S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/17/2016 - 11:54

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని బోనకల్లు వంతెనపై మంగళవారం ఉదయం రెండు లారీలు ఢీకొనడంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. లారీలు ఢీకొనడంతో గాయపడ్డ ఓ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. వంతెనపై రెండు లారీలు ఇరుక్కుపోవడంతో కొత్తగూడెం, విజయవాడ, జగ్గయ్యపేట, భద్రాచలం వైపు పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

05/17/2016 - 11:53

హైదరాబాద్: పహాడిషరీఫ్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారు జామున కారు బోల్తాపడి ఆప్కాబ్ (ఎపి సహకార బ్యాంకు) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరావు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సత్యవాణి, డ్రైవర్ దాసు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ పిన్నమనేనిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సత్యవాణి, దాసు మృతదేహాలను పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

05/17/2016 - 11:52

వరంగల్: కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా సమ్మక్క-సారలమ్మ పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని ములుగులో మంగళవారం బంద్ జరుగుతోంది. ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యంలో రెండు రోజులు బంద్ జరపాలని పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థ స్తంభించడంతో వివిధ ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

05/17/2016 - 11:51

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోరీలకు పాల్పడిన అయిదుగురు సభ్యులున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు నలభై తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

05/17/2016 - 09:24

జనగామ టౌన్, మే 16: ఎస్కార్ట్ కళ్లుగప్పి ఓ పేరుమోసిన జీవిత ఖైదీ తప్పించుకుపోయిన సంఘటన సోమవారం వరంగల్ జిల్లా జనగామ మండలం యశ్వంతాపురం బ్రిడ్జి వద్ద జరిగింది. ఖైదీ తప్పించుకుని పరుగులు తీస్తుండగా ఎస్కార్ట్ ఆరురౌండ్ల కాల్పులు జరిపినప్పటికీ ఖైదీ చాకచక్యంగా పోలీసులను తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

05/17/2016 - 09:22

ఆదిలాబాద్, మే 16: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తన వైఖరి మార్చుకోకపోతే మరో మానుకోట సంఘటన చవిచూడాల్సి వస్తుందని, స్వార్థ రాజకీయాలతో తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంటే తాము ఇక చూస్తూ ఊరుకోబోమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హెచ్చరించారు.

05/17/2016 - 09:20

కరీంనగర్, మే 16: రాష్ట్రంలో నెలకొన్న కరవుపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ప్రజల దృష్టి మళ్ళించేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాల ప్రకటన చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

05/17/2016 - 09:18

వరంగల్, మే 16: జైళ్ల సంస్కరణలో రాజీపడేది లేదని, ఖైదీల ఆరోగ్యం కోసం సన్నబియ్యంతో ఆహారమందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. వరంగల్‌లో సోమవారం ఖైదీల రాష్ట్ర స్థాయి రెండవ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవానికి వచ్చిన నాయని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఖైదీలకు పెరోల్, బెయిల్‌ను నిబంధనలను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

05/17/2016 - 09:17

హైదరాబాద్, మే 16: ఎప్పటికప్పుడు ఏదో కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన నామినేటెడ్ పదవుల పందేరానికి ఎట్టకేలకు ఈనెలాఖరులో శ్రీకారం చుట్టడానికి రంగం సిద్థమైంది. ఈ నెల 19న పాలేరు ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి నామినేటెడ్ పదవుల నియామకం ప్రారంభించి నెలాఖరుతో ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

05/17/2016 - 09:17

తొగుట, మే 16: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌లో గ్రామం ముంపునకు గురవుతుందనే బెంగతో ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలం వేములగాట్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొల్లపల్లి రామయ్య (70)కు రెండెకరాల భూమి ఉంది. ఆయన ఇద్దరు కుమారులు పోచయ్య, సత్తయ్య బతుకుతెరువుకోసం ముంబై వలసవెళ్లారు.

Pages