S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

12/31/2016 - 18:11

యువతను కైఫ్ ఎక్కించే సోయగాల సుందరి నికిషా పటేల్ గుర్తిందిగా! అవునులే.. అప్పుడే ఎలా మరచిపోతాం. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘కొమురం పులి’లో రెచ్చిపోయిన ఈ భామకు ఆ చిత్రం తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. పవన్‌కళ్యాణ్ సరసన అనే సరికి అందరూ నికిషాను చిత్రం విడుదలకు ముందు తెగ పొగిడేశారు. కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు.

12/31/2016 - 18:09

అందాల తార త్రిష వెండితెరపై అడుగుపెట్టి అప్పుడే దాదాపు పదిహేనేళ్లు గడిచిపోయాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ఈ భామ ఇక మహిళా ప్రధాన చిత్రాలపైనే మక్కువ పెంచుకుందట. ‘మాయ’ చిత్రం నుంచి మరో అగ్రనటి నయనతార సైతం ఇలాంటి చిత్రాలవైపే మొగ్గు చూపిస్తుండటం మనం చూస్తూనే వున్నాం. త్రిష కూడా ఇక ఆమె బాటలోనే పయనించడానికి సిద్ధమయింది.

12/31/2016 - 18:07

బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్‌లో పుత్రోత్సాహం హుషారుగా కనిపిస్తోంది. సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకున్నాక కాస్త సినిమాలకు రిలీఫ్‌నిచ్చిన ఈ బ్యూటీకి ఇటీవలే అబ్బాయి జన్మించిన విషయం తెలిసిందే. తన జీవితంలో అబ్బాయి అడుగుపెట్టడంతో ఆమెలోనే కాదు, ఆ ఇంట ఆనందం వెల్లివిరుస్తోందిట. సినీ కుటుంబానికి చెందిన కరీనాకపూర్ పెద్దగా చదువుమీద శ్రద్ధ పెట్టలేదు.

12/24/2016 - 21:28

అందాల భామ పూజాహెగ్డే కెరీర్ జోరుగా.. హుషారుగా సాగుతోంది. ‘ముకుంద’ చిత్రంలో గోపికమ్మగా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్‌రోషన్‌తో ‘మొహంజోదారో’లో నటించింది. ఆ చిత్రం పెద్దగా విజయం సాధించకపోవడంతో కాస్త నిరాశ చెందినా తన ప్రయత్నాలను మాత్రం ముమ్మరం చేసింది. తాజాగా తెలుగులో అల్లు అర్జున్‌తో ఓ చిత్రంలో గ్లామర్‌ని చిందించడానికి సిద్ధమవుతోంది.

12/24/2016 - 21:26

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా రూటే సపరేటు! ఆమె ఎంపిక చేసుకున్న చిత్రాలు.. చేస్తున్న పాత్రలు వేటికవే భిన్నమైనవి. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందాక తన దృష్టిని హాలీవుడ్‌వైపునకు మళ్లించింది. అక్కడా తన సత్తాను చాటుకునే స్థితిలోనే కనిపిస్తోంది. 2000లోమిస్ వరల్డ్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు ఈ స్థాయికి ఎదిగింది.

12/24/2016 - 21:23

టాలీవుడ్‌లో ‘అలా..మొదలైంది’తో మొదలైన నిత్యామీనన్ వెండితెర ప్రయాణం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే వుంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తూ తన కెరీర్‌ని చక్కగా మలుచుకుంటోంది. తొలి చిత్రంతోనే మంచి అభినయ సామర్థ్యం వున్న నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బాల నటిగా కొన్ని చిత్రాల్లో నటించిన నిత్యామీనన్ ఆ తర్వాత జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది.

12/18/2016 - 06:25

బాలీవుడ్ సంచలన తార మలైకా అరోరాకు ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో ఉండటమే కావలిసినట్టుంది. ‘కెవ్వుకేక..’ అంటూ ‘గబ్బర్‌సింగ్’లో ఐటెం సాంగ్‌తో అందర్నీ అలరించిన ఈ అమ్మడి వైవాహిక జీవితం ఎన్నో ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. యువ హీరో అర్జున్ కపూర్‌తో మలైకాకు ఎఫైర్ ఉండటం వల్లే వైవాహిక బంధం బీటలు వారిందని బాలీవుడ్‌లో అంతా చెప్పుకుంటున్నారు.

12/18/2016 - 06:22

‘‘హెబ్బా..హెబ్బా..’’ అంటున్నారు తాజాగా టాలీవుడ్ జనాలు. ‘అలా ఎలా’ ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం. ఈ సినిమాలో నటించినందుకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రానికి గాను పాతిక లక్షలకు పైనే పారితోషికం అందుకుందట. చేసిన చిత్రాలు వేళ్ల మీదనే వున్నా, క్రేజ్‌ని మాత్రం బాగానే సంపాదించుకుంది. ఇదే ఊపులో తాజాగా నాలుగైదు చిత్రాల్లో నటిస్తోంది.

12/18/2016 - 06:18

2015లో వచ్చిన ‘నేను శైలజ’తో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది అందాలతార కీర్తి సురేష్. అదే ఆమెకు టాలీవుడ్‌లో తొలి చిత్రం. చైల్డ్ ఆర్టిస్టుగా పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం టాప్ హీరోయిన్‌ల లిస్టులో చేరిపోయింది. తెలుగు చిత్రసీమలో వచ్చిన గుర్తింపుతో పక్కనే వున్న తమిళంలోనూ బిజీ బిజీగా మారింది.

12/18/2016 - 06:15

టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో ఓ రేంజ్‌కి వెళ్లిన తారల్లో రకుల్‌ప్రీత్ సింగ్ ఒకరు. అయితే రోజు రోజుకీ అవకాశాలు వెల్లువెత్తుతుండడంతో తిరుగులేని కెరీర్‌ని సొంతం చేసుకుంటోంది. అయితే సినిమా సినిమాకు తన పారితోషికాన్ని అమాంతం పెంచేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి రకుల్‌ని కదిలిస్తే- ‘‘ఇదంతా ఒఠ్టి రూమర్ మాత్రమే. మంచి అవకాశాలు వస్తున్నాయి.

Pages