S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/31/2015 - 05:58

హైదరాబాద్, డిసెంబర్ 30: శాసన మండలి ఎన్నికల్లో తెరాస సత్తా చాటుకుంది. ఆరు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో నాలుగు స్థానాల్లో తెరాస, రెండుస్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మంలో ఒకటి, రంగారెడ్డిలో రెండు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక స్థానంలో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. నల్లగొండలో ఒకటి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

12/31/2015 - 05:55

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ నిరుద్యోగ యువకులకు నూతన సంవత్సర కానుకగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) గ్రూప్-2 పోస్టులతో పాటు వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లను బుధవారం విడుదల చేసింది. గ్రూప్-2 కేటగిరిలో 439 పోస్టులను భర్తీ చేయనున్నట్టు టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

12/30/2015 - 11:50

హైదరాబాద్: పాతబస్తీలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు పోలీసులు బైక్ రేస్‌లకు పాల్పడుతున్న యువకులను తనిఖీలు చేసారు. 18 మంది మైనర్లు సహా 97 మందిని అదుపులోకి తీసుకున్నారు. యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

12/30/2015 - 11:49

మెదక్: మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామం వద్ద బుధవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు.

12/30/2015 - 11:48

కరీంనగర్: సిరిసిల్లలోని విద్యానగర్‌లో బుధవారం ఉదయం దంపతుల ఆత్మహత్యకు యత్నించిన ఘటన వెలుగు చూసింది. వీరిద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోగా, భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యా యత్నానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

12/30/2015 - 11:48

నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ ఎన్ని అక్రమాలకు పాల్పడినప్పటికీ ఓటర్లు ధర్మాన్ని గెలిపించారని ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తన గెలుపు టిఆర్‌ఎస్‌కు ఓ గుణపాఠం అవుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి తన గెలుపును అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

12/30/2015 - 11:46

హైదరాబాద్: తెలంగాణలో శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల టిఆర్‌ఎస్, రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

12/30/2015 - 07:35

జగదేవ్‌పూర్, డిసెంబర్ 29: రాష్ట్ర సుభిక్షంకోసం సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్‌లో నిర్వహించిన ఆయుత చండీయాగం ఆదివారం ముగిసినప్పటికీ మంగళవారంకూడా భక్తులు విభూతికోసం పోటెత్తారు. వేలాదిమంది తరలిరావడంతో యాగస్థలం జనసందోహంగా మారింది.

12/30/2015 - 07:35

రెండు సంవత్సరాలలో కోటి మందికి ఉద్యోగాలు
అసంఘటిత కార్మికులకు జనవరిలోగా ఇఎస్‌ఐ సేవలు
మహిళా కార్మికులకు 26 వారాల ప్రసూతి సెలవు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ

12/30/2015 - 07:34

5న విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి వెల్లడి

Pages