S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/17/2016 - 18:20

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ ప్రజల్లో ఉత్కంఠ రేకెత్తించేలా తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేయడం ఇపుడు చర్చనీయాంశమైంది. ‘పెద్ద వార్త చెప్తా... ఎల్లుండి దాకా ఆగండి..’-అంటూ ఆయన ట్విట్టర్‌లో మంగళవారం పేర్కొన్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటబ్బా? అన్న సస్పెన్స్ తీరాలంటే ఎల్లుండి దాకా నిరీక్షించాల్సిందే.

05/17/2016 - 20:42

హైదరాబాద్: ప్రముఖ దళితవాది ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. హిందూ దేవతలపై ఐలయ్య ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇద్దరు న్యాయవాదులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

05/17/2016 - 18:16

హైదరాబాద్: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్‌డిఎస్) పనులు ఆపివేయాలంటూ రాయచూరు కలెక్టర్‌కు కర్నూలు కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు ఎపి నీటిపారుదల మంత్రి దేవినేని ఉమను కోరారు. ఆర్‌డిఎస్ పనులపై చర్చించేందుకు రావాల్సిందిగా ఆయన దేవినేనిని ఆహ్వానించారు. తమ సూచనలకు సానుకూలంగా స్పందించకుంటే ఎపికి అన్ని రకాల సహాయ సహకారాలను నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు.

05/17/2016 - 16:52

హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా అధినేత జగన్ దీక్షలు చేసినా తాము పట్టించుకోమని అయితే, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడితే సహించేది లేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తెలంగాణలో చేపట్టే ప్రాజెక్టులకు ఏనాడో అనుమతులు లభించాయని, ఆంధ్రలో పట్టిసీమ ప్రాజెక్టుకు ఏ అనుమతులూ లేవన్నారు.

05/17/2016 - 16:51

ఆదిలాబాద్: చత్తీస్‌గఢ్‌లో సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై సోమవారం రాత్రి మావోయిస్టులు జరిపిన దాడిలో ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం మర్లపల్లికి చెందిన జవాను సతీష్ గౌడ్ మరణించాడు. ఈ క్యాంపులో 185 మంది జవాన్లు విధులు నిర్వహిస్తున్నారు. సతీష్ మృతదేహాన్ని చత్తీస్‌గఢ్ నుంచి ఆదిలాబాద్‌కు హెలికాప్టర్‌లో తరలించారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా మృతదేహాన్ని మర్లపల్లికి చేర్చారు.

05/17/2016 - 16:51

హైదరాబాద్: రాజకీయ స్వార్థంతో కాకుండా ప్రజల అభీష్టం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గద్వాల జిల్లా ఆవిర్భావం కోసం తాను పోరాటం చేస్తానన్నారు. జిల్లాల ఏర్పాటు హేతుబద్ధంగా జరగాలని, ఇప్పటికే కొన్ని చోట్ల జిల్లాల ఏర్పాటుపై ఉద్యమాలు ప్రారంభమయ్యాయని ఆమె అన్నారు.

05/17/2016 - 16:51

హైదరాబాద్: వచ్చేనెల 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాలంటూ సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సందర్భంగా ఆయన ఆవిర్భావ దినోత్సవం నాడు చేపట్టే కార్యక్రమాలను వివరించారు.

05/17/2016 - 16:50

హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ బలం పుంజుకోవాలంటే బలమైన నాయకుడు అవసరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మంగళవారం మీడియాతో అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసను ఢీకొనాలంటే అందరినీ కలుపుకొనిపోయే నాయకత్వం ఉండాలన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఎప్పుడు మారుస్తారో తనకు తెలియదన్నారు.

05/17/2016 - 16:50

మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల కోసం తెలంగాణలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి 825 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కర్నూలు చౌరస్తా నుంచి అలంపూర్ వరకూ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి 85 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అలంపూర్ వద్ద సిఎం కెసిఆర్, గవర్నర్ నరసింహన్ పుష్కర స్నానాలకు వస్తారని తెలిపారు.

05/17/2016 - 16:49

హైదరాబాద్: అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తామంటూ హైదరాబాద్‌లో నిరుద్యోగ యువకులను మోసగించిన బెంగళూరు ముఠాలోని ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఒక నైజీరియన్ దేశస్థుడు ఉన్నాడు. వీరి నుంచి భారీగా పాస్‌పోర్టులు, సిమ్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Pages