S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజీ మార్గమే మేలు

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 30: రాజీ మార్గాల ద్వారా కేసుల పరిష్కారం ఎంతో ఆవశ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అన్నారు. రాజీ మార్గాల ద్వారా కేసుల పరిష్కారంపై రిఫరల్ జడ్జిలకు శనివారం జిల్లా కోర్టులో అవగాహన సదస్సు జరిగింది. జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సాధికారత సంస్థ అధ్యక్షుడు, రాజీమార్గాల కేంద్రం సంచాలకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ మార్గాల ద్వారా ప్రభావ వంతంగా కేసుల పరిష్కారానికి గల మార్గాలను ఆమె సూచించారు.

కరవును ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యం

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 30: జిల్లాలో కరవును ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలోని 13 జిల్లాలో కరవు చాయలు అలుముకున్నాయని అన్నారు. దీంతో తీవ్ర నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడి పోతున్నారని, ప్రభుత్వం మంచినీటిపై కనీస చర్యలు తీసుకున్న దాఖలా లేదని తెలిపారు.

‘సెర్చ్’ లేదు!

ఎచ్చెర్ల, ఏప్రిల్ 30: ఇక్కడ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ హెచ్.లజపతిరాయ్ పదవీకాలం మే 13వ తేదీతో పూర్తవనుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ సమావేశం ఇప్పటికీ ఒక్కసారైనా నిర్వహించకపోవడంతో దరఖాస్తు చేసుకున్న ఆచార్యుల్లో మరింత ఉత్కంఠ ఆరంభమైంది. ఏప్రిల్ 20న అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితాదేవరాను రాష్ట్ర నామినీగా, యుజిసి నామినీగా ప్రొఫెసర్ దేవరాజ్, అంబేద్కర్ వర్శిటీ నామినీగా ప్రొఫెసర్ లక్ష్మీనాథ్‌లను ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రణాళికతోనే సహకార సంఘాల అభివృద్ధి

శ్రీకాకుళం, ఏప్రిల్ 30: సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం ఏర్పడినవని, వీటి అభివృద్ధికి ఒక నిర్థిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రైతులకు సాయం చేయాలంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం సూచించారు. ఇక్కడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు, విత్తనాలు, ఎరువులు సరఫరాలే కాకుండా సొసైటీ ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి పౌల్ట్రీలు, కోళ్ళు పెంపకం, గవర్నమెంటు పాఠపుస్తకాలు, నోట్‌బుక్స్ అమ్మకాలు చేపట్టాలని సూచించారు.

మజ్జిగ కేంద్రాలు

శ్రీకాకుళం, ఏప్రిల్ 30: జిల్లాలో వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్య కూడళ్ళలో మజ్జిగ, మంచినీటి కేంద్రాలు తక్షణం ఏర్పాటు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. వేసవి వేడిమి దృష్ట్యా ప్రజలకు మంచినీటిని, మజ్జిగను అందించేందుకు ప్రభుత్వం రూ.3కోట్లు విడుదల చేసిందన్నారు. దీనిని పక్కాగా అమలు చేయుటకు కార్యాచరణపై జిల్లా నీటియాజమాన్య సంస్థ, జిల్లా మహిళా సమాఖ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

‘మన ఊరు-మన బడి’

శ్రీకాకుళం, ఏప్రిల్ 30: ప్రభుత్వ పాఠశాలలకు రోజు రోజుకూ ప్రాధాన్యం తగ్గడంతో ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటీకి వెళ్ళి, బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమంటూ అంగీకార ధ్రువపత్రాలను తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నారు. మరో ఐదురోజుల గడువులో ఈ కార్యక్రమం శతశాతం విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.

న్యాయస్థానం పట్ల అవగాహన అవసరం

సారవకోట, ఏప్రిల్ 30: బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసహాయం అందించడానికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలపట్ల అవగాహన కలిగి ఉండాలని పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని మాలువ పంచాయతీ సవర మాలువ గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ఉచిత న్యాయసలహా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నేటికి కూడా ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. పథకాలు సక్రమంగా అమలు కాని సందర్భాలలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే లబ్ధిదారులకు న్యాయం చేకూర్చుతామని స్పష్టంచేశారు. గిరిజన హరిజనులు విద్యావంతులు కావాలని ఆయన కోరారు.

‘అవగాహన లేని ఆరోపణలు తగవు’

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 30: నగరంలోని ఏడురోడ్ల కూడలి వద్దనున్న ఎన్టీఆర్ నగరపాలక సంస్థ క్రీడా మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అవగాహన లేని ఆరోపణలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అన్నారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన వైకాపా నగర అధ్యక్షుడు సాధు వైకుంఠంనకు మున్సిపల్ తీర్మానాలు, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హక్కులు తెలియనట్లుందని ఎద్దేవా చేశారు.

జూన్ నెలాఖరు వరకు ఆరోదశ సాక్షరభారత్

లావేరు, ఏప్రిల్ 30: జిల్లాలో సాక్షరభారత్ ఆరోదశ కేంద్రాల నిర్వహణను జూన్ నెలాఖరు వరకు కొనసాగిస్తున్నట్టు జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మండలంలో సాక్షరభారత్ కేంద్రాల పరిశీలనకు శనివారం విచ్చేసిన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. ఈ ఆరోదశ కార్యక్రమంలో 1,30,880 మంది నిరక్ష్య రాస్యులను అక్షరాస్యులు చేసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వీరిలో 70,530 మంది ఉపాధి హామీ కూలీలు కాగా 61,347మంది స్వయంశక్తి సంఘాల సభ్యులని వివరించారు. జనవరి నుండి ఈ కార్యక్రమంలో 2061 మంది విలేజ్‌కో ఆర్డినేటర్లు, 2351మంది మ్యాథ్స్, ఉపాధిపథకం, క్షేత్ర సిబ్బంది బోధకులుగా పనిచేస్తున్నారన్నారు.

ప్రేమ ఎంత మధురం! (భగత్‌సింగ్ 26)

ఏమి చేయాలన్నది తేలిపోయింది. అది ఎవరు చేయాలన్నదే ఇక తేల్చాల్సి ఉంది.
ఆ పని ఇద్దరికి అప్పగించాలి అన్నాడు భగత్‌సింగ్.
‘ఎవరిని చంపటమూ మన ఉద్దేశం కాదు. మనం వేసేది ఎవరికీ హాని చెయ్యని తేలిక రకం పొగబాంబు. దానికి ఇద్దరు కామ్రేడ్స్‌ని, రిస్కు చేయటమెందుకు? అదను చూసి బాంబు విసిరి పరిగెత్తడానికి ఒకరు సరిపోతారు కదా?’ - అని ఒకరి శంక.
‘బాంబు వేసిన సమయంలోనే ఆ పని మనం ఎందుకు చేశామో వివరించే పత్రాలను కూడా సభలోకి వెదజల్లాలి. గట్టిగా నినాదాలూ చేయాలి. ఇద్దరు ఉంటే కాని కుదరదు’ అన్నాడు భగత్‌సింగ్.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ

Pages