S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/02/2018 - 03:35

హైదరాబాద్, ఫిబ్రవరి 1: పదో తరగతి విద్యార్థుల అభ్యసన ఫలితాలను అంచనావేసేందుకు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫిబ్రవరి 5వ తేదీన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేను నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ జి కిషన్ తెలిపారు.

02/02/2018 - 03:34

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి, తాను, తన భార్య వైదొలుగుతామని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. కాగా వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్, మంత్రి హరీష్ రావు, నిజామాబాద్ ఎంపి కవిత రాజకీయాల నుంచి వైదొలుగుతామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

02/02/2018 - 03:33

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ ఎస్.కె.జోషిని గురువారం టిఎస్‌ఆర్టీసి ట్రాన్స్‌పోర్టు అకాడమి ప్రిన్సిపాల్, సీనియర్ పిఆర్‌ఓ కిరణ్‌కుమార్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసి ఎండి జివి రమణారావు, మిగిలిన అధికారులతో కలిసి మేడారం జాతరకు సంబంధించిన రవాణా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వెళ్లారని కిరణ్‌కుమార్ తెలిపారు.

02/02/2018 - 03:33

హైదరాబాద్, ఫిబ్రవరి 1: మేడారం జాతరకు గురువారం జనం పోటెత్తడంతో భద్రత ఏర్పాట్లను నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది. విఐపిల రాక సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా కొన్ని పొరపాట్లు జరిగాయి. చత్తీస్‌ఘడ్ సిఎం రమణ్‌సింగ్ మేడారం విచ్చేశారు. ఆయనకు సొంత భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ ఎవరో కొబ్బరికాయ విసరడంతో తలకు గాయమైంది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తల్లికి కూడా స్వల్ప గాయమైంది.

02/02/2018 - 03:32

నల్లగొండ, ఫిబ్రవరి 1: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హత్య కేసులో రాజకీయ కుట్ర బయటకు రావాలంటే సిబిఐ విచారణే శరణ్యమని అందుకోసమే తాము హైకోర్టును ఆశ్రయించామని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. గురువారం వెంకట్‌రెడ్డి తన భార్య సబితతో కలిసి లక్ష్మిని, పిల్లలను, శ్రీనివాస్ తల్లిని పరామార్శించి ఓదార్చారు.

02/02/2018 - 03:31

హైదరాబాద్, ఫిబ్రవరి 1: చెరువులు, సరస్సులను కాలనీలుగా మార్చేందుకు, ఇండ్లు నిర్మిస్తే సహకరిస్తే తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొనాల్సి వస్తుందని, వరదలు కాలనీలను ముంచెత్తుతాయని హైకోర్టు ప్రజలను హెచ్చరించింది.

02/02/2018 - 03:30

హైదరాబాద్, ఫిబ్రవరి1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్‌హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా ఈ నెల 5న తెలంగాణ దండకారణ్యం బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సిపిఐ(మావోయిస్టు) పార్టీ ప్రకటించింది.

02/02/2018 - 03:29

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణలో వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం లేఖ రాసింది. రాష్ట్రంలో పండించే 96 వేల మెట్రిక్ టన్నుల వేరుశనగను కొనుగోలు చేయనున్నట్టు కూడా లేఖ పేర్కొంది. కేంద్రం నిర్ణయం పట్ల మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేసారు.

02/02/2018 - 03:28

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వచ్చే వర్షాకాలం నాటికి భువనగిరి జిల్లాకు కాళేశ్వరం జలాలు అందుతాయని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ప్రకటించారు. అప్పటి వరకు సాగునీటిని అందించడానికి అనుగుణంగా గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జలసౌధలో గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 15,16 పనుల అమలును మంత్రి సమీక్షించారు.

02/01/2018 - 00:47

హైదరాబాద్, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులకు ఈ బడ్జెట్‌లో భూరి ప్యాకేజి అందుతుందా అని ఎదురుచూస్తోంది.

Pages