S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/16/2017 - 02:59

హైదరాబాద్, మే 15: పుస్తకం మన హితం కోరే మంచి మిత్రునితో సమానమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై దత్తాత్రేయ ప్రసంగించారు.

05/16/2017 - 01:24

హైదరాబాద్, మే 15: రాష్ట్రప్రభుత్వం రైతాంగ సమస్యలను సకాలంలో తీర్చడంలో ఘోరంగా విఫలమై వారిని నట్టేట ముంచిందని బిజెపి జాతీయ నాయకుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో రైతలపై పోలీసుల దాడి, రైతులను సంకెళ్లతో తీసుకువెళ్లడం పట్ల రాష్టవ్య్రాప్తంగా ప్రజల్లో నిరసన వ్యక్తం కావడంతో మగాడు అన్నవాడు అలా చెయ్యడు అంటూ ఇపుడు సానుభూతి పొందే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

05/16/2017 - 04:57

హైదరాబాద్, మే 15: రాష్ట్రంలో భూముల సర్వేకు సంబంధించి ఆధునిక విధానాల్లో చేపట్టిన కార్యక్రమం ‘్భభారతి’ (ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం-ఐఎల్‌ఐఎస్) నత్తనడకన కొనసాగుతోంది. ఏడేళ్లలో పూర్తి చేయాలని తలపెట్టి 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజె క్టు న్యాయపరమైన అంశాలతో పాటు అనేక సమస్యలు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డది.

05/16/2017 - 01:22

హైదరాబాద్, మే 15: ధర్నా చౌక్‌లో సోమవారం ఒక్క రోజు నిరసన ధర్నా నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వ వ్యూహం బెడిసి కొట్టింది. పోలీసుల అత్యుత్సాహం వల్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఒక్క రోజు నిరసన ధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సోమవారం ఉదయం ప్రకటించారు. కాని, ఇం దిరా పార్కు నుంచి ధర్నా చౌక్‌లోకి వెళ్ళే రోడ్డు మార్గాన్ని పోలీసులు మూసి వేశారు.

05/15/2017 - 04:19

నల్లగొండ, మే 14: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం ఆయకట్టు రైతాంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

05/15/2017 - 04:17

ఎల్కతుర్తి, మే 14: వరంగల్ అర్భన్ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఎల్కతుర్తి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి చెరువులో దిగి మృతి చెందారు.

05/15/2017 - 04:16

తిప్పర్తి, మే 14: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పురిటినొప్పులతో వచ్చిన గర్భిణికి వైద్య సహాయం అందించేందుకు వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో మరో ఆసుపత్రికి వెళ్తుండగానే ఆటోలోనే శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆకిటి అన్నపూర్ణ (30) అనే మహిళ ప్రసవానికి తల్లిగారి ఇల్లయన తిప్పర్తికి వచ్చింది.

05/15/2017 - 04:14

వడ్డేపల్లి, మే 14: సెల్‌ఫోన్ మెసేజ్ కారణంగా మరికొద్ది సేపట్లో జరగవలసిన పెళ్లి ఆగిపోయింది. వరంగల్ నగరంలోని వంద ఫీట్ల రోడ్డులోని ఒక ఫంక్షన్ హాలులో శనివారం రాత్రి అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వరంగల్ నగరంలోని రామన్నపేటకు ప్రాంతానికి చెందిన యువతికి, విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. 40 రోజుల కిందట తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు.

05/15/2017 - 03:10

హైదరాబాద్/ఖైరతాబాద్, మే 14: సీనియర్ పాత్రికేయులు, డాక్టర్ వరదాచారి రచించిన జ్ఞాపకాల వరద పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు.

05/15/2017 - 03:06

హైదరాబాద్, మే 14:్భ సేకరణకు సంబంధించి అడ్డంకులు అన్నీ తీరిపోయాయి, నిధుల కొరత లేదు, ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసే విధంగా పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Pages