S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/12/2017 - 02:39

హైదరాబాద్, జూన్ 11: వేతనాలు పెంచకపోతే మరో సమ్మెకు సిద్ధమవుతామని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ పేర్కొంది. ఈ మేరకు జులై 3న ప్రభుత్వానికి సమ్మెనోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్క ర్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.

06/12/2017 - 02:39

హైదరాబాద్, జూన్ 11: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు ప్రారంభమైనందున రైతులకు వెంటనే రుణాలు, విత్తనాలు, సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కౌలుదారులకు బ్యాంకు రుణాలు, రైతులకు ఇచ్చే అన్ని రాయితీలు అం దేలా చూడాలని కమిటీ డిమాండ్ చేసింది.

06/12/2017 - 02:38

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణలో ఆగమై పోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సిఎం కెసిఆర్‌ను టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అంటూ పదే పదే చెబుతున్న మీరు రైతల వాస్తవ సమస్యలేమిటో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని కోరుతూ ఆదివారం రేవంత్ రెడ్డి సిఎంకు బహిరంగ లేఖ రాశారు.

06/12/2017 - 02:38

హైదరాబాద్, జూన్ 11: పశువుల క్రయ, విక్రయాలపై కేంద్రం ఆంక్షలు విధించినందుకు నిరసనగా ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా గెజిట్ కాపీలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలంగాణ రైతు సంఘం ప్రకటించింది. కేంద్రం గత నెల 23న అమల్లోకి తెచ్చిన విధి విధానాలపై నిరసన వ్యక్తం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి తెలిపారు.

06/12/2017 - 02:37

హైదరాబాద్, జూన్ 11: బిసి, ఎస్‌సి, ఎస్‌టి వసతి గృహా ల్లో 3 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలను చేర్పించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఉచిత భోజన, బోధన వంటి సౌకర్యాలు పొందాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

06/12/2017 - 01:22

రామచంద్రాపురం, జూన్ 11 : దేశంలో అతిపెద్ద కుంభకోణాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని, అవినీతిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని దీనికి కారణం సిఎం కెసిఆర్ పాలన తీరేనని మాజీ మంత్రి, బిజెపి ముఖ్యనేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని 111 డివిజన్ పరిధిలో పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ కార్యవిస్తారక్ యోజన విజయోత్సవ సభను నిర్వహించారు.

06/12/2017 - 01:21

మహబూబ్‌నగర్, జూన్ 11: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దగ్గరికి కెటిఆర్ వస్తే నారాయణపేట, కొడంగల్ ప్రజలు రాళ్లతో కొట్టాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోని తాగునీటి పథకాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ నిర్మించిన కొడంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ నీటి పథకాలకు సంబందించిన ట్యాంకులను, పంపులను పరిశీలించారు.

06/12/2017 - 01:20

ఆదిలాబాద్,జూన్ 11: నిన్నమొన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తొలకరి వర్షాలు ఉపశమనం కలిగించాయి. మృగశిరకార్తె ప్రవేశం నుండి మూడు రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా చెరువులు, జలాశయాల్లోకి భారీ గా వరదనీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి.

06/12/2017 - 00:47

హైదరాబాద్, జూన్ 11: రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఇప్పటివరకు దాదాపు నాలుగు వేల మందికి పైగా నామినేటెడ్ పదవులు లభించాయి. మార్కెట్ కమిటీల్లో దాదాపు 16వందల మంది, దేవాలయ కమిటీల్లో దాదాపు రెండువేల మందికి పదవులు లభించాయి. ఇప్పటి వరకు మూడు వందల దేవాలయాలకు పాలక వర్గాలను నియమించారు. ఒక్కో దేవాలయంలో ఐదుగురి నుంచి 12 మంది వరకు పాలక వర్గ సభ్యులు ఉన్నారు.

06/12/2017 - 00:46

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల సేవలు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో 72 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో 54 మున్సిపాలిటీల్లో 18 సేవలను అందించే ప్రక్రియను మున్సిపల్ పరిపాలన శాఖ అమలు చేస్తోంది. డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజిమెంట్ సిస్టమ్ కింద బిల్డింగ్ ప్లాన్లను కూడా ఆన్‌లైన్‌లో పంపితే ఆమోదం తెలిపే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు.

Pages