S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/15/2018 - 05:53

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలోని పీజీ టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ అడ్మిషన్ల తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ సమీనా ఫాతిమా తెలిపారు.

08/15/2018 - 05:50

హైదరాబాద్, ఆగస్టు 14: ప్రజల్లో తన పలుకుబడి తగ్గుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెలుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ముగ్దంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/15/2018 - 02:22

సంగారెడ్డి, ఆగస్టు 14: పేద, మధ్య తరగతి వర్గాలకు నుంచి కాదు.. ఏకంగా వైద్యుల నుంచే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ ప్రతాప్‌కుమార్ కథనం మేరకు డాక్టర్ కే.హైమావతి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజీస్టుగా పని చేస్తున్నారు. ఆమె ఉద్యోగ ఒప్పందం ఈ యేడాది మే 24వ తేదీతో తీరిపోయింది.

08/14/2018 - 04:58

హైదరాబాద్, ఆగస్టు 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై దేశవ్యాప్త చర్చ జరగాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను అనుభవించలేని పరిస్థితి నెలకొందన్నారు.

08/14/2018 - 04:58

హైదరాబాద్, ఆగస్టు 13: ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలు ఇస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ప్రారంభమైన జ్యోతిష మహాసభల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం కుదరడం లేదన్నారు. ఇందుకు జీఓ విడుదల చేస్తే, న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

08/14/2018 - 04:57

హైదరాబాద్, ఆగస్టు 13: పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలకు ఇచ్చే చార్జీలు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం చార్జీలను పెంచుతూ రూపొందించిన జీఓ16ను జారీ చేసింది. గేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో క్వింటాలుకు రూ.15.50 ఉన్న హమాలీ చార్జీలను రూ.18.50కి పెంచారు. అలాగే ఇతర జిల్లాల్లో రూ.15 నుంచి రూ.18కి పెంచుతున్నట్టు జీఓలో పేర్కొన్నారు.

08/14/2018 - 06:23

కరీంనగర్, ఆగస్టు 13: ప్రజా సమస్యలపై అందరితో కలిసి పోరాటం చేస్తామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. సమష్టి పోరాటాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నలుగురి స్వార్థ ప్రయోజనాల కోసం నలిగిపోతోందని అన్నారు.

08/14/2018 - 03:25

హైదరాబాద్, ఆగస్టు 13: హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తి పదవుల భర్తీకి తాను తొందరపడేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టీబీఎన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. న్యాయవాది ఎస్ రాజ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రాధాకృష్ణన్, జస్టీస్ ఎస్వీభట్‌ల బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది.

08/13/2018 - 04:32

నల్లగొండ, ఆగస్టు 12: ప్రాణమున్నంత వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌లోనే ఉంటారని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండ, నార్కట్‌పల్లిలో జరిగిన కార్యక్రమాల సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ముందుండి పోరాడుతున్న తాము కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదన్నారు.

08/13/2018 - 04:28

ఆదిలాబాద్, ఆగస్టు12: సుందిళ్ళ బ్యారేజీ నడిరేవు వరద ఉప్పెనలో చిక్కుకొని బిక్కు బిక్కుమంటూ ఆరు గంటల పాటు హైరాన పడ్డ ఇద్దరు కార్మికులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చిన జాలర్ల ధైర్య సాహసాలను ప్రతి కొనియాడిన ఘటన జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. గోదావరి వరదలో చిక్కుకున్న ఇద్దరు కార్మికుల ప్రాణాలపై ఓవైపు నరాలు తెగే ఉత్కంఠ..

Pages