S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైక్‌ను ఢీకొన్న లారీ: ఆలుమగలు మృతి

నల్గొండ: వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో దంపతులు మరణించిన ఘటన వలిగొండ మండలం నాతళ్లగూడెం వద్ద శనివారం సాయంత్రం జరిగింది. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

బ్రాండిక్స్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

విశాఖ: వేతనాలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని యాజమాన్యం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సంస్థ ఎదుట శనివారం నాడు మహిళా కార్మికులు మళ్లీ ఆందోళన ప్రారంభించారు. ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని సుమారు 300 మంది మహిళా కార్మికులను అరెస్టు చేశారు. తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మహిళా కార్మికులు ఆరోపించారు.

6న దిల్లీలో కాంగ్రెస్ ఆందోళన

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన, దేశంలో కరవుపరిస్థితులు, కుంభకోణాల పేరిట తప్పుడు ఆరోపణలు తదితర విషయాలపై నిరసన గళం వినిపించేందుకు మే 6న దిల్లీలో భారీ ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు భవనం వరకూ జరిగే ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ పాల్గొంటారు.

విపక్ష నేతలతో కెసిఆర్ విందు భోజనం!

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ విందు భోజనంలో పాల్గొన్న సన్నివేశం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కుమార్తె వివాహ వేడుకకు కెసిఆర్‌తో పాటు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్, ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్, కాంగ్రెస్ నేతలు ఒకే టేబుల్‌పై విందు భోజనం చేశారు.

స్పీకర్ కోడెలతో వైకాపా ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్: వైకాపాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు శనివారం ఇక్కడ ఎపి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. టిడిపిలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాజేంద్రనాథ్ రెడ్డి, విశే్వశ్వర రెడ్డి తదితరులు స్పీకర్‌ను కోరారు. రాజీనామాలు చేయించాకే ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలన్నారు.

‘హోదా’పై మోసగిస్తున్న వెంకయ్య,బాబు

కర్నూలు: ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి స్పష్టం చేసినా వెంకయ్య ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై పోరాటం చేసేందుకు మే 2న విజయవాడలో వామపక్షాలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాయన్నారు.

అలాంటి తప్పు బిజెపి చెయ్యకూడదు: పవన్

హైదరాబాద్: అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పు చేసిందని, ప్రత్యేకహోదా హామీని విస్మరించి నేడు బిజెపి అలాంటి తప్పుచేయకూడదని తాను కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదంటూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ తన మనోభావాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని, పార్లమెంటు నుంచి గెంటివేసి కాంగ్రెస్ ఘోరమైన తప్పు చేసిందని, ఆ అవమానాన్ని సీమాంధ్రవాసులు మరచిపోలేదు, మరచిపోరు కూడా అని ఆయన అన్నారు.

పెళ్లివ్యాన్ బోల్తా: ఇద్దరు మృతి

విశాఖ: విశాఖ జిల్లా రోలుగుంట వద్ద శనివారం ఓ పెళ్లివ్యాన్ బోల్తాపడి ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన పదిమందిని ఆస్పత్రికి తరలించారు.

నిర్లక్ష్యం వహిస్తే దండన ఖాయం: హరీష్

మహబూబ్‌నగర్: తెలంగాణలో మిగతా జిల్లాలతో పోల్చితే మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు సరిగా అమలు జరగడం లేదని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీష్ రావు తీవ్రంగా మందలించారు. అడ్డాకుల మండలంలో ఆయన శనివారం చెరువు పనులను ప్రారంభించారు. ఇరిగేషన్ అధికారుల తీరు మారకుంటే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.

పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు కృషి: బాబు

విశాఖ: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అన్నివిధాలా ఆధునీకరిస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ పోలీస్ కమిషనరేట్ కొత్త భవనాన్ని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ప్రారంభించారు. డిజిపి రాముడు, అదనపు డిజి ఠాకూర్, పలువురు ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు హాజరయ్యారు.

Pages