S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/06/2016 - 03:30

హైదరాబాద్, జూలై 5: కేంద్రం ప్రతిపాదించిన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్-2015పై అభ్యంతరాలను తెలంగాణ ప్రభుత్వం జరిపిన ప్రతిపాదనల అమలుకు చొరవ చూపాలని టిఆర్టీసి స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. నూతనంగా ప్రతిపాదించిన బిల్లును రవాణా రంగంలో పనిచేస్తున్న అన్ని జాతీయ ఫెడరేషన్లు వ్యతిరేకించాయి.

07/06/2016 - 03:30

హైదరాబాద్, జూలై 5 : నిజామాబాద్ జిల్లాలో దర్పల్లిని కొత్త పోలీస్ సర్కిల్‌గా మారుస్తూ ప్రభుత్వం జీఓ (హోంశాఖ జీఓ ఎంఎస్ నెంబర్ 131 తేదీ 5 జూలై 2016) జారీ చేసింది. ఇప్పటి వరకు డిచ్‌పల్లి పరిధిలో ఉన్న ధర్పల్లి పోలీస్ స్టేషన్, భీంగల్ సర్కిల్ పరిధిలో ఉన్న సిరికొండ పోలీస్ స్టేషన్లను కలిపి దర్పల్లి పోలీస్ సర్కిల్‌గా మార్చారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

07/06/2016 - 03:29

హైదరాబాద్, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి మత పెద్దలు సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం హిందు, ముస్లిం, సిక్కు, క్రిష్టయన్, పార్సీ మత పెద్దలతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆలయాలు, ఈద్గాలు, చర్చీ, గురుద్వార్‌ల వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని రాజీవ్ శర్మ కోరారు.

07/06/2016 - 03:29

హైదరాబాద్, జూలై 5: ఎస్సై అర్హత పరుగులో పాల్గొన్న ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. మంగళవారం మాదన్నపేట బోయబస్తీలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణుడైన సునీల్ అనే యువకుడు ఎస్సై అర్హత పరీక్షకు హాజరయ్యాడు. పరుగు పోటీలో అర్సత సాధించిన సునీల్ ఇంటికి చేరుకున్నాడు. కాస్సేపటికి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

07/06/2016 - 03:28

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియామకానికి రాష్ట్రప్రభుత్వం సెర్చికమిటీని నియమించింది. ఈ కమిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రతినిధిగా ఉస్మానియా యూనివర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీని నియమించారు.

07/05/2016 - 18:09

హైదరాబాద్: బ్యాంకులు, విత్తనాల కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినడం లేదని నిస్సహాయత ప్రకటిస్తున్న తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తక్షణం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రైతులు సమస్యలతో సతమతమవుతున్నా కెసిఆర్ సర్కారు ఎలాంటి సహాయం చేయడం లేదన్నారు.

07/05/2016 - 18:09

హైదరాబాద్: 11 మంది జడ్జీలపై సస్పెన్షన్లను ఎత్తివేస్తే తాము విధులకు హాజరవుతామని తెలంగాణ న్యాయాధికారులు మంగళవారం తెలిపారు. ఇక్కడ మంగళవారం జరిగిన తెలంగాణ న్యాయాధికారుల సంఘం సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్లను తక్షణం ఎత్తివేయాలని సంఘం నాయకులు ఉమ్మడి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేరిస్తే సుప్రీం కోర్టు, హైకోర్టు చేసిన సూచనలను పాటిస్తామని కూడా వారు ప్రకటించారు.

07/05/2016 - 18:07

ఆదిలాబాద్: హైదరాబాద్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన ఐసిసి సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తామని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొనడాన్ని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు నిర్మల్‌లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఓవైసీ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు.

07/05/2016 - 17:54

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదయ్యింది. తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌ను కాపీ చేశారంటూ ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు సబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/05/2016 - 17:40

సికింద్రాబాద్: చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ లో మంగళవారం కలుషిత నీరు తాగి 140 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారు. కలుషిత నీరు తాగిన వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాధితులను మెట్టుగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pages