S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/05/2016 - 16:56

హైదరాబాద్: కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల సమావేశం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. కృష్ణానది బోర్డు నిర్వహణ, విధి విధానాలపై రెండు రాష్ట్రాల అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు.

07/05/2016 - 16:54

హైదరాబాద్‌ : సనత్‌నగర్ మెట్రోస్టేషన్ సమీపంలో మంగళవారం వాటర్ ట్యాంకర్ ఓ బైకును ఢీ కొట్టింది. కూకట్‌పల్లి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేస్తోన్న మురళి కృష్ణ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా. వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. మురళీ కృష్ణ కు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే అతను మరణించాడు. ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

07/05/2016 - 16:51

హైదరాబాద్‌: భువనగిరి కోటను అడ్వెంచర్, టూరిస్టు కేంద్రంగా మారుస్తామని, నెల రోజుల్లో రోప్‌వే పనులు ప్రారంభిస్తామని తెలంగాణ పర్యాటక శాఖా మంత్రి చందులాల్‌ మంగళవారం తెలిపారు. రూ.50 కోట్లతో కోటని అభివృద్ధి చేస్తామన్నారు. కోటపై లైటింగ్‌, విడిది సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

07/05/2016 - 16:48

హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల మంగళవారం వర్షం భారీ వర్షం కురిసింది. ఎర్రగడ్డ, బాలానగర్‌, సనత్‌నగర్‌, జీడిమెట్లలో భారీ వర్షం నమోదవగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఓ మోస్తారు వర్షం కురిసింది.

07/05/2016 - 15:39

హైదరాబాద్: భార్యను హత్యచేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో తీసుకుపోయి శంషాబాద్ సమీపంలో భర్తే పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో పోలీసులు కొత్తకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని పద్మారావునగర్‌లో ఉంటున్న వ్యాపారి రూపేశ్ తన భార్య సింథియాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

07/05/2016 - 15:38

హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నారని, న్యాయాధికారులను సస్పెండ్ చేసినా ఆయన పెదవి విప్పడం లేదని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.

07/05/2016 - 15:37

సికింద్రాబాద్: చైన్‌స్నాచింగ్‌లను అరికట్టేందుకు పోలీసులు ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ ఆగంతకులు నగరంలో రెచ్చిపోతూనే ఉన్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు ఎక్కుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ ఆగంతకుడు చేజిక్కించుకుని పరారయ్యాడు. రోడ్లపైనే కాదు, రైల్వేస్టేషన్లలోనూ చైన్‌స్నాచింగ్‌లు జరగడం పట్ల మహిళలు ఆందోళన చెందుతున్నారు.

07/05/2016 - 15:36

హైదరాబాద్: హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జీలకు ఆప్షన్ల రద్దు కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు మంగళవారం ఉదయం నగరంలోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమై హైకోర్టు విభజన విషయమై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.

07/05/2016 - 11:59

నల్గొండ: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓ ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా ఆరుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుజలూరు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో 8 మంది వెళుతుండగా వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఢీకొంది. గాయపడ్డ ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

07/05/2016 - 11:58

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గతంలో తమకు కేటాయించిన గదులను ఇతరులకు కేటాయించడం పద్ధతి కాదని టిడిఎల్‌పి నాయకులు విమర్శిస్తున్నారు. తాము గదులను ఖాళీ చేయకుండానే వాటిని వేరేవారికి ఇవ్వడంలో స్పీకర్ మధుసూదనాచారి ఏకపక్షంగా వ్యవహరించారని టిడిపి నేత రేవంత్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై అవసరమైతే తాము కోర్టుకు వెళతామన్నారు.

Pages