S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/04/2018 - 02:35

మేడారం, ఫిబ్రవరి 3: రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శైలేంద్రకుమార్ జోషీ తన మొదటి పర్యటనగా శనివారం మేడారం వచ్చారు.

02/04/2018 - 02:29

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మేడారం సమ్మక-సారలమ్మల జాతరకు వెళ్లేందుకు వచ్చేందుకు గాను టిఎస్‌ఆర్టీసి శనివారం వరకు 34 వేల ట్రిప్పులు బస్సులు నడిపిందని ఆర్టీసి ఎండి జివి రమణారావు తెలిపారు. తద్వారా 10.25 లక్షల మంది యాత్రీకులను వారివారి గమ్యస్ధానాలకు చేర్చినట్లు స్పష్టం చేశారు. కిక్కిరిసిన భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళికా బద్దంగా బస్సులను నడిపి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించగలిగామని చెప్పారు.

02/04/2018 - 02:28

మేడారం, ఫిబ్రవరి 3: ఆశేషభక్త జనావళి నుంచి విశేషపూజలు అందుకున్న కొంగు బంగారు తల్లులు శనివారం వనప్రవేశం చేశారు. నాలుగు రోజులపాటు మహా సంబురంగా జరిగిన మేడారం జాతర శనివారం సాయంత్రం సమ్మక్క, సారలమ్మ తల్లుల వనప్రవేశంతో ముగిసింది.

02/04/2018 - 01:22

హైదరాబాద్, ఫిబ్రవరి 3: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు ఎదురవుతున్న న్యాయ, పర్యావరణ అవరోధాలను అధిగమించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉంది. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన జరిగినప్పటి నుంచి అభ్యంతరాలు లేవనెత్తుతున్నా, వెనకబడిన పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.

02/04/2018 - 01:22

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ‘రైతుబంధు’ పథకాన్ని పసుపు రైతులు కూడా ఉపయోగించుకునేందుకు ఈ పథకాన్ని విస్తరిస్తున్నామని మార్కెటింగ్ మంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. పార్లమెంట్ సభ్యురాలు కె. కవితతో కలిసి జలసౌధాలో గురువారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు.

02/04/2018 - 01:21

హైదరాబాద్, ఫిబ్రవరి 3: చేనేత కార్మికులకు సంబంధించిన రుణ మాఫీ విషయంలో పరిశ్రమల శాఖ, జౌళి శాఖ మంత్రి కె. తారక రామారావు అసెంబ్లీలో హామీ ఇచ్చి, ఇంత వరకూ జివో ఇవ్వలేదని టి.పిసిసి అనుబంధ విభాగమైన వీవర్స్ సెల్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో వేలాది మంది చేనేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, అనేక మంది అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

02/04/2018 - 01:21

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ ముఖ్యమంత్రి నవాబుగిరి వదిలిపెట్టాలని, ప్రజాసమస్యలపై దృష్టిసారించి, వారి సమస్యలు వినేందుకు అవకాశం కల్పించాలని బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని ఎద్దేవా చేశారు.

02/04/2018 - 01:20

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఎస్‌సిల వర్గీకరణపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయించాల్సిందిగా ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. శనివారం మంద కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఈ విషయమై చర్చించారు. రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను ఇదివరకే ఈ విషయాన్ని ఎఐసిసి నాయకుల దృష్టిలో పెట్టానని చెప్పారు.

02/04/2018 - 01:19

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణలో రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు 2018-19 సంవత్సరంలో అత్యంత ప్రాధాన్యత (టాప్ ప్రియారిటీ) ఇస్తామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.

02/04/2018 - 01:19

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకు క్యాబినెట్ హోదాను కల్పించడాన్ని సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని కోరుతూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను రేవంత్ రెడ్డి గత ఏడాది దాఖలు చేశారు.

Pages