S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగాల్‌లో ప్రశాంతంగా పోలింగ్

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఒకటి, రెండు చోట్ల స్వల్ప సంఘటనలు మినహా ఎక్కడా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. 53 నియోజకవర్గాల్లో అయిదో విడత పోలింగ్‌కు 14,500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు రాష్టమ్రంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి మమత, ఆమెపై పోటీ చేస్తున్న నేతాజీ మనవడు చంద్రబోస్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఈరోజు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం!

నల్గొండ: తమను పరీక్షలకు అనుమతించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఈ ఘటన జరిగింది. తమకు కళాశాల యాజమాన్యం హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని ముగ్గురు విద్యార్థులు భవనంపైకి ఎక్కి కిందకు దూకేస్తామని బెదిరించారు. సమాచారం తెలిశాక పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని ఆ విద్యార్థులను కిందకు రప్పించారు. హాజరు శాతం తక్కువైనందునే వారికి హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని యాజమాన్యం చెబుతోంది.

వేలంలో ‘కింగ్‌ఫిషర్’కు స్పందన నిల్!

ముంబయి: పలు బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల మేరకు బకాయిపడిన విజయ్ మాల్యాకు చెందిన ‘కింగ్‌ఫిషర్’ ట్రేడ్‌మార్కులు, బ్రాండ్‌లను వేలంలో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో 17 మంది రుణదాతలు శనివారం ఉదయం 11-30 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ వేలం పాట ప్రారంభించారు. కింగ్‌ఫిషర్ బ్రాండ్‌లు, ట్రేడ్‌మార్కులకు 366.70 కోట్ల రూపాయలతో బిడ్డింగ్ ప్రారంభమైంది. గడువు ముగిసినప్పటికీ వీటిని వేలంలో పాడేందుకు ఎవరూ ముందుకు రానందున వేలం పాటల్ని వాయిదా వేశారు. గతంలో మాల్యాకు చెందిన ఇంటిని 150 కోట్లకు విక్రయించాలని బహిరంగ వేలానికి పెట్టినా కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.

అభిమానికి అక్షయ్ క్షమాపణ

ముంబయి: అభిమానిపై తన బాడీగార్డు చేయి చేసుకున్నందుకు బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పాడు. ఇకముందు తన అభిమానులకు ఇలాంటి చేదు అనుభవాలు ఉండవని ఆయన హామీ ఇచ్చాడు. కొద్దిరోజుల క్రితం ముంబయి విమానాశ్రయానికి అక్షయ్ వచ్చినపుడు ఆయన అభిమాని ఒకరు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో అభిమానిని పక్కకు లాగేసి అక్షయ్ బాడీగార్డు కాస్త చేయి చేసుకున్నాడు. అభిమానిని తన బాడీగార్డు కొట్టినట్టు ఆ సమయంలో తనకు తెలియదని, అందుకే ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయినట్లు అక్షయ్ చెబుతున్నాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిశాక అక్షయ్ తన అభిమానికి ‘సారీ’ చెప్పాడు.

దిల్లీలో డీజిల్, పెట్రోల్ టాక్సీలపై నిషేధం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ మహానగరంలో ఆదివారం (మే 1) నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే టాక్సీలను నడపడానికి వీలు లేదని సుప్రీం కోర్టు శనివారం స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్‌కు బదులు గ్యాస్ (సిఎన్‌జి)తో నడిచేలా టాక్సీలను మార్పుచేసుకునేందుకు గడువును పెంచేందుకు అనుమతించే ప్రసక్తి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ గడువు శనివారంతో ముగిసింది. గడువును పెంచితే తమ వాహనాలను సిఎన్‌జి వినియోగానికి అనువుగా మార్చుకుంటామని టాక్సీ సంఘాలు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం త్రోసిపుచ్చింది. వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకే పెట్రోల్, డీజిల్ టాక్సీలను నిషేధించారు.

సురేష్ ప్రభుపై కేజ్రీవాల్ ప్రశంసలు!

దిల్లీ: ప్రధాని మోదీతో పాటు బిజెపి నాయకులపై తరచూ విమర్శలు గుప్పించే దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇపుడు రైల్వేమంత్రి సురేష్ ప్రభుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రైల్వేమంత్రిని అభినందించారు. మహారాష్టల్రో తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న లాతూరు ప్రాంతానికి 11 సార్లు నీటిరైళ్లను పంపినందుకు కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు.

మరీ ఇంత అహంకారం వద్దు: పొంగులేటి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి కెటిఆర్ మితిమీరిన అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేస్తానని కెటిఆర్ అనడం అహంకారానికి పరాకాష్ట అన్నారు. రాజకీయ దాహంతో వ్యవహరిస్తున్న సిఎం కెసిఆర్‌కు తెలంగాణలో నీటికష్టాలు, కరవు పరిస్థతులు పట్టవని విమర్శించారు.

‘హోదా’ ఇస్తేనే బిజెపికి విలువ

విజయనగరం: ఎపికి ప్రత్యేకహోదా ఇస్తేనే బిజెపి పట్ల జనంలో విశ్వసనీయత ఉంటుందని టిడిపి నేత గద్దె బాబూరావు అన్నారు. బిజెపి, టిడిపి కలిసి పనిచేస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందని, ఒంటరిగా పోటీ చేస్తే బిజెపి ఒక్క చోట కూడా గెలవలేదన్నారు.

ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు

విజయవాడ: విభజన చట్టంలో హామీలను, ప్రత్యేక హోదా డిమాండ్‌ను తీర్చేలా ప్రధాని మోదీ కృషి చేస్తారన్న నమ్మకం తమకు ఉందని ఎపి హోంమంత్రి చినరాజప్ప శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. దీన్ని సాధించేందుకు టిడిపి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. బిజెపితో తమ పొత్తు 2019 ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు.

ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరాటం: బొత్స

విశాఖ: ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేవరకూ తాము కేంద్రంతో పోరాడతామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ శనివారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ప్రత్యేకహోదా హామీపై బిజెపికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులున్నా ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా మే 2న అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాజీనామాలు చేయించాకే వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలన్నారు.

Pages