S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/20/2017 - 02:20

భాజపా ముందస్తు ఎన్నికల ప్రచారం
తెలంగాణ గద్దెపైనే నాయకత్వం దృష్టి
పార్టీ చీఫ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
మావోయిస్టు ముప్పుపై గట్టి నిఘా
మూడు రోజులపాటు విస్తృత పర్యటన
నక్సల్స్ బాధిత కుటుంబాల పరామర్శ
22న రాక, 25న నేరుగా విజయవాడకు

05/19/2017 - 04:46

హైదరాబాద్, మే 18: వాస్తు దోషాలున్న ప్రస్తుత సచివాలయం స్థానంలో మరో చోట కొత్త సచివాలయం నిర్మించాలన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరిక నెరవేరబోతుంది. కొత్త సచివాలయం నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని రక్షణశాఖకు చెందిన పరేడ్‌గ్రౌండ్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు తాజా సమాచారం.

05/19/2017 - 04:45

హైదరాబాద్, మే 18: హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.42.59 కోట్ల చొప్పున రికార్డు స్థాయిలో ధర పలికింది. నగర పొలిమేరలో రాయదుర్గంలోగల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వౌలిక వసతుల సంస్థకు (టిఎస్‌ఐఐసి) చెందిన ఐదెకరాల స్థలానికి ఈ-వేలం నిర్వహించగా ఎకరాకు రూ.42.59 కోట్లు ధరతో కొనుగోలు జరిగింది. ఐదెకరాలకు మొత్తంగా కలిపి ప్రభుత్వానికి రూ.185 కోట్లు వచ్చినట్టు టిఎస్‌ఐఐసి అధికారులు వెల్లడించారు.

05/19/2017 - 04:44

హైదరాబాద్, మే 18: టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో ప్రధానమైన హామీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం. ఎన్నికల ప్రచారంలో ఈ నినాదం చాలా ప్రభావం చూపింది. అయితే అమలు మాత్రం ఆశలు కల్పించిన స్థాయిలో కనిపించడం లేదు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఇంకా రెండేళ్ల కాలం మిగిలి ఉంది. 2.6లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులైతే మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకూ 1629 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది.

05/18/2017 - 04:50

సంగారెడ్డి, మే 17: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బిసి సంఘం జాతీయ అధ్యక్షుఢు ఆర్.కృష్ణయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు పరోక్షంగా స్పష్టం చేసారు. రాజకీయంగా వెనకబాటుతనానికి గురవుతున్న బిసిల కోసం త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంటూ పార్టీని వీడబోతున్నట్లు సంకేతమిచ్చారు.

05/18/2017 - 01:44

హైదరాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగానికి అరుదైన గౌరవం లభించిం ది. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావును ప్రతిష్టాకరమైన సదరన్ రీజనల్ పవర్ కమిటీ చైర్మన్‌గా కేంద్రం నియమించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ అథారిటీ కార్యదర్శి ఎస్‌ఆర్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు.

05/18/2017 - 01:42

హైదరాబాద్, మే 17: రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ముందుగా కరీంనగర్ సమగ్రాభివృద్ధి కోసం శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

05/17/2017 - 03:01

హైదరాబాద్, మే 16: తెలంగాణలో కొత్తపార్టీ ఆవిర్భవించబోతున్నది. వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. అదే రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యమ శక్తులు ఏకం కాబోతున్నాయి. దీనికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదిక కాబోతున్నది. తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నడుం బిగించారు.

05/17/2017 - 02:58

రామన్నపేట, మే 16: ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాలేళ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల రైతుల కాళ్లు కడుగుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

05/17/2017 - 02:55

హైదరాబాద్, మే 16: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన రామాపురం మల్లేష్ (34) అనే రైతు వ్యవసాయం నిమిత్తం రూ. 5లక్షలు అప్పు చేశాడు. వేసిన బోర్లలో నీళ్లు రాక, అప్పు తీర్చలేక బాధ పడుతున్న రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. మంగళవారం ఉదయం సీఎం కార్యాలయానికి చేరుకున్నాడు.

Pages