S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిటిసి మోహన్‌కు 15రోజుల రిమాండ్

కాకినాడ: కాకినాడలో డిటిసి (డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్)గా పనిచేస్తూ భారీగా అక్రమార్జనకు పాల్పడిన ఆదిమూలం మోహన్‌ను ఎసిబి అధికారులు శనివారం కృష్ణాజిల్లా చల్లపల్లి జైలుకు తరలించారు. ఈరోజు ఉదయం ఆయనను విజయవాడ ఎసిబి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15రోజుల రిమాండ్ విధించారు. కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో మోహన్‌కు చెందిన ఇళ్లలో ఎసిబి అధికారులు సోదాలు చేసి వందల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.

ఎటిఎంలో చోరీలు చేసే ముఠా అరెస్టు

ఆదిలాబాద్: నకిలీ ఎటిఎం కార్డులను తయారుచేసి జిల్లాలో పలు ఎంటిఎం కేంద్రాల్లో నగదు చోరీ చేసిన హర్యానాకు చెందిన రెహ్మాన్ అనే ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని ముఠాకు చెందిన మరో నలుగురిని కూడా అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. వీరి నుంచి నకిలీ ఎటిఎం కార్డులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యేక హోదాపై టిడిపి పాలిట్‌బ్యూరోలో చర్చ?

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ప్రకటించడంతో తమ నిరసన గళం వినిపించేందుకు టిడిపి నేతలు సమాయత్తమవుతున్నారు. మే 3న ఇక్కడ జరిగే పార్టీ పాలిట్‌బ్యూరో సమవేశంలో ప్రత్యేక హోదాపై చర్చించాలని కొందరు నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్రం వైఖరిపై నిరసన తెలిపేలా తీర్మానం చేయాలని వారు భావిస్తున్నారు. మే 2న ఎపి క్యాబినెట్ సమావేశంలోనూ, అదే రోజు జరిగే టిడిపి సమన్వయ కమిటీ భేటీలోనూ ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. అయితే, ఎన్‌డిఎలో తాము భాగస్వామిగా ఉన్నందున కేంద్రంపై బహిరంగ విమర్శలు చేయకుండా తమ వాణి వినిపించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.

పోలీసులపై కూలీల రాళ్లదాడి

తిరుపతి: ఇక్కడికి సమీపంలోని బాకరాపేట ఘాట్‌రోడ్‌లో శనివారం ఉదయం కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లదాడి చేశారు. పోలీసులు వస్తున్నట్లు పసిగట్టిన కూలీలు రాళ్లు రువ్వడం ప్రారంభించగా ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. వెంటనే తేరుకున్న పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో కూలీలు పరుగుతీశారు. ఓ కూలీని అరెస్టు చేసి, 37 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రశాంతంగా ఎంసెట్

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 29 : ఎంసెట్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం మెడికల్, అగ్రికల్చర్ విభాగాల పరీక్షలు జెన్ టియు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఐదు పరీక్షా కేంద్రాలతో పాటు భోగాపురం మండలం రావాడలోని అవంతి కాలేజి కేంద్రంలో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాశారు. ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటలకు దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

నీటి ఎద్దడి రాకూడదు

విజయనగరం, ఏప్రిల్ 29: జిల్లాలో వేసవిలో ఎటువంటి మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి కిమిడి మృణాళిని,ప్రజాప్రతినిధులతో కలసి తాగునీరు, నీరు-చెట్టు, ఉపాధి హామీ, సాగునీటి ప్రాజెక్టులు, పంట సంజీవని అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా నివారించాలని స్పష్టంచేసారు. కలెక్టర్ పర్యవేక్షణలో తాగునీటి సరఫరా తదితర అంశాలపై మానటిరింగ్ సెల్ ఏర్పాటుచేసి సమీక్షించాలని ఆదేశించారు.

చివరికి జగన్ ఒక్కరే మిగులుతారు!

విజయనగరం, ఏప్రిల్ 29: ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోనరెడ్డిపై ఆపార్టీలో ఏ ఒక్కరికి నమ్మకం లేకపోవడంతోనే ఆ పార్టీ నేతలు టిడిపిలోకి క్యూ కడుతున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘనాథరెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం జడ్పీ అతిథిగృహంలో సహచర మంత్రిరాష్ట్రగ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడిమృణాళిని, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యేలు చిరంజీవులు, కె ఎ నాయుడులతో కలిసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. జగన్ పెద్ద స్వార్థపరుడుగా అభివర్ణించారు.

స.హ. చట్టం స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 29: సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని కార్యకర్తలు దెబ్బతీయోద్దని రాష్టస్రమాచార హక్కు చట్టం కమిషనర్ పిజయబాబు సూచించారు. శుక్రవారం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో మూడు జిల్లాల అధికారులు, సహచట్టం కార్యకర్తల అవగాహ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చట్టం అమల్లోకి వచ్చి పదేశ్లు కావస్తున్నా అవగాహన లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.సమాచారం అడిగిన వారికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత అందరికి ఉందని స్పష్టం చేసారు. సామాన్యుడికి న్యాయం జరిగే విషయంలో చట్టపరిధిలో ఉద్యోగులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం మేలు కాదని హితవు పలికారు.

నగరంలో కాలుష్యాన్ని తగ్గించాలి

విశాఖపట్నం, ఏప్రిల్ 29: ప్రస్తుతం నగరంలో నెలకొన్న 80 మైక్రోగ్రామ్స్ కాలుష్య స్థాయిని దేశ వార్షిక సరాసరి అయిన 60 మైక్రోగ్రామ్స్ స్థాయికి తగ్గించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కాలుష్య నివారణ మండలి అధికారులను ఆదేశించారు. క్రమేపీ ఈ కాలుష్య స్థాయిని తగ్గించుకుంటూ భవిష్యత్‌లో విశాఖను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. శుక్రవారం మాధవధార వుడా కాలనీలో కాలుష్య నివారణ మండలి జోనల్ కార్యాలయాన్ని మంత్రి సందర్శించి భవనంపై ఏర్పాటు చేసిన 25 కిలో వాట్స్ సోలార్ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు.

ఉరుకులు పరుగులు

విశాఖపట్నం, ఏప్రిల్ 29: ఎంసెట్ 2016 ప్రశాంత వాతావరణంలో శుక్రవారం జరిగింది. ఎంసెట్‌కు విశాఖ నగరంలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్ష జరిగింది. ఇంజనీరింగ్‌కు 18,075 మంది దరఖాస్తు చేసుకోగా, 17,297 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన మెడిసిన్ ఎంట్రెన్స్ పరీక్షకు 7,519 మంది దరఖాస్తు చేసుకోగా, 7,127 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌కు 33 పరీక్షా కేంద్రాలను, మెడిసిన్‌కు 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Pages