S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

12/30/2017 - 18:48

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగులు, 275 వికెట్లు పూర్తి చేసిన ఆటగాడిగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. రిచర్డ్ హాడ్లీ ఈ ఘనతను అందుకోవడానికి 58 టెస్టులు అవసరంకాగా, అశ్విన్ కేవలం 51 మ్యాచ్‌ల్లోనే పూర్తిచేసి, రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

12/30/2017 - 18:46

ఈ ఏడాది ఆరంభంలోనే అభిమానులకు మహేంద్ర సింగ్ ధోనీ పెద్ద షాకిచ్చాడు. వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు జనవరి 5న ప్రకటించాడు. భారత్‌కు మొదటి టి-20 వరల్డ్‌కప్‌ను ఆ తర్వాత వరల్డ్ కప్‌ను, చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను అందించిన ధోనీ కెప్టెన్‌గా ఉండడు అనే నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే, ఆటగాడిగా కొనసాగుతానని అతను చేసిన ప్రకటన వారికి కొంత ఊరటనిచ్చింది.

12/30/2017 - 18:45

ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండా, కెరీర్‌లో తొలి శతకాన్ని టెస్టు మ్యాచ్‌లో సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ పాండ్య రికార్డు నెలకొల్పాడు. గతంలో విజయ్ మంజ్రేకర్, కపిల్ దేవ్, అజయ్ రత్రా, హర్భజన్ సింగ్ కూడా ఇదే విధంగా ఫస్ట్‌క్లాస్ శతకాన్ని మొదట టెస్టు మ్యాచ్‌లోనే చేశారు. గాలేలో జరిగిన మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన హార్దిక్ ఆ మ్యాచ్‌లో 50 పరుగులు చేశాడు.

12/30/2017 - 18:43

ఈ ఏడాది సెప్టెంబర్ 21న కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆస్ట్రేలియాపై భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. వనే్డల్లో హ్యాట్రిక్ సాధించిన 43వ బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన కుల్దీప్ యాదవ్ భారత్ తరఫున ఈ ఫీట్‌ను ప్రదర్శించిన మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

12/30/2017 - 18:42

భారత బిలియర్డ్స్, స్నూకర్స్ వీరుడు పంకజ్ అద్వానీ ఈ ఏడాది మరో రెండు టైటిళ్లు గెల్చుకున్నాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్స్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ స్కూకర్స్ చాంపియన్‌షిప్‌తోపాటు ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాడు. మొత్తంమీద కెరీర్‌లో 18 ప్రపంచ టైటిళ్లను సాధించి, మరెవరికీ అందనంత ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.

12/23/2017 - 19:25

ఈ ఏడాది వివిధ క్రీడల్లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయ. ఘన విజయాలు, పరాజయాలు షరా మామూలుగానే చోటు చేసుకున్నాయ. అయతే, ఎవరూ ఊహించని సంఘటనగా, కెరీర్‌లో తన చివరి స్ప్రింట్‌ను ఉసేన్ బోల్ట్ చేజిక్కించుకోకపోవడాన్ని పేర్కోవాలి. లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఈ జమైకా చిరుత కండరాల నొప్పి కారణంగా లక్ష్యాన్ని అందరి కంటే ముందుగా చేరుకోలేకపోయాడు.

12/23/2017 - 19:21

ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం ఆటగాళ్లకు భారంగా పరిణమించే అవకాశం ఉంది. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఇప్పటికే సర్వీస్ రూల్స్‌ను బీడబ్ల్యూఎఫ్ మార్చేసింది. వచ్చే ఏడాది నుంచి అందరూ ఈ కొత్త సర్వీస్ నిబంధనను అనుసరించి తీరాలి. ఇప్పటివరకూ ఉన్న రూల్స్‌కు భిన్నంగా కొత్త రూల్స్ పుట్టుకురావడంతో, వాటికి అలవాటు పడడం అనుకున్నంత సులభం కాదు.

12/23/2017 - 19:20

ఇటలీ లెజెండరీ ఫుట్‌బాలర్ ఆండ్రియ పిర్లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం సాకర్‌లో ఈ ఏడాది చోటుచేసుకున్న కీలక సంఘటనల్లో ఒకటి. మిడ్‌ఫీల్డర్‌గా విశిష్ట సేవలు అందించిన అతను కెరీర్ మొత్తం మీద 570 మ్యాచ్‌లు ఆడి, 61 గోల్స్ సాధించాడు. ‘ఫ్రీ కిక్ స్పెషలిస్టు’గా పేరు తెచ్చుకున్న అతను ఇటలీ జాతీయ జట్టుకు 116 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించి, 13 గోల్స్ చేశాడు.

12/23/2017 - 19:18

ఆస్ట్రేలియా టి-20 లీగ్ బిగ్ బాష్ తాము ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించిందని నిర్వాహకులు సంబర పడుతున్నారు. ఈసారి టోర్నీ టైటిల్‌ను పెర్త్ స్కాచర్స్ గెల్చుకుంది. సిడ్నీలోని వాకా స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో సిడ్నీ సిక్సర్స్‌ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 141 పరుగులు చేసింది.

12/23/2017 - 19:12

బ్రిటిష్ ఫుట్‌బాలర్ జెర్మెయిన్ డెఫో పేరు ఇటీవల జరిగిన బీబీసీ ప్రకటించిన స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ జాబితాలో కనిపించకపోవడం చాలామందికి ఆగ్రహం తెప్పించింది. అలాంటి మనసున్న మనిషికి అవార్డును ఇవ్వని బీబీసీ అధికారులపై బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వారి కోపానికి కారణం లేకపోలేదు.

Pages