S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/09/2016 - 00:04

జీవ జన్యు పరివర్తక ప్రకియ ద్వారా రూపొందుతున్న మహా సంకరజాతి విత్తనాలను వంగడాలను మన రైతులకు అంటగట్టడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు కొనసాగిస్తున్న కుట్రకు మన ప్రభుత్వాలు సహకరిస్తుండడం నడిచిపోతున్న వైపరీత్యం.

04/07/2016 - 22:51

భరతమాతను దిగ్భ్రాంతికి గురి చేస్తున్న దృశ్యాలివి...్భరతీయులు విస్మయ నయనాలతో వీక్షిస్తున్న వికృత చిత్రాలివి! భరత మాతకు జయం కోరబోమని నిర్లజ్జగా నిర్భయంగా ప్రకటిస్తున్న వారి ముందు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు చతికిలపడి ఉన్న దృశ్యం మొదటిది..ఈ దృశ్యం వివిధ రాష్ట్రాలలో ఆవిష్కృతమవుతోంది!

04/07/2016 - 06:24

బిహార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడం హర్షణీయమైన పరిణామం! సామాజిక రుగ్మతలపై పోరాడుతున్న జాతీయతా నిష్ఠకల వారికి ఇది నైతిక బలాన్ని పెంపొందించగలదన్నది నిరాకరించలేని నిజం. ఇంతవరకూ గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అందువల్ల సామాజిక వికృతులకు వ్యతిరేకంగా జరుగుతున్న సమరంలో గుజరాత్ ఇలా స్ఫూర్తిప్రదాయకం అయింది.

04/06/2016 - 07:01

కొందరు ఘరానాలు వ్యూహాత్మక వౌనం పాటిస్తున్నారు, మరికొందరు ప్రముఖులు పొంతన కుదరని వివరణలు ఇచ్చుకుంటున్నారు. విస్ఫోటన ప్రకటంపనల తాకిడికి దిమ్మదిరిగిన వారు చేష్టలుడిగి పడి ఉన్నారు. కొందరు మాత్రం తేరుకొని నంగి నంగిగా మాట్లాడుతూ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా వివిధ దేశాలలో నిక్షిప్తమై ఉన్న నల్లడబ్బు పుట్టలు వికృత ధ్వనులతో పగిలిపోతుందడడం ఈ విస్ఫోటనం.

04/04/2016 - 06:23

మహారాష్టల్రో 1956 నుంచి అమలులో ఉన్న హైందవ దేవాలయ ప్రవేశాధికార శాసనం-హిందూ ప్లేస్ ఆఫ్ వర్‌షిప్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్-లోని నియమావళిని అమలు జరపవలసిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంబాయి హైకోర్టు ఆదేశించడం ధార్మిక సంప్రదాయాల సమీక్షకు మరోప్రాతిపదిక!

04/02/2016 - 02:42

భారత, ఐరోపా సమాఖ్యల పదమూడవ వాణిజ్య శిఖర సమావేశం విఫలం కావడం ఆశ్చర్యకరం కాదు. ఇరవైతొమ్మిది దేశాల ఈ సమాఖ్య-ఐరోపా యూనియన్-తో మన వాణిజ్య సంబంధాలు, దౌత్య సంబంధాలు అంటీ ముట్టని రీతిలో సాగుతుండడం, ఏళ్ల తరబడి ఆవిష్కృతమవుతున్న అంతర్జాతీయ దృశ్యం.

04/01/2016 - 00:20

పంజాబ్‌లోని పఠాన్‌కోటలోని మన వైమానిక దళ స్థావరంపై జనవరి నెల రెండవ తేదీన జరిగిన దాడితో జాయిష్ ఎ మెహమ్మద్ జిహాదీ ముఠా నాయకుడైన మసూద్ అఝార్‌కు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వ సంయుక్త పరిశోధక బృందం-జాయింట్ ఇనె్వస్టిగేషన్ టీమ్-జిట్-వారు బుధవారం తేల్చివేశారట...పాకిస్తానీలు ఇలా తేల్చివేస్తూ ఉన్న సమయంలో మన ప్రత్యేక పరిశోధన బృందం వారు నోట్లో వేళ్లు వేసుకుని నిశే్చష్టులై ఉండడం ఆవిష్కృతమవుతున్న వై

03/31/2016 - 00:00

ఉత్తరఖండ్ ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం బుధవారం జారీ చేసిన తాత్కాలిక ఆదేశం ఒక అనిశ్చిత స్థితిని తొలగించింది, మరో అనిశ్చిత స్థితిని సృష్టించింది! ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఈ వైచిత్రి కొనసాగనుండడం ఊపిరాడని ఉత్కంఠకు ప్రాతిపదిక...శాసనసభల చరిత్రలో అపూర్వమైన అద్భుతాన్ని ఉత్తరఖండ్ ఉన్నత న్యాయమూర్తి యు.సి.్ధ్యని మంగళవారం నాడు ఆవిష్కరించడం రాజ్యాంగ నిపుణులను సైతం గందరగోళానికి గురి చేసిన విపరిణామం!

03/29/2016 - 23:52

ఇదీ మన సినిమా..ఇదీ మన సత్తా అని ప్రతి తెలుగువాడు తనివితీరా ఆస్వాదించాల్సిన తరుణమిది. ఆరున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమాకు ఎండమావిగా మారిన జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఆలస్యంగానైనా సరైన సినిమాకే దక్కింది. అదీ తెలుగు దర్శకత్వ ప్రతిభకు, తెలుగు ఆలోచనా పదునుకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిన బాహుబలికే స్వర్ణకమలం లభించడం మరింత ఆనందదాయకం.

03/29/2016 - 02:07

రాష్టప్రతి పాలన విధించడంవల్ల ఉత్తరఖండ్‌లో కొనసాగుతున్న అవకాశ వాద రాజకీయ కాండ పరిసమాప్తి కావడం లేదన్నది స్పష్టం! ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్టప్రతి పాలన విధించడానికి దోహదం చేసిన ప్రహసనం ఎవరిది న్యాయమన్నది కూడ జటిలమైన ప్రశ్న! న్యాయాన్యాయాలను నిర్ధారించడానికి సర్వోన్నత న్యాయస్థానం వారి ప్రమేయం అనివార్యమన్నది కూడ మరింత స్పష్టమైపోయింది.

Pages