S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/17/2017 - 02:47

హైదరాబాద్, మే 16: కరీంనగర్‌లో మానేరు డ్యామ్ ఫ్రంట్ భాగాన్ని ఆకర్షనీయంగా, పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని డిజైనింగ్ సంస్థ నిపుణులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. సబర్మతీ రివర్ ఫ్రంట్‌ను అత్యద్భుతంగా మలిచారని, అదే తరహాలో మానేరు డ్యామ్‌ను తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి ఆదేశించారు.

05/17/2017 - 02:44

హైదరాబాద్, మే 16: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జర్నలిస్టు సంఘం టిజెయు ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పొత్తులకూ తెలంగాణ భాజపాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

05/17/2017 - 02:43

హైదరాబాద్, మే 16: బాహుబలి 2 చిత్రం పైరసీ కేసులో ఆరుగురు నిందితులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ప్రధాన సర్వర్‌ను హ్యాక్ చేసి బాహుబలి 2 చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందని డిసిపి అవినాష్ మహంతి తెలిపారు. మంగళవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

05/17/2017 - 02:43

హైదరాబాద్, మే 16: తెలంగాణలో వృత్తి సాంకేతిక విద్యాసంస్థల్లో గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదానికి అనేక కాలేజీలకు గుర్తింపు ఇవ్వకుండా చెక్ చెప్పిన ప్రభుత్వం తాజాగా డిగ్రీ కాలేజీల్లో ఫీజులకు దొడ్డిదారిని ఎంచుకుంది. యూనివర్శిటీలు ఐదారు రెట్లు అదర్ ఫీజు పేరుతో విపరీతంగా ఫీజులు పెంచుకునేందుకు మార్గం సుగమం చేసింది.

05/17/2017 - 02:41

హైదరాబాద్, మే 16: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులన్నింటినీ, ఆస్తులన్నింటినీ ‘జియో మ్యాపింగ్’ చేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి, మెదక్ జిలాల్లో (పాత జిల్లాలు) గత ఏడాది సెప్టెంబర్ 1 న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు పూర్తికాగానే ఫోటోలు తీసి జాతీయ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

05/17/2017 - 02:41

హైదరాబాద్, మే 16: ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమంలో ప్లకార్డులతో పాల్గొన్న మహిళా ఇన్స్‌పెక్టర్‌పై వేటు పడింది. కాగా ధర్నాచౌక్ తరలించాలంటూ స్థానికులు చేపట్టిన నిరసన, ఆందోళనకు మద్దతుగా లేక్‌వ్యూ పోలీస్ స్టేషన్ సిఐ కె శ్రీదేవి మఫ్టీ దుస్తుల్లో ప్లకార్డు పట్టుకుని ధర్నాచౌక్ ముట్టడిలో పాల్గొన్నారు. మీడియా మఫ్టీలో ఉన్న సిఐ శ్రీదేవిని చిత్రీకరిస్తుండగా ఆమె అక్కడి నుంచి జారుకుంది.

05/17/2017 - 02:40

హైదరాబాద్, మే 16: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు, తన మిత్రుడి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ జూపార్క్ ఎదురుగావున్న రమ్నాస్‌పురాకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సత్తార్ కుమారుడు మహమ్మద్ అబ్దుల్ వాజిద్, అదే ప్రాంతానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు పర్వేజ్ ఇద్దరు క్లాస్ మేట్స్. కాగా వీరిద్దరికి క్రికెట్ ఆటలో తగవులాట జరిగింది. దీంతో పర్వేజ్, అబ్దుల్ వాజిద్‌పై కక్ష పెంచుకున్నాడు.

05/17/2017 - 02:39

హైదరాబాద్, మే 16: ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యురాలిగా గౌరవప్రదమైన హోదాలో కొనసాగుతోన్న రోజా ఓ టివి ఛానెల్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమంలో మహిళలను కించపర్చేవిధంగా అసంబద్ధ పదాలు వాడుతున్నారంటూ హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్‌రావు మంగళవారం ఫిర్యాదు చేశారు. జబర్దస్త్, పటాష్‌లో కార్యక్రమంలో అశ్లీల ప్రవర్తనతో మహిళలను కించపరుస్తాన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

05/17/2017 - 01:31

నేరేడుచర్ల, మే 16: నేరేడుచర్ల, నర్సయ్యగూడెం గ్రామ శివారులోని పంటపొలాల నుండి మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ పనులను రెండవ రోజు మంగళవారం అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభించారు. సోమవారం మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ పనులను పంటపొలాల నుండి వేయవద్దని అడ్డుకున్న రైతులను బలవంతంగా నెట్టివేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి భారీస్థాయి ఎత్తున పోలీసులను రప్పించి సర్వే చేశారు.

05/17/2017 - 01:30

దోమకొండ, మే 16: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకువచ్చిన ఓ రైతు ఆ ధాన్యం కుప్పపైనే తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ గ్రామానికి చెందిన ఆకుల పోచయ్య (68) అనే రైతు మంగళవారం కొనుగోలు కేంద్రంలోని తన ధాన్యం కుప్పపై ప్రాణాలు విడిచాడు.

Pages