S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

06/23/2017 - 00:39

రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయదారుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తుండడం, ‘అన్నదాతలు’ ఆత్మహత్యలకు పాలుపడుతుండడం గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సమాంతర పరిణామాలు! వ్యవసాయ రంగంలో దేశమంతటా నెలకొని ఉన్న వైరుధ్యాలలో ఇది ఒక్కటి మాత్రమే! రైతులు చెల్లించవలసిన ఋణాలను చెల్లించనక్కరలేదని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ధారించాయి.

06/21/2017 - 01:43

‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ భారత జా తీయ విజయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం సాధించగలిగిన సాంస్కృతిక విజయం. బుధవారం నాడు మన దేశంలోను దాదాపు అన్ని విదేశాలలోను కోట్లాదిమంది జరిపే యోగ విద్యా విన్యాసాలు మానవీయ సంస్కారానికి మాసిపోని ప్రతీకలు! ‘యోగం’ సాంస్కృతిక ప్రపంచీకరణ- కల్చరల్ గ్లోబలైజేషన్-కు చిహ్నం.

06/20/2017 - 00:59

రాష్టప్రతి పదవికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బిహార్ ‘రాజ్యపాల్’-గవర్నర్-రామనాథ్ కోవిద్ ఎంపిక కావడం అద్భుతమైన పరిణామం! భాజపా అభ్యర్థి ఆధికారికంగా ‘జాతీయ ప్రజాస్వామ్య సంఘటన’- నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ-ఎన్‌డిఏ-అభ్యర్థి. అందువల్ల రామ్‌నాథ్ కోవిద్ మన దేశానికి పదునాలుగవ రాష్టప్రతిగా ఎంపిక కావడం కేవలం లాంఛనం.

06/19/2017 - 01:39

రైతులకు విత్తనాలను అమ్ముతున్న వాణిజ్య సంస్థల ‘ఔదార్యాన్ని’ మనం అభినందించి తీరవలసిందే! ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారు స్వయంగా అభినందిస్తున్నారు. విత్తనాల ధరలను పదిశాతం తగ్గించాలని ప్రముఖ వాణిజ్య సంస్థలు నిర్ణయించడం ఈ ‘ఔదార్యం..!’ పత్తివిత్తనాల ధరలకు మాత్రం ఈ తగ్గింపు వర్తించదట!

06/17/2017 - 02:00

సౌదీ అరేబియా మన దేశానికి గొప్ప మిత్ర దే శమన్నది జరుగుతున్న ప్రచారం. సౌదీ అరేబియా అమెరికాకు మరింత మిత్ర దేశం. అమెరికా కూడ మనకు మిత్రదేశం. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సౌదీ అరేబియా, పశ్చిమ ఆసియాలోని దాని మిత్రదేశాలు గొప్ప కృషి చేస్తున్నాయన్నది అమెరికా ధ్రువపరచిన ప్రచారం. అమెరికా ధ్రువీకరణ ప్రధానం, వాస్తవం ప్రధానం కాదు.

06/16/2017 - 00:44

ప్రభుత్వం భూమి అంగుళం కూడ అన్యాక్రాం తం కాకపోవడం సంతోషం. ప్రభుత్వానికి రూపాయి కూడ నష్టం కలుగకపోవడం మరింత ఆనందకరం. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్, బాలానగర్ తదితర గ్రామాలలో ఆరువందల తొంబయి మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని దళారీలు, రాజకీయ వేత్తలు, ఇతరేతరులు అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం చేసిన స్పష్టీకరణ జనానికి ఆనందకరం.

06/15/2017 - 01:27

రైతులను ఆదుకొనడానికి తెలుగు రాష్ట్రాల ప్ర భుత్వాలు వివిధ పథకాలను అమలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది! ఈ ప్రచారం హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం మంగళవారం జారీచేసిన ఆదేశాలకు విచిత్రమైన నేపథ్యం.. సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నందున రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలి. కాని తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను రైతులకు ప్రభుత్వాల సహాయం అందడం లేదని ఆరోపిస్తూ వేఱు వేఱు ‘న్యాయ యాచిక’లు హైకోర్టులో దాఖలయ్యాయి.

06/14/2017 - 00:56

చలికాలంలో ఉన్ని దుప్పటిని కప్పుకోవాలని భావించడం సహజం. చలికాలంలో ‘దు ప్పటి’ దొరకలేదు. ఉన్నవారు దుర్బుద్ధితో దుప్పటిని అమ్మలేదు, ప్రదానం చేయలేదు. హేమంత తుషారం ఆవిరైపోయింది, శిథిల శిశిరం గతించింది. వసంతం వెనుకబడింది! మండువేసవిలో గ్రీష్మతాపంతో విలవిలలాడుతున్న వారికి ఉన్ని దుప్పటి ఎందుకు? అయినప్పటికీ ‘షాంఘయి సంత’లో మనకు ‘ఉన్ని దుప్పటి’ని ప్రదానం చేశారు.

06/13/2017 - 00:37

‘ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువలు కనరానప్పుడు అది కంఠశోష..’ అన్నది ఆచార్య సి.నారాయణరెడ్డి 1980వ దశకంలో ఆవిష్కరించిన జీవన వేదం, మానవ జీవన పరామార్థం! సినారె నోట దశాబ్దుల తరబడి ఈ ‘్భష’ నర్తించింది, తెలుగు వారి హృదయాలను నర్తింపచేసింది. ఆయన ‘్భష’ అశేష ప్రజల ఆత్మలను పలకరించింది, ప లకరిస్తోంది, అనంతంగా పలికిస్తూ ఉంటుంది!

06/12/2017 - 01:08

గోసంతతి పరిరక్షణ కోసం వివిధ ఉన్నత న్యాయస్థానాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలను, ఆదేశాలను జారీ చేస్తుండడం హర్షణీయ పరిణామం. హైదరాబాద్ హై కోర్టు న్యాయమూర్తి బి.శివశంకర రావు- ‘గోమాత జాతీయ సంపద అని, కన్నతల్లి ప్రతిరూపమని, భగవంతుని రూపమని’ శుక్రవారం తన తీర్పులో అభివర్ణించడం సనాతన భారతీయ సంప్రదాయాలకు సరికొత్త ధ్రువీకరణ!

Pages