S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/25/2018 - 22:08

సిడ్నీ, అక్టోబర్ 25: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్‌గా డేవిడ్ పీవెర్ కొనసాగనున్నాడు. దక్షిణాఫ్రికాలో ఆసీస్ జట్టు టూర్‌కు వెళ్లినప్పుడు చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదానికి సంబంధించిన రెండు నివేదికలు త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో, పీవెర్‌ను కొనసాగించాలన్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆసీస్ జట్టులో రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న తీవ్ర వివాదానికి పీవెర్ కేంద్ర బిందువయ్యాడు.

10/25/2018 - 22:06

సిడ్నీలో జరిగిన ఇన్‌విక్టస్ గేమ్స్ సిట్టింగ్ వాలీబాల్ ఫైనల్‌లో తలపడుతున్న జార్జియా, బ్రిటన్ జట్లు.
ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జార్జియా జట్టు టైటిల్ సాధించింది.

10/24/2018 - 23:53

విశాఖపట్నం, అక్టోబర్ 24: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో పదివేల పరుగుల మైలురాయిని అధిగమించిన క్రికెటర్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడు. వెస్టిండీస్‌తో బుధవారం విశాఖపట్నంలో జరిగిన వనే్డలో సెంచరీ సాధించిన అతను పదివేల పరుగుల క్లబ్‌లో చోటు సంపాదించాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడిగా, మొత్తంమీద 13వ బ్యాట్స్‌మన్‌గా అతను చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు.

10/24/2018 - 23:40

*అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి బ్యాట్స్‌మన్

*భారత్ తరఫున 10వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాట్స్‌మన్

*మ్యాచ్‌లు 213

*ఇన్నింగ్ సలు 205

10/24/2018 - 23:36

భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం జరిగిన రెండో వనే్డ టైగా ముగిసింది. తొలి వనే్డలో భారీ స్కోరు చేసినా అన్నివిభాగాల్లో పటిష్టమైన టీమిండియా చేతిలో ఎదురైన పరాజయంతో వెస్టిండీస్ బౌలర్ల సత్తాపైనే రెండో ఆధారపడి ఉంటుందని సభ్యులకు రెండో వనే్డకి ముందు దిశానిర్దేశం చేసిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆదేశాలను సహచరులు తూ.చ. తప్పకుండా పాటించారు.

10/24/2018 - 23:34

ముంబయి, అక్టోబర్ 24: ఆస్ట్రేలియా-ఏతో బుధవారం ఇక్కడ జరిగిన టీ-20 సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్-ఏ మహిళా క్రికెట్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ప్రత్యర్థిపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

10/24/2018 - 23:33

పారిస్, అక్టోబర్ 24: భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో చోటు దక్కించుకున్నారు. గతవారం జరిగిన డెన్మార్క్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సైనా ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్‌లో జపాన్‌కు చెందిన సయెనా కవాకమిని 21-11, 21-11 తేడాతో ఓడించింది.

10/24/2018 - 04:50

దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అసలు కోహ్లీ మనిషేనా అన్న అనుమానం తనకు కలుగుతుందని వ్యాఖ్యానించాడు. 3అతని ఆటతీరు, మైదానంలో అతని బ్యాటింగ్ విధానం, ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించడం వంటి అంశాలు చూస్తుంటే కోహ్లీ అసలు మానవమాత్రుడేనా అన్న అనుమానం కలుగుతోంది2 అని ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.

10/24/2018 - 03:32

విశాఖపట్టణం, అక్టోబర్ 23: టాప్ ఆర్డర్ విజృంభించడంతో తొలి వనే్డలో 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా బుధవారం విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగే రెండో వనే్డలో సైతం ఆధిపత్యం కోసం ఎదురుచూస్తోంది.

10/24/2018 - 03:28

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 23: గౌహతి వనే్డలో 322 పరుగుల భారీ స్కోరు సాధించినా కోహ్లీ, రోహిత్ శర్మ శతకాల ఇన్నింగ్స్ కారణంగా ఓడిపోయామని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. మంగళవారం నెట్స్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆట ప్రారంభంలో మూడు, నాలుగు వికెట్లు పడగొట్టి ఉంటే భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టేవారమన్నాడు. తమ బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్నాడు.

Pages