S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/06/2017 - 03:43

హైదరాబాద్, నవంబర్ 5: కేంద్ర సర్వీసుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో బిజెపి, బిజేవైఎం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం శ్రీనివాస్ సూచించారు. అంతేకాని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అసెంబ్లీ ముట్టడి చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

11/06/2017 - 03:42

హైదరాబాద్, నవంబర్ 5: హైదరాబాద్ పరిసరాల్లోని ఫాంహౌస్‌లు హక్కా కేంద్రాలుగా మారాయి. ఫాంహౌస్‌లలో యదేచ్ఛగా హుక్కా బార్‌లు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో హుక్కా కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఈ విష సంస్కృతికి నగర శివారుకు తరలింది. తాజాగా శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు.

11/06/2017 - 03:42

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ మదర్సాలలో పనిచేస్తున్న విద్య వలంటీర్లకు బకాయి వేతనలు చెల్లించాలని రాష్ట్ర ఇస్లామిక్ మదారిస్ బోర్డు అధ్యక్షుడు సయ్యద్ దుర్వేష్ మోహినుద్దీన్ ఖాద్రి డిమాండ్ చేశా రు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా పనిచేస్తున్న విద్య వలంటీర్లు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

11/06/2017 - 03:41

హైదరాబాద్, నవంబర్ 5: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి. ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్‌పై గట్టి నిఘా వేశాయి. ఉద్యోగాలు, పెట్టుబడులు, వ్యాపారాల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న 47 మంది నైజీరియన్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

11/06/2017 - 03:40

హైదరాబాద్, నవంబర్ 5: పత్తి రైతుల కు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాం డ్ చేస్తూ సోమవారం నుంచి సిపిఐ మార్కెట్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. మద్దతు ధర రూ.4320కి కొనుగోలు చేయాలని, రూ.500 కోట్లతో మార్కెట్ ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

11/06/2017 - 03:40

హైదరాబాద్, నవంబర్ 5: యావజ్జీవ శిక్షపడి ఏడేళ్లు పూర్తి చేసుకున్న ఖైదీల్లో చాలా మంది సత్‌ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక లేఖ రాశారు. చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు.

11/06/2017 - 03:39

హైదరాబాద్, నవంబర్ 5: సమసమాజ నిర్మా ణం కోసం మనమంతా పాటుపడాలని మాజీ ఎమ్మె ల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పిలుపు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్‌పేట గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బడంగ్‌పేట నగర బ్రాహ్మణ సేవా సమితి ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో మాట్లాడుతూ, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్నారు.

11/06/2017 - 03:39

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కాదని వందల కోట్లతో కొత్త భవనం నిర్మించడం సరికాదని రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఆ డబ్బుతో పత్తిరైతులను ఆదుకోవాలని కోరారు. ప్రస్తుత సచివాలయానికి వాస్తు బాగా లేకపోతే తెలంగాణ ఎలా వచ్చిందని ఆయన సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు.

11/06/2017 - 03:37

హైదరాబాద్, నవంబర్ 5: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడుతోంది. బంగారం అక్రమ రవాణాకు అదుపు లేకుండా పోతోంది. గత మూడేళ్లలో విమానాశ్రయం అధికారులు 142 కేసులు నమోదు చేసి దాదాపు 92 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆధునిక టెక్నాలజీ వినియోగంతో బంగారం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

11/05/2017 - 04:55

మహబూబ్‌నగర్, నవంబర్ 4: కార్తీక పౌర్ణమితో కృష్ణమ్మ భక్తులతో పులకించిపోయింది. శనివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా, తుంగభద్ర నదుల పుష్కర ఘాట్ల దగ్గర భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా నదిస్నానాలు చేసి భక్తులు నదిలో కార్తీక దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. కృష్ణానది తీరాన గల శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుండే నదితీరాన భక్తుల కోలాహలం కనిపించింది.

Pages