S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/12/2017 - 01:06

కోల్‌కతా, నవంబర్ 11: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో శనివారం మొదలైన రెండు రోజుల టూర్ మ్యాచ్ తొలి రోజును శ్రీలంక బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్‌గా మార్చుకుంది. ఫలితంగా ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరు చేసింది. సదీర సమరవిక్రమ 77 బంతుల్లో 74 పరుగులు చేశాడు. దిముత్ కరుణరత్నే (50 రిటైర్డ్ హర్ట్)తో కలిసి అతను మొదటి వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

11/12/2017 - 01:05

కరాచీ, నవంబర్ 11: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణికి, తీసుకుంటున్న ఇష్టానుసార నిర్ణయాలకు అడ్డుకట్ట వేయడంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పూర్తిగా విఫలమైందని పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రం ధ్వజమెత్తాడు.

11/12/2017 - 01:02

న్యూఢిల్లీ, నవంబర్ 11: జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ) కమిటీ సభ్యుడిగా భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ సేవలు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వరకే కొనసాగుతాయని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. బోర్డుకు సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సీఓఏ) శనివారం సమావేశమైనప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే, సీఓఏ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

11/12/2017 - 01:01

దుబాయ్, నవంబర్ 11: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తొలి అకాడెమీని ప్రారంభించాడు. దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్ట్స్ క్లబ్, ఆర్క స్పోర్ట్స్ క్లబ్ సంయుక్తంగా ఈ క్రికెట్ అకాడెమీని మొదలు పెట్టాయి. దీనికి ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడెమీ (ఎంఎస్‌డిసిఎ)గా నామకరణ చేశారు.

11/12/2017 - 00:59

కరాచీ, నవంబర్ 11: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి చాలాకాలం తర్వాత ప్రపంచ క్రికెట్‌లో సానుకూల స్పందన కనిపించింది. ఐదేళ్లు అమల్లో ఉండే విధంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)తో పిసిబి ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని అనుసరించి ఇరు దేశాల మధ్య ఏటా ఒకసారి చొప్పున మొత్తం ఐదు టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లు జరుగుతాయి.

11/12/2017 - 00:58

అడెలైడ్ ఓవల్, నవంబర్ 11: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌తో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్ 192 పరుగుల తేడాతో గెల్చుకుం ది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా సీఏ ఎలెవెన్ 76 ఓవర్లలో 9 వికె ట్లకు 233 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

11/12/2017 - 00:58

వరల్డ్ కప్ 2018 క్వాలిఫయర్స్‌లో మొత్తం 210 జట్లు బరిలోకి దిగాయి. ఆతిథ్య దేశం హోదాలో రష్యా, క్వాలిఫయర్స్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచి, తమతమ గ్రూప్స్‌లో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన మరో 23 జట్లు ఇప్పటికే వరల్డ్ కప్‌కు అర్హత సంపాదించాయి. 171 జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా, వరల్డ్ కప్‌లో ఇంకా మిగిలి ఉన్న 8 స్థానాల కోసం 16 జట్లు ఢీ కొంటాయి.
*

11/12/2017 - 00:56

అగర్తలాలోని రవీంద్ర శతవర్షి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అధికారి నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాను స్వీకరిస్తున్న
భారత మేటి జిమ్నాస్ట్, అర్జున అవార్డీ దీపా కర్మాకర్

11/11/2017 - 00:51

న్యూఢిల్లీ, నవంబర్ 10: శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు టీమిండియాను జాతీయ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతినిచ్చి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

11/11/2017 - 00:48

కోల్‌కతా, నవంబర్ 10: పటిష్టమైన టీమిండియాను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఢీకొనేందుకు ముందు, బల పరీక్షకు శ్రీలంక సిద్ధమైంది. శనివారం మొదలయ్యే రెండు రోజుల టూర్ మ్యాచ్‌లో కెప్టెన్ దినేష్ చండీమల్‌సహా పలువురు కీలక ఆటగాళ్లు తమతమ ఫిట్నెస్, ఫామ్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేయడం ఖాయం. చండీమల్ ఇప్పటి వరకూ భారత్‌లో ఒక్క టెస్టు కూడా ఆడలేదు.

Pages