S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

03/21/2017 - 01:06

పచ్చదనానికి, ప్రపంచీకరణకు మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు ప్రపంచీకరణకు బాసటగా నిలబడడం దీర్ఘకాల ప్రగతికి గొడ్డలిపెట్టు. భూమిని, పర్యావరణను కబళిస్తున్న కేంద్రీకృత కృత్రిమ ప్రగతి కేవలం తాత్కాలిక ప్రగతి భ్రాంతి మాత్రమే!

03/20/2017 - 01:00

ఆదిత్యనాథ్ యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం భారత జాతీయ సంప్రదాయాలకు అనుగుణమైన పరిణామం! ఈ సంప్రదాయాల ధ్యాసలేని రాజకీయ విశే్లషకులకు, ఈ జాతీయతా పథంనుండి తప్పిపోయిన పాశ్చాత్య భావదాసులకు ఒక ‘యోగి’ లేదా ఒక సర్వసంగ పరిత్యాగి ముఖ్యమంత్రి కావడం గురించి విచిత్రమైన ప్రశ్నలు ఉదయించవచ్చు! కానీ ‘యోగులు’ సర్వసంగ పరిత్యాగులు స్వార్థరహితులై వ్యక్తిగత రాగద్వేషాలకు దూరంగా ఉండడం మాత్రం జాతీయ సంప్రదాయం.

03/18/2017 - 00:54

గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి వీలుగా రాజ్యాంగ సవరణను చే యాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించడం చైనా ప్రభుత్వ విస్తరణ వ్యూహంలో భాగం. గిల్గిత్- బాల్టిస్థాన్ అనాదిగా జమ్మూ కాశ్మీర్‌లో భాగం, జమ్మూ కాశ్మీర్ అనాదిగా భారత్‌లో భాగం. 1947లో దేశ విభజన జరిగింది. అఖండ భారత్‌లోని ‘ఇస్లాం’ జన బాహుళ్య ప్రాంతాలు పాకిస్తాన్‌గా ఏర్పడ్డాయి.

03/17/2017 - 00:52

మంద పెట్టడం- అన్న మాటలు మరుగున పడిపోతుండడానికి కారణం సేంద్రియ వ్యవసా యం మరుగున పడిపోతుండడం. గ్రామీణ ప్రాంతాలలో ‘మంద’లు కనుమరుగై పోయాయి. ‘మంద’లే లేనప్పుడు మాటలు ఎలా గుర్తుంటాయి? తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ‘మందల’కు జీవం పోస్తుండడం మంచి పరిణామం. లక్షలాది గొర్రెలను పల్లెపట్టుల పచ్చిక బీడులలో ‘కాపరులు’ మేపగల కమనీయ దృశ్యాలు పునరావిష్కృతం కాబోతున్నాయి.

03/16/2017 - 07:30

కేంద్ర ‘ఆహార శుద్ధి’-్ఫడ్ ప్రాసెసింగ్-పారిశ్రామిక వ్యవహారాల మంత్రిణి హరిస్మృత కౌర్ బాదల్‌ను పదవి నుంచి తొలగించాలని ‘స్వదేశీయ జాగరణ మంచ్’-స్వజామ-వారు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడం గురించి ప్రచారం జరగడం లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో చివరి ఘట్టం పోలింగ్ జరుగుతుండిన సమయంలోనే ‘స్వజామ’ వారు ‘్భజపా’ ప్రభుత్వం వారి పెట్టుబడుల విధానాన్ని మరోసారి వ్యతిరేకించడం ఆసక్తికర పరిణామం!

03/15/2017 - 00:21

‘ఉత్తర’ పరాజయాల తరువాత కాంగ్రెస్ భవితవ్యంపై చర్చ జరగడం సహజమైన వ్యవహారం. కానీ, రాహుల్ గాంధీ ‘నాయకత్వ పటిమ’ గురించి కూడ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోందని ప్రచారం కావడం హాస్యరస పూరకమైన, అపహాస్య విస్ఫోటకమైన పరిణామం. ‘రాహుల్ నాయకత్వం’ అన్న పదాలను వినగానే జనానికి జుగుప్సాకరమైన అనుభూతి కలుగుతుండడం దశాబ్ది చరిత్ర.

03/14/2017 - 00:40

కలకత్తా ఉన్నత న్యాయమూర్తి చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్ అనుచిత ప్రవర్తన కొనసాగుతుండడం ఆశ్చర్యకరం కాదు. ఏడాదికి పైగా న్యాయమూర్తి కర్ణన్ దుందుడుకుతనం ప్రదర్శిస్తున్నాడు, బహిరంగంగా సర్వోన్నత న్యాయస్థానం-సుప్రీం కోర్ట్-పై తిరుగుబాటు చేస్తున్నాడు.

03/13/2017 - 01:00

వౌలిక జాతీయతత్త్వ నిష్ఠ విస్తరిస్తోంది, వౌలిక సాంస్కృతిక ధ్యాస పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ తదితర రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ క్రమానుగత విస్తరణను మరోసారి ధ్రువపరిచాయి. ఈ ఎన్నికల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం ఇబ్బడి ముబ్బడిగా ప్రభావంతం, ప్రభావశీలం కావడం నిరాకరింపజాలని నిజం.

03/11/2017 - 02:55

బహుళ దశల ‘మతదాన’- మల్టీఫేజ్ పోలింగ్- పద్ధతి దశాబ్దుల తరబడి వ్యవస్థీకృతం కావడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రమే పరిమితమైన ప్రహసనం! ఈ ‘ప్రహసనం’ విలక్షణమా? విపరీతమా? అన్న విషయమై ఏకాభిప్రాయం లేకపోవడం కూడ మూడు దశాబ్దులకు పైగా కొనసాగుతున్న సందిగ్ధం.

03/10/2017 - 00:12

ప్రభుత్వేతర విద్యాసంస్థలు పుట్టగొడుగుల వలె పుట్టుకొని రావడం దేశమంతటా దశాబ్దుల తరబడి కొనసాగుతున్న ప్రహసనం. ‘విద్య’ వాణిజ్యంగా మారిపోవడం ఈ ‘ప్రహసనం’లోని ఇతివృత్తం! అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోను ప్రభుత్వేతర కళాశాలల యాజమాన్యాలు నియమ నిబంధనలను ఉల్లంఘించడం దశాబ్దుల బహిరంగ రహస్యం! నియమ నిబంధనలను పాటించినప్పటికీ విద్యా వ్యాపారులు, వాణిజ్య వేత్తలు దండిగా లాభాలను దండుకోవచ్చు!

Pages