S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడకత్తెరలో మనోహర్!

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉంచుతానని అట్టహాసంగా ప్రకటించిన శశాంక్ మనోహర్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. బిసిసిఐ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న అతను ఒకవైపు కోర్టు కేసులతో, మరోవైపు వివిధ సభ్య సంఘాల విమర్శలతో సతమతమవుతున్నాడు. ఎవరికీ సమాధానం చెప్పుకోలేక, ఎవరినీ ఒప్పించలేక, ఏ వర్గాన్నీ మెప్పించలేక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

- బిట్రగుంట

వకార్‌తోనే నష్టం!

పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ వ్యవహార శైలి కారణంగానే ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తాయా? పాక్ జట్టు వరుస పరాజయాలకు, వైఫల్యాలకు వకార్ కారణమా? అవుననే అంటున్నారు పలువురు మాజీ క్రికెటర్లు. ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాక్ దారుణ వైఫల్యాలకు వకారే బాధ్యుడని స్పష్టం చేస్తున్నారు. జట్టు వైఫల్యాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి సమర్పించిన నివేదికలో వకార్ పలు సంచలన వ్యాఖ్యాలు చేశాడు. సీనియర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారిలో ఎవరికీ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న ఆలోచనే లేదని విమర్శించాడు.

ఒలింపిక్స్‌కు నేమార్

బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్ ఒలింపిక్స్‌లో ఆడతాడా లేదా అన్న సస్పెన్స్‌కు తెరపడింది. బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతని సేవలు తమకు అత్యవసరమని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (బిఎఫ్‌సి) చాలాకాలం క్రితమే స్పష్టం చేసింది. బ్రెజిల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నేమార్‌ను ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు వీలుగా రిలీజ్ చేయాలని బార్సిలోనా క్లబ్‌ను కోరింది. బిఎఫ్‌సి విజ్ఞప్తిపై బార్సిలోనా నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. బ్రెజిల్‌లోనే ఆగస్టు 3 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఒలింపిక్స్ కోసం నేమార్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

స్టాండ్స్‌లో రొనాల్డో!

చాంపియన్స్ లీగ్ సాకర్ చాంపియన్‌షిప్‌లో టాప్ స్కోరర్ క్రిస్టియానో రొనాల్డో లేకుండా రియల్ మాడ్రిడ్ మ్యాచ్‌లను ఊహించడం కూడా కష్టమే. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ, సబ్‌స్టిట్యూట్ అవసరం లేకుండా రొనాల్డో అలుపులేకుండా ఆడడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, మాంచెస్టర్ సిటీతో ఇటీవల మ్యాచ్ జరిగినప్పుడు రొనాల్డో ఒక ప్రేక్షకుడి మాదిరిగా స్టాండ్స్‌లో కనిపించాడు. కాలి గాయంతో బాధపడుతున్న పోర్చుగల్ సూపర్ స్టార్ రొనాల్డో మాంచెస్టర్ సిటీతో రియల్ మాడ్రిడ్ ఢీకొన్న మ్యాచ్‌లో ఆడలేదు. భార్య ఇరినా ష్రాక్‌తో కలిసి అతను స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ని తిలకించాడు.

ఫలితం లేని రికార్డులు!

అమియా మాలిక్, శ్రావణి నందా నెలకొల్పిన జాతీయ రికార్డులకు ఫలితం లేకుండా పోయింది. వారు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలను దాదాపుగా కోల్పోయారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తడం గమనార్హం. రియో ఒలింపిక్స్‌కు అవసరమైన అర్హతా ప్రమాణాలను పరీక్షించేందుకు జాతీయ గ్రాండ్ ప్రీ పేరుతో క్వాలిఫయర్స్‌ను నిర్వహించారు. మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో శ్రావణి నందా 11.23 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. అంతేగాక, ఒలింపిక్స్‌లో ఈ విభాగం నుంచి పోటీపడే అర్హతను సంపాదించింది.

ఎక్కుపెట్టిన బాణం..

* టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ జిమ్ లేకర్ పుస్తకం ‘ఓవర్ టు మి’ అప్పట్లో పెను తుపానుకు కారణమైంది. ఇంగ్లాండ్ క్రికెట్‌లో నెలకొన్న అవినీతి, అక్రమాలపై ఎక్కుపెట్టిన బాణం అతని పుస్తకం. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన లేకర్ సహజంగానే క్రికెట్ పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. అసాధారణ ప్రతిభావంతుడైనప్పటికీ జాతీయ జట్టులోనేకాదు.. కౌంటీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. చాలా మంది క్రికెటర్లపై అతను వాడిన పదజాలం, చేసిన ఆరోపణలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు చెలరేగాయి.

