆదరిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని సోలీపురం, ముజాహిదిపురం, రఘునాధపాలెం, శివారు తండాల్లో శనివారం టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు నియోజకవర్గం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తాగు, సాగునీరందక ప్రజలు పలు అవస్థలు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఆధునిక సేంద్రీయ పద్ధతులపై సాగుచేయాలి

కామేపల్లి, ఏప్రిల్ 30: ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఆధునిక, సాంకేతిక పద్దతులపై సాగు చేయాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె రాములు అన్నారు. శనివారం మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో పత్తి పంటను విస్మరించాలని, రైతులు వాటి స్థానంలో పప్పు ధాన్యాన పంటలతో పాటు ఇతర ఉద్యానవన శాఖకు సంబంధించిన పంటలు వేసుకోవాల్సిందిగా రైతులకు సూచనలిచ్చారు. భూసార పరీక్షలు, సేంద్రీయ ఎరువుల వాడకం, రసాయన ఎరువుల వాడకంలో అనర్థాలు, వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత పంటలపై వారికి శిక్షణనిచ్చారు.

మూగ జీవాల సంరక్షణ అందరి బాధ్యత

కర్నూలు, ఏప్రిల్ 30:మూగ జీవాలను సంరక్షణ బాధ్యతను ప్రతిఒక్కరూ స్వీకరించాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ సూచించారు. నగర శివారులోని విజె ఫంక్షన్ హాలులో శనివారం ‘ప్రపంచ పశువైద్య దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్త జీవజాలం నుంచి మానవుడు వేరుపడి తన మేధాశక్తితో జ్ఞానాన్ని సముపార్జించి మనుగడ సాధిస్తున్నాడన్నారు. జంతువులను సంరక్షించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది ఏప్రిల్ 4వ శనివారం ప్రపంచ జంతు దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. జంతువుల శక్తి ముందు మానవుడు ఏ మాత్రం సరిపోడని, అయితే మన మేధాశక్తితోనే వాటిని నియంత్రించగలుతున్నామన్నారు.

పకడ్బందీగా స్ట్ఫా నర్సుల ఎంపిక ప్రక్రియ

కర్నూలు, ఏప్రిల్ 30:కాంట్రాక్టు పద్ధతిన ఎంపికైన 143 మంది స్ట్ఫా నర్సుల సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియను వీడియో తీయించాలని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా వీరస్వామిని ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలోని సునయన ఆడిటోరియంలో శనివారం కాంట్రాక్టు విధానంపై స్ట్ఫా నర్సుల ఎంపిక, 3,5,8 తరగతుల్లో బెస్ట్ స్కూల్స్‌కు ఎస్‌టి విద్యార్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి సర్ట్ఫికెట్స్ వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఎంపికైన స్ట్ఫా నర్సుల ఓరిజనల్ సర్ట్ఫికెట్స్, మనకిచ్చిన జిరాక్స్ కాపీలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.

Pages