S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/17/2016 - 16:49

మహబూబ్‌నగర్: జిల్లాలోని అలంపూర్ జోగులాంబ ఆలయం అభివృద్ధికి వందకోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కృష్ణా పుష్కరాల కోసం పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఘాట్ల నిర్మాణానికి మంత్రులు ఇంద్రకరణ్, లక్ష్మారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణలో పురాతన ఆలయాలను ఆధునీకరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ చెప్పారు.

05/17/2016 - 16:48

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ సిఎం కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం ఇక్కడి రాజ్‌భవన్‌లో కలిశారు. కరవు పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌కు సిఎం వివరించినట్లు తెలిసింది.

05/17/2016 - 16:48

హైదరాబాద్: తెలంగాణలో అనుమతుల్లేని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ వైకాపా అధినేత జగన్ నిరాహార దీక్ష చేయడం పట్ల తెరాస కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉప్పల్ చిలుకానగర్‌లో తెరాస కార్యకర్తలు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగన్ జలదీక్షను వెంటనే విరమించాలని వారు డిమాండ్ చేశారు.

05/17/2016 - 16:47

హైదరాబాద్: వేసవి సెలవుల్లో విద్యార్థినులకు క్రికెట్ నేర్పుతున్న నెపంతో ఓ కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. చందానగర్‌లోని పిజెఆర్ స్టేడియంలో క్రికెట్ కోచ్ సలాంపై ఈ ఆరోపణలు రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోచ్ సలాంను మంగళవారం అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

05/17/2016 - 14:11

హైదరాబాద్: తనిఖీల పేరుతో ఆటో లైసెన్స్‌లను రద్దు చేయడాన్ని ఆపాలని, ఉబర్, ఓలా ట్యాక్సీలను నిషేధించాలని కోరుతూ నగరంలో ఆటో డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం రెండోరోజుకు చేరింది. ఖైరతాబాద్‌లోని ఆర్టీఎ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆటో డ్రైవర్లు యత్నించగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

05/17/2016 - 14:10

నల్గొండ: పదో తరగతి ఫలితాలను నిలిపివేయడంతో సూర్యాపేటలోని శ్రీచైతన్య పాఠశాలపై మంగళవారం ఉదయం విద్యార్థులు, తల్లిదండ్రులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. పాఠశాలలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ పాఠశాలలో చదవడం వల్లనే తమ పిల్లల టెన్త్ ఫలితాలను నిలిపి వేశారని పేరెంట్స్ విరుచుకుపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

05/17/2016 - 14:09

హైదరాబాద్: తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులను ఆదుకోవడంలో తెలంగాణ సిఎం కెసిఆర్ దారుణంగా విఫలమైనట్టు బిజెపి నేతలు ఆరోపించారు. కరవు ప్రాంతాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా ప్రారంభించారు. టి.బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

05/17/2016 - 14:08

మహబూబ్‌నగర్: తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపాలంటూ వైకాపా అధినేత జగన్ కర్నూలులో జలదీక్ష ప్రారంభించడంపై తెరాస కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి వైకాపా కార్యాలయంలోకి మంగళవారం ఉదయం తెరాస కార్యకర్తలు చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం బయట జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే సహించేది లేదని వారు హెచ్చరించారు.

05/17/2016 - 11:57

హైదరాబాద్: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన చర్చించారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

05/17/2016 - 11:56

నల్గొండ: దేవరకొండ మండలం మడమడక వద్ద ఇసుకవాగులో మంగళవారం ఉదయం ఆకస్మికంగా ఇసుకపెళ్లలు పడడంతో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Pages