S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/26/2016 - 03:13

వరంగల్, సెప్టెంబర్ 25: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పరిస్ధితిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి కలెక్టర్‌ను అడిగితెలుసుకున్నారు. ముందస్తుగా గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

09/26/2016 - 03:11

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో జెసి వెంకట్రామ్‌రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్టు, అధికారులతో భారీ వర్షాలు, వరదలు, సహయక చర్యలపై అధికారులతో సమీక్షించారు.

09/26/2016 - 03:09

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 25: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన గత రెండురోజులుగా శ్రీశైలం నుండి నీటిరాక ప్రారంభం కావడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోది. నిన్నమొన్నటివరకు సాగర్ జలాశయ నీటిమట్టం 513 అడుగులు ఉండగా ఆదివారం సాయంత్రానికి 516 అడుగులకు పెరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, ఉపనదులు ద్వారా ఎగువ కృష్ణానదిలో భారీగా నీరు వచ్చి చేరుతోంది.

,
09/26/2016 - 03:07

బాల్కొండ, సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతం నుండి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 42 వరదగేట్లను ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

09/26/2016 - 03:03

కామారెడ్డి, సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల్లో వరదనీటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి వస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలోని లయోల పాఠశాల వద్ద భారీ వరదనీటి ప్రవాహంలో చిక్కుకు పోయింది.

09/26/2016 - 03:02

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆసాధారణంగా వర్షాలు కురుస్తున్నందున వైద్య శాఖను అప్రమత్తం చేసినట్టు, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. జిల్లాల వారిగా డిఎంహెచ్‌ఓలు సమీక్షలు చేస్తున్నారు. వర్ష తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలవారీగా దానికి తగ్గట్టు సిద్ధమవుతున్నారు.

09/26/2016 - 03:00

గద్వాల, సెప్టెంబర్ 25: నడిగడ్డ అష్టదిగ్బంధం... పోలీసుల పహారాలో దిగ్బంధమైంది. పట్టణమంతా ఆగ్రహ జ్వాలలతో ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి ప్రభుత్వంపై దండయాత్ర చేపట్టారు. జెఎసి ఆధ్వర్యంలో మూడు రోజుల బంద్ విజయవంతమైంది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించి రోడ్లపై ఉద్యమకారులు జిల్లా ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు.

09/25/2016 - 04:38

హైదరాబాద్, సెప్టెంబర్ 24:జంట నగరాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శనివారం తెరపి ఇచ్చాయి. అయితే పగటిపూట వాతావరణం తేలికపడటంతో ఊపిరి పీల్చుకున్న నగర జీవికి మరో ఐదు రోజులు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ సూచనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ.. శనివారం రాత్రి పది గంటలనుంచీ మళ్లీ వర్షం మొదలైంది.

09/25/2016 - 04:35

హైదరాబాద్/ జీడిమెట్ల, సెప్టెంబర్ 24: నగరంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జీడిమెట్ల ప్రాం తంలో అనేక సమస్యలకు కారణమయ్యాయి. వీధులు, నాలాలు వరద నీటితో నిండిపోయాయి. మ్యాన్‌హోల్స్ ఎక్కడున్నదీ గుర్తుపట్టలేని విధంగా ఉండటంలో పలువురు ప్రమాదానికి గురవుతున్నారు. ము ఖ్యంగా నిజాంపేట్ గ్రామంలోని బం డారి లేఅవుట్ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులున్నాయి.

09/25/2016 - 04:33

నిజామాబాద్, సెప్టెంబర్ 24: గత వారం రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు మరింత మహోగ్రరూపం దాలుస్తూ కుండపోతగా మారాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 13సెం.మీ పైచిలుకు సగటు వర్షపాతం నమోదైంది. ఆర్మూర్‌లో ఏకంగా 39.54సెం.మీ వర్షం కురిసింది.

Pages