- సత్య

వంద రౌండ్ల బాక్సింగ్!

* ఈ రోజుల్లో బాక్సింగ్ పోటీలు పది రౌండ్లను మించవు. ప్రత్యర్థిని మళ్లీ లేవకుండా చిత్తుచేస్తే ‘నాకౌట్’ విజయం దక్కుతుంది. అలాగాక, ఇద్దరూ హోరాహోరీగా పోరాడితే, వారికి న్యాయమూర్తులు ఇచ్చిన పాయింట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేస్తారు. అయితే, 1900 సంవత్సరానికి ముందు బాక్సింగ్ ఫైట్స్‌కు ఖచ్చితమైన నిబంధనలు ఉండేవికావు. పందాలుకాసి నిర్వహించే బాక్సింగ్ పోటీలు 100 రౌండ్ల వరకూ జరిగేవి. పోటీపడడానికి బాక్సర్లకేకాదు... ఇంత సుదీర్ఘ ఫైట్స్‌ను చూడడానికి ప్రేక్షకులకు కూడా ఎంతో ఓపిక కావాలి కదూ!

చేతులపై రేసు

సీల్ హాప్’ లేదా ‘నకుల్ హాప్’ అనే వింత ఆట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రచారంలో ఉంది. పోటీదారులు రెండు పిడికిళ్లు బిగించాలి. కాలి వేళ్లను కూడా చేతుల మాదిరిగానే వంచాలి. అప్పుడు పిడికిలి బిగించిన చేతులు, కాలివేళ్లు మాత్రమే నేలకు తగులుతుండగా ముందుకు దూకాలి. ఈ విధంగా ఎవరు ఎక్కువ దూరం వెళితే వారిదే గెలుపు. ఎంతో అనుభవం ఉంటేగానీ ఈ ఆటకు ప్రయత్నించకూడదు. ఏమాత్రం పొరపాటు జరిగినా వేలి కణుపులు విరిగిపోవడం ఖాయం.

రంగారావు నెల జీతం ఎంత?

రంగారావు ప్రతి నెలా జీతంలో ఇంటి అద్దెకు 21%, కుటుంబ గ్రాసానికి 33%, పాప చదువుకు 9%, బట్టలకి 8%, ఇతర ఖర్చులకు 13%, ఖర్చు కాగా మిగిలినది అవసరాలకని ఎకౌంటులో ఉంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి 28000 రూపాయలు పాప పేరు మీద బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన తరువాత అకౌంట్‌లో 5600 రూపాయలు బాలెన్స్ ఉంటుంది. అయితే రంగారావు నెల జీతం ఎంత?

జవాబు: రంగారావు నెల జీతం 35,000 రూపాయలు.

-చామర్తి వెంకట రామకృష్ణ

పుణ్యఫలం

ఒక రోజు శంకరుడు భిక్ష కోసం ఒక ఇంటి ముందు నిలిచాడు ‘్భక్షాందేహీ!’ అంటూ మూడుసార్లు పిలిచాడు.
అది ఒక పూరిల్లు.
శంకరుడు ప్రహరీ బయట నుండి భిక్ష అర్థించాడు.
కాసేపటికి తలుపు చాటు నుండి వృద్ధ స్ర్తి తల బయటకు పెట్టి అతన్ని చూసింది.
‘్భక్షాందేహీ!’ అని అర్థించాడు.
‘నాయనా! నీకు భిక్ష పెట్టటానికి మా ఇంట్లో ఏమీ లేవు. కాని భిక్ష అడిగిన వారిని ఉత్త చేతులతో పంపకూడదు. నా దగ్గర ఒక్క ఉసిరికాయ ఉంది. దానిని నీకు అభ్యంతరం లేకపోతే భిక్షగా ఇస్తాను’ అని ఆ ముసలి తల్లి చెప్పింది.
‘తల్లీ నీ భిక్ష స్వీకరించడానికి నాకేం అభ్యంతరం? అలాగే’ శంకరుడు బదులు ఇచ్చాడు.

-వియోగి

Pages