S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/28/2018 - 22:43

పుణే, అక్టోబర్ 28: తమను తక్కువ అంచనా వేస్తూ, విమర్శలు చేసిన వారికి సరైన సమాధానమిచ్చామని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆష్లే నర్స్ వ్యాఖ్యానించాడు.

10/28/2018 - 05:02

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్-వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల నుంచి ఉద్వాసన పలకడం వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్ వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

10/28/2018 - 00:09

పారిస్, అక్టోబర్ 27: ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత షట్లర్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది. శుక్రవారం రాత్రి జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వీరిద్దరూ పరాజయం పాలయ్యారు. 40 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మూడో సీడ్ సింధు చైనా క్రీడాకారిణి హె బింగ్‌జియావో చేతిలో 13-21, 16-21 తేడాతో ఓటమి చెందింది.

10/28/2018 - 00:06

పుణే, అక్టోబర్ 27: పుణే వేదికగా శనివారం జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ సాధించినప్పటికీ, వెస్టిండీస్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత్ 43 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

10/27/2018 - 00:11

పుణే: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు వనే్డల సిరీస్‌లో భాగంగా శనివారం పుణేలో జరిగే మూడో వనే్డ మ్యాచ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా ఆధిపత్యం చెలాయించాలని కోహ్లీ సేన యోచిస్తోంది. తొలి వనే్డలో గెలుపుతో రెండో వనే్డలోనూ ఆధిపత్యం చెలాయించడం ద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకున్న కోహ్లీ సేనకు నిరాశే ఎదురైంది.

10/26/2018 - 23:21

భారత్‌తో జరిగిన రెండో వనే్డలో భారీ స్కోరును ఛేదించే యత్నంలో ఆఖరిక్షణంలో మ్యాచ్ టైగా ముగించడంలో కాస్త నిరుత్సాహానికి గురైనా తమ ఆటగాళ్లు ప్రత్యర్థి టీమ్‌లోని పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా తిరిగొచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చారని వెస్టిండీస్ కోచ్ స్టువర్ లా అన్నాడు.

10/26/2018 - 23:20

మస్కట్, అక్టోబర్ 26: డిఫెండింగ్ హాకీ చాంపియన్ భారత్ ఖండాంతర ఆధిపత్యం కోసం తహతహలాడుతోంది. శనివారం ఇక్కడ జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) సెమీఫైనల్స్‌లో ఆసియా గేమ్స్ గోల్డ్‌మెడలిస్టు జపాన్‌తో తలపడనుంది.

10/26/2018 - 23:19

పారిస్, అక్టోబర్ 26: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, మహిళల, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ దూసుకువెళ్తున్నారు. గురువారం రాత్రి వేర్వేరుగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లలో వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నారు. మూడో సీడ్ క్రీడాకారిణి సింధు జపాన్‌కు చెందిన సయాకా సాటోపై 21-17, 21-16తో పైచేయి సాధించింది.

10/26/2018 - 05:53

న్యూఢిల్లీ: ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాకు మళ్లీ వనే్డ జట్టులో చోటు లభించింది. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో చివరి మూడు మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ గురువారం జట్టును ఎంపిక చేసింది. అదే విధంగా టీ-20 సిరీస్‌కు జట్టును శుక్రవారం ప్రకటించనుంది. ఇదే జట్టు ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లోనూ ఆడుతుందని అంటున్నారు.

10/25/2018 - 22:14

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, అక్టోబర్ 25: వెస్టిండీస్‌కు చెందిన ఎంటర్‌డైనింగ్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రేవో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, భారలత్‌లో ఐపీఎల్ మాదిరి వివిధ దేశాల్లో జరిగే టీ-20 ఫార్మాట్ టోర్నీల్లో పాల్గొంటానని ప్రకటించాడు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన 35 ఏళ్ల డ్వెయిన్ బ్రేవో 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

Pages