S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/22/2018 - 06:44

గౌహతి: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి వనే్డలో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. ఐదు వనే్డలలో భాగంగా ఆదివారం ఇక్కడి బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వనే్డలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

10/22/2018 - 05:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనే అథ్లెట్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను రెట్టింపు చేయాలని, బిజినెస్ క్లాస్‌లలో విమానాల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు విజ్ఞప్తి చేశాడు.

10/22/2018 - 05:07

దుబాయ్, అక్టోబర్ 21: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అబ్బాస్ ఆదివారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో 3వ స్థానంలో నిలిచాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అబ్బాస్ 17 వికెట్లు పడగొట్టాడు.

10/22/2018 - 05:05

ఒడెనె్స (డెన్మార్క్), అక్టోబర్ 21: భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఆదివారం జరిగిన డెన్మార్క్ ఓపెన్ ఫైనల్‌లో మరోసారి నిరాశపరిచింది. ప్రపంచ నెంబర్-1 క్రీడాకారిణి, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ చేతిలో 13-21, 21-13, 6-21 తేడాతో ప్రపంచ నెంబర్-10వ ర్యాంకర్ సైనా పరాజయం పాలైంది.

10/21/2018 - 01:36

గౌహతి, అక్టోబర్ 20: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఘన విజయంతో ఉన్న టీమిండియా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లపై దృష్టి సారించింది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్నా జట్టులో మిడిల్డార్ సమస్య గత ఎంతోకాలం నుంచి వేధిస్తూనే ఉంది.

10/21/2018 - 01:16

వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో నిర్వహించే ప్రపంచ కప్‌లో అంబటి రాయుడును మిడిలార్డర్‌లో కీలకమైన నెంబర్ 4 స్థా నంలో బరిలోకి దింపితే ఎంతోకాలంగా వేధిస్తున్న ఈ సమస్య కు ఒక పరిష్కారం దొరుకుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడుతున్నాడు. రాయుడు ఇటీవల ఆడిన పలు మ్యాచ్‌లలో నెంబర్ 4 స్థానంలోనే బరిలోకి దిగడంతో చాలాసార్లు ఆశించిన ఫలితాలు వచ్చాయి.

10/21/2018 - 01:19

ఒడెనె్స (డెన్మార్క్), అక్టోబర్ 20: భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్స్ తొలిరౌండ్‌లో ఓటమి చెందిన ప్రపంచ 10వ ర్యాంకర్ సైనా మిగిలిన రెండు రౌండ్లరో ప్రత్యర్థి, ప్రపంచ 7వ నెంబర్ ర్యాంకర్, జపాన్‌కు చెందిన నజొమి ఒహుకురాపై ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్ ఖాయం చేసుకుంది.

10/20/2018 - 16:59

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ ప్రవీణ్‌కుమార్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు భారమైన హృదయంతో వైదొలుగుతున్నట్లు ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రవీణ్‌కుమార్ స్వింగ్ బౌలర్‌గా అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. 2007లో పాకిస్థాన్‌పై పోటీతో ఆరంగ్రేటం చేశారు.

10/20/2018 - 05:38

అబూదబీ: కీలకమైన రెండో టెస్టును ఆస్ట్రేలియా చేజార్చుకోవడంతో, సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రాగా ముగియడంతో, రెండో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. హోరాహోరీ తప్పదని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భి న్నంగా మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైన ఆస్ట్రేలియా 373 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

10/20/2018 - 01:55

గౌహతి, అక్టోబర్ 19: విజయం కోసం పరితపించడం మామూలే. కానీ అదే విజయం కోసం కంటి మీద కునుకు లేకుండా గడిపిన రోజులెన్నో.. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు ఎన్నోసార్లు గల్లీ క్రికెట్ ఆడినపుడు సీనియర్లు అతనిని గేలి చేస్తూ ఒక వికెట్ పడగొడితే రూ.10 ఇస్తామంటూ ఆశ చూపేవారు. అలాంటి దుర్భర స్థితి నుంచి క్రికెట్‌లో రాటుదేలిన ఆ 23 ఏళ్ల యువకుడు ఇపుడు భారత్-సీ జట్టులోకి చోటు దక్కించుకున్నాడు.

Pages