S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/04/2016 - 17:10

మహబూబ్‌నగర్: అధికార తెరాస పార్టీలో సిఎం నుంచి కార్యకర్తల వరకూ అందరూ దళారుల్లా వ్యవహరిస్తూ రైతులను నట్టేట ముంచేస్తున్నారని కాంగ్రెస్ నేత దమోదర రాజనర్సింహ అన్నారు. ఆయన సోమవారం బిజినేపల్లి మండలంలో వట్టెం జలాశయం ముంపు రైతులతో సమావేశమయ్యారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు డికె అరుణ, దామోదర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

07/04/2016 - 17:07

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మెహనరావు జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్రమంగా కట్టిన కట్టడాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చేశారు. తన ఇంటి ముందు భాగంలో రోడ్డుమీద అక్రమంగా కంభంపాటి నిర్మాణం చేస్తున్న విషయాన్ని స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు.

07/04/2016 - 15:04

హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చేవరకూ ఆందోళనను విరమించే ప్రసక్తి లేదని తెలంగాణ లాయర్ల జెఎసి నేతలు సోమవారం తేల్చి చెప్పారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు నేతృత్వంలో జెఎసి నేతలు గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. సమ్మె విరమించాలని ఈ సందర్భంగా గవర్నర్ విజ్ఞప్తి చేసినప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని జెఎసి నేతలు పట్టుబట్టారు.

07/04/2016 - 12:29

హైదరాబాద్: న్యాయాధికారులను తెలంగాణ న్యాయవాదులు అడ్డుకోవడంతో రాజేంద్రనగర్ వద్ద ఉప్పర్‌పల్లి కోర్టులో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైకోర్టును విభజించాలని, ఆంధ్రా జడ్జీలకు ఆప్షన్లను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న తెలంగాణ లాయర్లు నేడు ఆందోళనను తీవ్రతరం చేశారు. న్యాయాధికారులను కోర్టుహాలులోకి వెళ్లకుండా లాయర్లు అడ్డుతగలడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

07/04/2016 - 12:27

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం తెలియడంతో హయత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద నిఘా వేసి ఓ వ్యాన్‌లో నుంచి 22 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.

07/04/2016 - 12:26

సికిందరాబాద్: స్వల్ప తగాదా ఫలితంగా ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి మహిళపై పెట్రోలు పోసి నిప్పటించిన ఘటన సికిందరాబాద్ తుకారాం గేట్ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగింది. గొడవతో ఉన్మాదిలా మారిపోయిన మహేష్ అనే వ్యక్తి చంద్రకళపై పెట్రోలు చల్లి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

07/04/2016 - 12:26

హైదరాబాద్: రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణలో కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒక మోస్తరు వర్షాలు కురియడంతో తెలంగాణ జిల్లాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. హైదరాబాద్‌లో రెండు మూడు రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నందున వాతావరణం బాగా చల్లబడింది.

07/04/2016 - 07:46

హైదరాబాద్, జులై 3: కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లాల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాతలు, పోరాట యోధులైన దొడ్డి కొమరయ్య, కొమరం భీం పేర్లు పెట్టాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దొడ్డి కొమరయ్య 70వ వర్ధంతి సందర్భంగా రచయిత, జర్నలిస్టు మరిపాల శ్రీనివాస్ రాసిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆవిష్కరించారు.

07/04/2016 - 07:43

మేడిపల్లి, జూలై 3: కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ మేడిపల్లి మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఎల్కపల్లి వౌనిక (19) అనే వివాహితను శనివారం రాత్రి కిడ్నాప్ చేసి హతమార్చారు. ఇందుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం..

07/04/2016 - 07:39

రామాయంపేట, జూలై 3: పూరిగుడిసె మట్టి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. హృదయ విదారకరమైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున మెదక్ జిలజూల్లా రామాయంపేట మండలంలోని నగరం గిరిజన తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం...తండాకు చెందిన బానోతు లాలు-కలీ తమ గుడిసెలో ముగ్గురు పిల్లలు చిట్టి (9), చందు (7), గీత (4)తో కలిసి ఉంటున్నారు. శనివారం కురిసిన వర్షానికి మట్టిగోడలు తడిసి ముద్దయ్యాయి.

Pages