S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీంలో ‘నీట్’పై విద్యార్థుల పిటిషన్ తిరస్కృతి

దిల్లీ: సిబిఎస్‌ఇ సిలబస్, రాష్ట్రాల సిలబస్ వేర్వేరుగా ఉంటుంది గనుక ‘నీట్’ (మెడికల్ కోర్సులకు దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్)ను నిలిపివేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. సిలబస్ వేర్వేరుగా ఉన్నందున తాము స్వల్పకాలంలో ‘నీట్’కు సిద్ధం కాలేమని విద్యార్థులు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. విద్యార్థుల వాదనను ధర్మాసనం త్రోసిపుచ్చింది.

తాగునీటి సమస్యపై యూత్ కాంగ్రెస్ ధర్నా

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద శనివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపఎన్నికలపై ఆసక్తి చూపే సిఎం కెసిఆర్ తాగునీటి సమస్యపై కొంత శ్రద్ధ చూపినా జనం సమస్యలు గట్టెక్కేవని యూత్ కాంగ్రెస్ నేతలు అన్నారు. ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

నిరాటంకంగా పోలవరం పనులు: దేవినేని

విజయవాడ: అభివృద్ధిని అడ్డుకునే వారు ఎన్ని ఆరోపణలు చేసినా పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను నిలిపివేసే ప్రసక్తే లేదని, అనుకున్న గడువుకు పనులను పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా జలాల మట్టం బాగా అడుగంటినందున గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కేందుకు 5 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డును కోరామన్నారు.

జగన్‌తో కుమ్మక్కైన కొందరు బిజెపి నేతలు!

విజయవాడ: వైకాపా అధ్యక్షుడు జగన్‌తో కొందరు బిజెపి నాయకులు కుమ్మక్కై రాష్ట్భ్రావృద్ధికి అడ్డుతగులుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శనివారం ఇక్కడ ఆరోపించారు. అవినీతిపరుడైన జగన్‌కు దిల్లీలో కేంద్రమంత్రులు అపాయిమెంటు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్‌తో కొందరు బిజెపి నేతలు చేతులు కలపడం దారుణమన్నారు.

ఎపి ప్రజలతో మోదీ, బాబు చెలగాటం:జగన్

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం ప్రకారం నీరుగార్చారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ప్రత్యేకహోదా సంజీవని కాదని బాబు వ్యాఖ్యానించడం వల్లే కేంద్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, ఎపి ప్రజలతో ప్రధాని మోదీ, చంద్రబాబు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని చెప్పిన ఎన్‌డిఎ నేతలు ఇపుడు లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చినపుడే ఎపికి నిధులు, రాయితీలు దండిగా వస్తాయని జగన్ అన్నారు.

కర్నూలులో 16నుంచి దీక్ష చేస్తా: జగన్

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై ఎపి సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే 16 నుంచి కర్నూలులో తాను నిరవధిక దీక్ష చేస్తానని వైకాపా అధినేత జగన్ ప్రకటించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో చేపడుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులను చంద్రబాబు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును బాబు స్యామ్‌ల మయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందన్నారు.

హైదరాబాద్‌లో క్రికెట్ బుకీల అరెస్టు

హైదరాబాద్: నగరంలోని మోతీనగర్ లలితా టవర్ వద్ద శనివారం ఉదయం ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి, క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న అయిదుగురు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి 5.40 లక్షల రూపాయల నగదు, ల్యాప్‌టాప్, 15 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పియుడిఎ వైస్‌చైర్మన్ ఇంట్లో ఎసిబి దాడి

అనంతపురం: పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై శనివారం ఉదయం ఎసిబి అధికారులు దాడి చేసి సుమారు 2 కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ఇతని ఇంటిపై నెల రోజుల వ్యవధిలో ఎసిబి అధికారులు రెండోసారి దాడులు చేశారు.

శ్రీకాళహస్తి వద్ద ‘ఎర్ర’కూలీల అరెస్టు

చిత్తూరు: శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో పోలీసులు శనివారం ఉదయం ఆకస్మిక దాడులు జరిపి నలుగురు కూలీలను అరెస్టు చేశారు. వారు ప్రయాణిస్తున్న కారును, భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నరు.

తాటిచెట్టు విరిగిపడి ముగ్గురు మృతి

వరంగల్: ఎండిపోయిన తాటిచెట్టు వారిపాలిట మృత్యుదేవతగా ఎదురైంది. ఆరుబయట నిద్రిస్తున్న వారిపై తాటిచెట్టు విరిగిపడడంతో ముగ్గురు మరణించిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి స్టేషన్ ఘనపూర్ మండలం సిర్పూర్‌గుట్ట వద్ద జరిగింది. ఈ గుట్టపై రాళ్లు కొట్టేందుకు గోదావరిఖని నుంచి ఇటీవల కొంతమంది కూలీలు వచ్చి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. గుడిసెల పక్కన ఆరుబయట నిద్రిస్తున్న వారిపై తాటిచెట్టు కూలడంతో రాణి (38), ఆమె కుమారుడు శ్రీకాంత్ (18), కుమార్తె కల్యాణి (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Pages