S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/01/2018 - 00:47

హైదరాబాద్, జనవరి 31: సేవే పరమావధిగా భావించాలి, అప్పుడే ప్రజలు మీకు దగ్గరవుతారు అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లను ఉద్దేశించి పేర్కొన్నారు. మహిళల భద్రతకోసం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక చట్టాలు చేయడంతో పాటు కఠిన నిర్ణయాలను అమలు చేస్తోందని అన్నారు.

02/01/2018 - 00:46

హైదరాబాద్, జనవరి 31: కేంద్రప్రభుత్వం గురువారం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పైనే అందరి దృష్టీ ఉంది. విద్యారంగానికి గత ఏడాది కంటే ఎక్కువగా నిధులు కేటాయిస్తారనే భావనలో కాలేజీలు, ఇతర యజమాన్యాలు ఉన్నాయి. ఈ ఏడాది 90,842 కోట్లు కేటాయిస్తారని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత అమలుచేసే బడ్జెట్ ఇది.

02/01/2018 - 00:46

హైదరాబాద్, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ పెద్దఎత్తున నిధులను అందజేస్తున్నా, టిఆర్‌ఎస్ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం 3,56,375 కోట్లు కాగా, దాంట్లో కేంద్రం ప్రభుత్వం అందించిన నిధులే 1,58,000 కోట్లు ఉందని అన్నారు.

02/01/2018 - 00:45

హైదరాబాద్, జనవరి 31: టీచర్ల రిక్రూట్‌మెంట్ టెస్టు షెడ్యూలును పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రకటించింది. కొన్ని పోస్టులకు ఆన్‌లైన్‌లోనూ, మరికొన్ని పోస్టులకు ఆఫ్ లైన్‌లోనూ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఫిబ్రవరి 24 న ప్రారంభమై మార్చి 4 వరకూ జరుగుతాయి. 24న లాంగ్వేజి పండిట్లు తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులకు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఎస్‌జిటి తెలుగు మీడియం పోస్టులకు 25న ఒఎంఆర్ పద్ధతిలో జరుగుతాయి.

02/01/2018 - 00:44

హైదరాబాద్, జనవరి 31: పోలీసు శాఖలో పని చేస్తున్న హోంగార్డుల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సిఎం కెసిఆర్ హోంగార్డుల జీతాలు పెంచుతామని చేసిన వాగ్ధానం మేరకు హోంశాఖ బుధవారం జివో జారీ చేసింది. పెరిగిన జీతాల మేరకు నెలకు రూ.20 వేల వరకు హోంగార్డులు తీసుకునే అవకాశం ఉంది.

02/01/2018 - 00:44

హైదరాబాద్, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో జర్నలిస్టులకు ప్రత్యేక కోటా విధించడానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం బషీరాబాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది.

02/01/2018 - 00:24

హైదరాబాద్, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషి (ఎస్‌కె జోషి) బుధవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో కొనసాగిన ఎస్‌పి సింగ్ బుధవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఎస్‌కె జోషి నియామకానికి ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. దీంతో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కె జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

02/01/2018 - 00:21

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం గర్భగుడిని బంగారు రేకుతో అలంకరించాలని యాదగిరి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటిడిఎ) నిర్ణయించింది. భక్తులు ఆలయానికి సమర్పించిన 37 కిలోల బంగారు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ బంగారాన్ని ఆలయ నిర్మాణానికి వినియోగించేందుకు దేవాదాయ శాఖ అంగీకరించింది.

01/31/2018 - 23:57

గద్వాల, జనవరి 31: యాబ్బై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధిని మూడున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపింది...ప్రజల ఆశీస్సులు ఆదరాభిమానాలు ఉండటంతో వచ్చే 2019 ఎన్నికల్లో ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని...

01/31/2018 - 23:55

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో వివిధ స్థాయిలలోని సహకార సంఘాల పాలకమండళ్ల కాలపరిమితి ముగుస్తుండడంతో, ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండళ్లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, సహకార మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బుధవారం ఇక్కడ సమాశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోచారంతో పాటు టి.

Pages