S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/05/2017 - 01:29

బెంగళూరు, మార్చి 4: ఆస్ట్రేలియాతో శనివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైన రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్‌కి టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ (32) దూరమయ్యాడు. కంగారూలతో పుణెలో జరిగిన తొలి టెస్టులో భుజానికి తగిలిన గాయం నుంచి మురళీ విజయ్ కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. దీంతో రెండో టెస్టులో అతని స్థానాన్ని అభినవ్ ముకుంద్‌తో భర్తీ చేశారు.

03/05/2017 - 01:27

న్యూఢిల్లీ, మార్చి 4: రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ సొంత రాష్టమ్రైన హర్యానా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన తనకు హర్యానా ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇప్పటివరకూ అందలేదని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘ఒలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని తెస్తానని నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.

03/05/2017 - 01:26

ఆక్లాండ్, మార్చి 4: న్యూజిలాండ్‌తో ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్కులో శనివారం జరిగిన నిర్ణాయక చివరి వనే్డలో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్‌ను మట్టికరిపించి 3-2 తేడాతో ఈ సిరీస్‌ను గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు కివీస్ బ్యాట్స్‌మెన్‌ను సమర్థవంతంగా కట్టడి చేసింది.

03/05/2017 - 01:24

ఆంటిగ్వా, మార్చి 4: వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు బోణీ చేసింది. మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ సిరీస్‌లో భాగంగా ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 45 పరుగుల తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును మట్టికరిపించి తమ పోరాటాన్ని ఘనంగా ప్రారంభించింది.

03/04/2017 - 01:52

బెంగళూరు, మార్చి 3: బెంగళూరులో శనివారం నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో తలపడే భారత జట్టుకు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

03/04/2017 - 01:50

బెంగళూరు, మార్చి 3: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. పుణెలో జరిగిన ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ (70 పరుగులకు 12 వికెట్లు) ధాటికి కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా అతని సహచర బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమవడంతో భారత జట్టు 333 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

03/04/2017 - 01:49

దుబాయ్, మార్చి 3: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నెంబర్ వన్ డబుల్స్ ఆటగాడు రోహన్ బొపన్న, అతని కొత్త భాగస్వామి మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలెండ్) టైటిల్‌కు చేరువయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వీరు భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, గులెర్మో గార్సికా లోపెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు.

03/04/2017 - 01:46

బెంగళూరు, మార్చి 3: పుణెలో భారత్‌లో సాధించిన భారీ విజయం గతించిన అంశమని, శనివారంనుంచి జరిగే రెండో టెస్టులో భారత్‌ను ఎదుర్కోవడానికి కొత్తగా మొదలుపెట్టాలని తాము అనుకుంటున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌పై 333 పరుగుల భారీ ఆదిక్యతతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ 3 రోజుల్లోనే ముగియడం గమనార్హం.

03/04/2017 - 01:45

బెంగళూరు, మార్చి 3: పుణెలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరపరాజయానికి దారి తీసిన లాంటి‘చెత్త ప్రదర్శన’ను తమ జట్టు పునరావృతం చేయబోదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు హామీ ఇచ్చాడు. అంతేకాదు ఆ ఘోరపరాజయంనుంచి తమ జట్టు గుణపాఠాలు నేర్చుకుందని కూడా ఆయన చెప్పాడు. ‘మరోసారి అలాంటి చెత్త ప్రదర్శనను మీరు చూడరు.

03/04/2017 - 01:44

తిరువనంతపురం, మార్చి 3: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో జీవిత కాలం పాటు నిషేధానికి గురైన టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. క్రికెట్ ఆడకుండా తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ శ్రీశాంత్ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో అతనిపై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని బిసిసిఐకి కేరళ హైకోర్టు నోటీసు పంపింది.

Pages