S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/17/2017 - 23:38

దేశంలోని చిన్న వ్యాపారాలు సమూలంగా అంతరించిపోవడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది! ఆహార రంగంలోని చిల్లర వ్యాపారంలోకి విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలు చొరబడడానికి 2012లోనే ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందువల్ల ‘రసాయన సంకర ఆహార పదార్థాల’-ప్రాసెస్డ్ ఫుడ్-ను అమ్మడానికై బహుళ జా తీయ వాణిజ్య సంస్థలు దుకాణాలు తెరిచాయి, తెరుస్తున్నాయి.

05/17/2017 - 01:10

నమామి గంగే!- పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న నీటిశుద్ధి మహా ప్రణాళిక వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేరణ కలిగిస్తుండడం హర్షణీయం. నర్మదా నదిని కాలుష్య రహితంగా తీర్చి దిద్దడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇ ప్పుడు కంకణం కట్టుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడ ప్రభుత్వాలు జల సంబంధ ప్రగతిని సాధించడానికి రెండేళ్లకు పైగా పథకాలను అమలు చేస్తున్నాయి.

05/16/2017 - 00:51

చైనా ప్రభుత్వం తమ రాజధాని బీజింగ్‌లో ఏ ర్పాటు చేసిన ‘ఒకే క్షేత్రం, ఒకే మార్గం’ వాణిజ్య సదస్సును బహిష్కరించడం ద్వారా మన ప్రభుత్వం ‘ప్రచ్ఛన్న బీభత్సకాండ’ను మరోసారి నిరసించింది. వివిధ దేశాల మధ్య, ఖండాల మధ్య భూతల, సముద్ర మార్గాలను నిర్మించడం ఈ ‘ఒకే క్షేత్రం, ఒకే మార్గం’ బృహత్ పథకం లక్ష్యమని చైనా ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. నిజానికి ఇది చైనా సాగిస్తున్న బహుముఖ దురాక్రమణలో భాగం!

05/15/2017 - 00:18

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన వల్ల సంభవించిన తక్షణ ఫ లితం.. ఉభయదేశాలు మరింత సన్నిహితం కావడం! ఉభయ దేశాల సాన్నిహిత్యం సహజమైనది, చారిత్రక ప్రస్థాన పథంలో నిరంతరం ప్రస్ఫుటించినది, సనాతనమైనది. ద్వైపాక్షిక స్నేహ సంబంధాలు క్షీణించడం అపవాదం-ఎక్సెప్షన్-మాత్రమే! ఈ ‘గ్రహణం’ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయిందన్న భావం విస్తరించడం మోదీ ప్రభుత్వ దౌత్యనీతి సాధించిన మరో విజయం.

05/13/2017 - 01:50

మహా సంకర రకం ఆవాలను మన దేశంలో పండించడానికి జాతీయ ‘జీవజన్యు సాంకేతిక వ్యవహారాల నిర్దేశక మండలి’ అంగీకరించడం ‘పర్యావరణం కాలుష్యం’ సాధించిన మరో ‘విజయం’. మానవుల ఆరోగ్యంపై విష రసాయన పరిజ్ఞానం చేస్తున్న దాడికి మరో సాక్ష్యం. ఇంతవరకు దేశంలో మహా సంకర రకం పత్తిని మాత్రమే పండిస్తున్నారు. పత్తిని మనుషులు భోంచేయరు, దుస్తుల రూపంలో ధరిస్తారు.

05/12/2017 - 01:29

ఈ ‘ఐస్‌క్రీమ్’ తింటే మీరు మిలమిల మెరిసిపోతారు, ఈ ‘చాక్లెట్’ తింటే మీకు ఏనుగంత బలం వస్తుంది- ఇలాంటి సమ్మోహనకరమైన వాణిజ్య ప్రకటనలతో వినియోగదారులను వంచించడం ‘ప్రపంచీకరణ’ మారీచ మృగ మాయాజాలం. ఈ వంచన క్రీడను నిరోధించడానికి ‘్భరత ఆహార ప్రమాణ, సురక్షా మండలి’ వారు పూనుకుంటుండడం హర్షణీయ పరిణామం.

05/11/2017 - 02:35

మన దేశానికి చెందిన కులభూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ రహస్య సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్ష అమలు జరుగరాదని అంతర్జాతీయ న్యా యస్థానం- ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్- ఆదేశించడం వౌలిక మానవీయ నైతిక సూత్రాలకు విజయం, మన దేశానికి లభించిన మరో దౌత్య విజయం. మన దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరిణామం. నిరపరాధి అయిన జాధవ్ సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలన్నది మన దేశ ప్రజల ఆకాంక్ష.

05/10/2017 - 01:53

పశువుల దాణా అవినీతి వ్యవహారంలో రాష్ట్రీయ జనతాదళ్- రాజద- అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌కు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలన్నింటినీ విచారించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్థారించడం న్యాయ ప్రక్రియకు సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేసింది.

05/09/2017 - 08:58

ఫ్రాన్స్ అధ్యక్షుడుగా స్వతంత్ర అభ్యర్థి ఎమాన్యుయెల్ మాక్రోన్ ఎన్నిక కావడం ఆశ్చర్యకరం కాదు, ఆశ్చర్యకరం కూడ.. రెండు వారాల క్రితం జరిగిన మొదటి ‘వర్తులం’-్ఫస్ట్ రౌండ్- ఎన్నికల్లో ప్రధాన జాతీయ పక్షాల అభ్యర్థులు ఘోర పరాజయం పాలు కావడంతో మాక్రోన్ ఎన్నిక ఖాయమన్నది ఏప్రిల్‌లోనే స్పష్టమైపోయింది. రంగంలో మిగిలిన ఇద్దరు అభ్యర్థుల మధ్య మాత్రమే రెండవ ‘వర్తులం’ ఎన్నిక జరిగింది.

05/06/2017 - 08:16

విశ్వహిత స్వభావమైన భారతీయ చరిత్ర శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల యాబయి ఏడు నిముషాలకు పునరావృత్తం అయింది. మన దేశం నిర్మించిన దక్షిణ ఆసియా ఉపగ్రహం ‘జిసాట్ 09’ అంతరిక్షంలోకి దూసుకొని వెళ్లింది. భారత శాస్త్ర విజ్ఞాన పతాకం వినీల అంబరంలో మరింత ఎత్తున రెపరెపలాడడం మొదలైంది.

Pages