S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/25/2018 - 23:35

ఆంటిగువాలో జరిగిన మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఆసీస్ 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. డానియేలా వయాట్ (43), హీథర్ నైట్ (25) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లకు చేరుకోలేకపోయారు. ఆష్లే గార్డ్‌నర్ 22 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టింది.

11/25/2018 - 04:41

సిడ్నీ: ఇప్పటికే 7 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన కోహ్లీ సేన ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా తొలి పోరులో తొలిసారిగా ఓటమిని చవిచూసింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో నిర్వాహకులు రద్దు చేశారు.

11/25/2018 - 01:37

న్యూఢిల్లీ, నవంబర్ 24: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని, దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరోసారి విజేతగా నిలిచిన భారత దిగ్గజం, సూపర్ బాక్సర్ మేరీ కోమ్ వ్యాఖ్యానించింది. మ్యాచ్ తర్వాత రింగ్ నుంచి బయటకు రావడంతో స్టేడియంలో కిక్కిరిసిన జనసమూహంతో పాటు అధికారులు చుట్టుముట్టి అభినందనలు తెలిపారు.

11/25/2018 - 01:34

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ దిశగా అంచెలంచెలుగా దాటుతూ వెళ్లిన మరో భారత బాక్సర్ 21 ఏళ్ల సోనియా చాహల్ ఫైనల్ పోరులో రజతంతో సరిపెట్టుకుంది. 57 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన వాహ్‌నెర్ ఒర్నెల్లా గాబ్రీలీ చేతిలో 4-1 తేడాతో పరాజయం పాలైంది. ఆఖరి పోరులో 29-28, 29-28, 28-29, 29-28, 29-28 తేడాతో ఓడిపోయింది.

11/25/2018 - 01:32

లక్నో, నవంబర్ 24: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ 300లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, సమీర్ వర్మ ఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన రెండో సీడ్ సైనా నెహ్వాల్ ఇండోనేషియాకు చెం దిన రసెల్లీ హర్త్వాన్‌ను 12-21, 21-7, 21-6 తేడాతో ఓడించింది.

11/25/2018 - 01:32

జపాన్‌లోని ఫకుషిమాలో బేస్‌బాల్ స్టేడియాన్ని సందర్శించిన సందర్భంగా జపాన్ ప్రధాని షిన్జో అబే, అక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులతో కలిసి ఫొటోలకు ఫొజులిస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్.

11/25/2018 - 01:47

ఎస్టోనియాలోని టాలిన్‌లో స్విట్జర్లాండ్‌తో యూరోపియన్ కర్లింగ్ చాంపియన్‌షిప్స్ మహిళల ఫైనల్‌లో విజయం సాధించి, ట్రోఫీని అందుకున్న స్వీడన్ జట్టు సభ్యులు ఆగ్నస్ నొచెన్‌హార్, సోఫియా మాబెర్గ్స్, సారా మెక్‌మానస్, జొహన్నా హెల్డిన్, అనా హాసెల్‌బర్గ్.

11/25/2018 - 00:08

న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత దిగ్గజ మహిళా బాక్సర్, మణిపురి మాణిక్యం, 35 ఏళ్ల మేరీ కోమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. శనివారం ఇక్కడ జరిగిన ఏఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో మేరీ కోమ్ ఖాతాలో ఆరో స్వర్ణం జమ అయింది.

11/24/2018 - 01:19

మెల్బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్పించాడు. తొలుత టాస్ గెలిచిన కోహ్లీ సేన బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌ను ప్రారంభించిన ఆసిస్ 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలి టీ-20 మాదిరిగానే రెండో టీ-20కి కూడా వరుణుడు అడ్డుపడడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌కు 19 ఓవర్లలో 137 పరుగుల లక్ష్యం విధించారు.

11/24/2018 - 00:28

నార్త్ సౌత్ (ఆంటిగ్వా), నవంబర్ 23: ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20లో లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకు అప్రతిహతంగా దూసుకెళ్లి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియాకు సెమీఫైనల్స్‌లో నిరాశ ఎదురైంది. గత ఏడాది ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఐసీసీ వరల్డ్ టీ-20 సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న కలలు అడియాశలయ్యాయి.

Pages