S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొట్టిపాటి ఫ్లెక్సీలు చించిన అగంతకులు

అద్దంకి, ఏప్రిల్ 30: అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పేరుతో పోతురాజుగండి వద్దనున్న గొట్టిపాటి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం ఉదయం గుర్తు తెలియని అగంతకులు చింపేశారు. ఫ్లెక్సీలు చించారన్న వార్తతో గొట్టిపాటి అనుచరులు కార్యాలయం వద్దకు చేరారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వరాదని, సంయమనం పాటించాలని ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరులకు చెప్పారని సమాచారం. టిడిపిలో చేరిన గొట్టిపాటి ఫ్లెక్సీలను గత ఐదురోజుల్లో రెండుసార్లు చించివేశారు. ఎవరైనా ఆకతాయితనంగా ఫ్లెక్సీలు చించినా అద్దంకిలో ఉద్రిక్తతలు రేకెత్తే అవకాశం ఉంది.

అక్టోబర్ 2లోగా ఎనిమిది పట్టణాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం

ఒంగోలు,ఏప్రిల్ 30: ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీలోగా జిల్లాలోని ఎనిమిది పట్టణాలను బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. శనివారం కేంద్రప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ స్వచ్ఛ్భారత్ మిషన్ కార్యదర్శి రాజీవ్‌గౌబా, సంయుక్తకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ విశాఖపట్నం నుండి జిల్లాకలెక్టర్లు, మునిసిపల్‌కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ,బహిరంగ మలవిసర్జన రహిత వార్డులప్రకటన అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కేంద్రప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ గౌభా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్చ్భారత్ అమలులో ఆదర్శవంతంగా ఉందన్నారు.

నల్లమల చెంచు గిరిజనుల ఉత్పత్తులకు జాతీయ స్థాయి గుర్తింపు తెస్తా

పెద్దదోర్నాల, ఏప్రిల్ 30: నల్లమల చెంచు గిరిజనుల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పథకాలు రూపొందిస్తున్నట్లు గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రకాష్ అన్నారు. మండల కేంద్రమైన పెద్దదోర్నాల్లోని గిరిజన సహకార సంస్థ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజనుల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని శనివారం శ్రీశైలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నల్లమల గిరిజన సంక్షేమ సంఘం నాయకులు దాసరి అంకన్న, చెవుల అంజయ్య, మంతన్న, మాజీ ఎంపిటిసి కోటన్న తమ గూడెంలలో ఉన్న సమస్యలను ఎండి దృష్టికి తెచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు జిల్లా ప్రజలకు అందేవరకు నిరంతరం కృషి

ఒంగోలు,ఏప్రిల్ 30: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు జిల్లా ప్రజలకు అందేవరకు నిరంతరం కృషిచేస్తానని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. జిల్లాకలెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి ఒకసంవత్సరం విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భంగా శనివారం తనక్యాంపు కార్యాలయంలో పలువురు జిల్లాఅధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందించారు. అనంతరం కలెక్టర్ కేక్‌ను కట్‌చేసి విలేఖర్లతో మాట్లాడారు.

ఎబిపాలెంలో అగ్ని ప్రమాదం

పర్చూరు, ఏప్రిల్ 30: అన్నంబొట్లవారిపాలెం గ్రామ శివారులోని పెంకుటిల్లు కొట్టంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 20 ఎకరాల్లోని 150 క్వింటాళ్ల పొగాకు దగ్ధమైన సంఘటన శనివారం వేకువజామున జరిగింది. గ్రామానికి చెందిన అప్పలనేని నాగేంద్రకు చెందిన పొగాకు మండె దగ్ధమైనట్లు పరిశీలనకు వెళ్లిన డిప్యూటీ తహశీల్దార్ షఫీ అహ్మద్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన పెంకుటిల్లు కొష్టాం కిటికీ వద్ద పెట్రోల్ బాటిల్, కవర్‌లో శనగపప్పు ఉన్నట్లుగా బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరైనా కావాలని చేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సుస్థిరమైన చేపల వేట సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి

చీరాలరూరల్, ఏప్రిల్ 30: సముద్రంలో లభించే మత్స్య సంపద అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మత్స్యకారులపై ఉందని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సముద్రంలో వేట సాగిస్తే మత్స్యకారులు అభివృద్ధి చెందుతారని కాకినాడ ఫిషరీస్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ బి వెంకటేశ్వర్లు అన్నారు. మండలం లోని వాడరేవు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి ఎరిపిల్లి రమణ ఆధ్వర్యంలో జాతీయ సమగ్ర మత్స్య విధానం 2016 ముసాయిదాపై ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని మత్స్యకారులతో శనివారం సమావేశం నిర్వహించారు.

‘ప్రభుత్వ బడుల నిర్వీర్యానికి కుట్ర’

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 30: ప్రభుత్వ పాఠశాల విద్యను పటిష్ఠ పర్చాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్‌కు ఉపయోగకరంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు విమర్శించారు. స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా మూసివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నుతోందని అన్నారు. పాఠశాలల మూసివేత కారణంగా అటు విద్యార్థులు విద్యకు దూరం కావడమే కాకుండా ఇటు ఉపాధ్యాయుల భవిష్యత్ సైతం ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు.

తేలని నీలాపుపేట అగ్నిబాధితుల సంఖ్య!

గార, ఏప్రిల్ 30: మండలం శ్రీకూర్మం పంచాయతీ నీలాపుపేటలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో బాధిత కుటుంబాలు ఎన్ని అన్నది ఇంత వరకు ధ్రువీకరణ కాలేదు. అందుకు ఎమ్మెల్యే.. తహశీల్దారుల ప్రకటనలే నిదర్శనం. అగ్ని ప్రమాదంలో నష్టం వాటిల్లిన ప్రతి కుటుంబానికి చేయూత ఇవ్వాలని, 14కుటుంబాలకు ప్రభుత్వపరంగా సహాయం అందజేయాలని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అధికారులకు సూచించారు. అయితే అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 12 ఇళ్లకు సంబంధించిన కుటుంబాలకే ప్రభుత్వ సహాయం అందజేస్తామని తహశీల్దారు ఎ.సింహాచలం స్పష్టం చేసారు. చివరకు ఎం.పి.

‘తెలుగు ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు’

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 30: కేంద్ర, రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలు అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీనే ముద్దాయిగా చూపిస్తూ తెలుగు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయని ఎపిసిసి అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో నిజంగా విభజన ద్వారా అన్యాయం జరిగితే సరిదిద్దడానికి ఎన్‌డిఎ ప్రభుత్వానికి రెండేళ్లు సమయం చాలదా అన్నారు.

రోడ్డుప్రమాదంలో డ్రైవర్ మృతి,

టెక్కలి, ఏప్రిల్ 30: జాతీయ రహదారిపై అంజనాపురం కూడలి వద్ద శనివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పెళ్లి వ్యాన్‌లో వెళ్తున్న 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీకాకుళం వైపు నుంచి చిలక క్యాంటీన్‌కు ఆర్మీ సామగ్రితో వెళ్తున్న వ్యాన్ ముందుగా అదే రూట్‌లో కోటబొమ్మాళి నుంచి సవరగోపాలపురంలోని పెళ్లికి వెళ్తున్న వ్యాన్‌ను వెనుక నుంచి ఢీ కొన్న సంఘటనలో డ్రైవర్ టి.రవీంద్ర(35) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికి వెళ్తున్న 12 మందికి స్వల్పగాయాలయ్యాయి. పెళ్లి వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వారిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించి వైద్యసేవలు అందిస్తున్నారు.

Pages