S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/02/2018 - 04:04

మేడారం, ఫిబ్రవరి 1: పున్నమి వెనె్నల పులకరించేలా..్భక్తజనుల సమ్మక్కతల్లి జయజయ నినాదాలతో...చందమామ చెంతన సమ్మక్కతల్లి గురువారం గద్దెకు చేరింది. ఆశేష భక్తజనావళి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప, అ‘ద్వితీయ’ క్షణాలు గురువారం రాత్రి మేడారంలో చోటుచేసుకున్నాయి. మేడారం జాతరలో అతిముఖ్యమైన ఘట్టం సమ్మక్క తల్లి ఆగమనం.

02/02/2018 - 04:01

మేడారం, ఫిబ్రవరి 1: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మేడారం పర్యటన ఖరారయింది. సమ్కక్క-సారలమ్మ జాతరకు హాజరయి అమ్మవార్లకు ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లాయంత్రాంగం మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం పనె్నండున్నర గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌నుండి హెలీక్యాప్టర్‌లో ముఖ్యమంత్రి బయలుదేరి 1-15గంటలకు మేడారం చేరుకుంటారు.

02/02/2018 - 04:00

మేడారం, ఫిబ్రవరి 1: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ గురువారం సమ్మక్కను దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో హెలీక్యాప్టర్‌లో మేడారం చేరుకున్న రమణ్‌సింగ్ నేరుగా గద్దెల వద్దకు చేరుకున్నారు. మొదట అమ్మవారికి నిలువెత్తు బంగారం (బెల్లం) చెల్లించాలని నిర్ణయించుకున్న రమణసింగ్‌కు బెల్లంతో తులాభారం నిర్వహించారు. అనంతరం సమ్మక్క గద్దెకు చేరుకుని ఆమెకు మొక్కులు చెల్లించారు.

02/02/2018 - 03:50

మేడారం, ఫిబ్రవరి 1: సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు గురువారం భారీఎత్తున జనాలు తరలి రావటంతో మేడారంలోని గద్దెల ప్రాంతం, జంపన్నవాగు ప్రాంతం జనసంద్రంగా మారింది. గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెకు చేరగా బుధవారం అర్ధరాత్రి నుండే వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి భక్తుల చేరుకోవటం ప్రారంభమవగా, గురువారం మధ్యాహ్నానికి చీమల బారుల్లా భక్తులు పెద్దఎత్తున తరలి రావటం కనిపించింది.

02/02/2018 - 03:48

ముస్తాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదర్శం కావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో గురువారం గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం, గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా ఇక్కడ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే మహాత్మాగాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.

02/02/2018 - 03:43

సిరిసిల్ల, ఫిబ్రవరి 1: రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తి అయినా ఇక్కడ ఏ ఒక్క విద్యా సంస్థ, కళాశాల కానీ రాలేదని, అభివృద్దికి నోచుకోలేదని జేఎన్‌టీయూ జాక్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గుడిసె ప్రభాకర్ అందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో జేఎన్‌టీయూ జాక్ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది.

02/02/2018 - 03:42

ధర్మపురి, ఫిబ్రవరి 1: ధర్మపురి పాత మండలంలోని, గత నియోజకవర్గ కేంద్రమూ, ప్రస్తుత మండల కేంద్రమైన, బుగ్గారం గ్రామంలో గురువారం ముత్యాల, నల్ల జంట పోచమ్మల రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

02/02/2018 - 03:42

మంచిర్యాల, ఫిబ్రవరి 1 : మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయిలో జనవరి నెలలో రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయిందని సింగరేణి సీ అండ్ ఎండీ శ్రీ్ధర్ తెలిపారు. రెండు యూనిట్ల ద్వారా 826.61 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డును సృష్టించడంతో ఉత్పత్తి చేసిన సిబ్బందికి, అధికారులకు సీ ఆండ్ ఎండీ ఆభినందనలు తెలిపారు.

02/02/2018 - 03:41

కామారెడ్డి, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ప్రజల బతుకులు బాగుపడ్తాయని అనుకుంటే సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికీ అన్యాయమే జరుగుతోందని జేఏసీ రాష్ట్ర చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు.

02/02/2018 - 03:36

గద్వాలటౌన్, ఫిబ్రవరి 1: విద్యార్థులకు వైద్య కళాశాలలో మెడికల్ విద్యనభ్యసించడానికి సీట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం గద్వాల పట్టణంలో సీఐ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Pages