S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

10/22/2016 - 21:10

..అంటోంది అందాల నటి కేథరిన్ థెరిస్సా. పెళ్లిళ్ళ మీద ఈ బ్యూటీకీ పెద్దగా నమ్మకం లేదట. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి ప్రేమ అవసరమే కానీ, పెళ్లి అవసరమా? అన్నది ఆమె అభిప్రాయమట. అయినా పెళ్లికి ఇంకా చాలా టైముంది. ఎప్పుడో జరగబోయే పెళ్లి విషయం గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తే ఎలా? అని కూడా అంటోందిట. పెళ్లి తర్వాత కూడా నటించాలా..వద్దా అన్నది అనవసరం.

10/16/2016 - 04:22

టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా విశేష ప్రాచుర్యం పొందిన మిల్క్‌బ్యూటీ తమన్నా ఇకపై నిర్మాణరంగంపై దృష్టి సారించి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోందిట. విభిన్న పాత్రల ద్వారా అగ్ర హీరోల సరసన చిందులేసి రెండు భాషల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఈ సుందరాంగి ఓ పక్క తనకిష్టమైన జువెలరీ బిజినెస్‌ను కొనసాగిస్తూనే ఇలా నిర్మాణం రంగంలోకి దూకుతోంది.

10/16/2016 - 04:20

అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్ ప్రేమకథా చిత్రాల్లో నటించేందుకు బాగా ఆసక్తి కనబరుస్తోందిట. కథానాయికగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపుని తెచ్చుకున్న ఈ అమ్మడికి అవకాశాలు వరుసగా దరిచేరుతున్నాయి. నిర్మాతలు రకుల్‌ని తమ చిత్రాల్లో బుక్ చేసుకునేందుకు బాగా ఆసక్తిచూపుతున్నారు. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ బిజీగా వున్న రకుల్ ప్రేమకథలను చాలా ఇష్టపడతానంటోంది.

10/16/2016 - 04:19

అందాల భామల కెరీర్ 30 ఏళ్లు దాటాక మార్కెట్ మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడం సహజమే. వయసు పెరుగుతున్న కొద్దీ క్రేజ్ కూడా పడిపోతుంటుంది. కానీ బ్యూటీ నయనతార క్రేజ్ మాత్రం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గకపోగా, పెరిగిపోతూనే వుంది. కోలీవుడ్‌లో అడుగుపెట్టడంతో మొదలైన కెరీర్ ఆరంభంలోనే అగ్ర హీరోలతో జతకట్టింది. వారి సరసన ఆటపాటలతో యువతను విశేషంగా అలరించింది. రాను రాను నాజుగ్గా మారి కుర్ర హీరోల సరసన చిందులేసింది.

10/16/2016 - 04:16

...అనక తప్పడంలేదు అందాలభామ యువతరం కథానాయిక శ్రీదివ్యకు. చిత్రసీమలో కథానాయికగా రాణించాలంటే గ్లామర్ తప్పదన్న విషయాన్ని ప్రతీ కథానాయికకు తెలుసు. గ్లామర్ షోలో ఎంత రెచ్చిపోతే అంతగా కెరీర్‌లో ముందుకు వెళ్లొచ్చు అన్న భావన అందాల భామల్లో బాగానే పేరుకుపోయింది. ఇప్పుడు చిత్రసీమలో గ్లామర్ భామలకే భలే గిరాకీ వున్న సంగతి మనకు తెలియంది కాదు.

10/08/2016 - 20:52

బాలీవుడ్‌లో ఎప్పుడూ పారితోషికాల గొడవే. హీరోలతో సమానంగా ఆడి పాడుతున్నా, తమకు రెమ్యూనరేషన్ విషయంలో సరైన న్యాయం జరగడంలేదని కథానాయికలు వాపోతుండటం సహజమే. ఇప్పుడు అలాంటి ఆలోచనకు తావులేనేలేదనే విషయాన్ని అందాల భామ సోనాక్షి సిన్హా కొట్టిపారేస్తుంది. అవును..నిజమే ఇది! ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి మంచి కథలు..ముఖ్యంగా కథానాయికలను బేస్ చేసుకొని వస్తున్న కథలు చాలానే వుంటున్నాయి. ఇది మంచి మార్పు.

10/08/2016 - 20:50

...అంటోంది పోర్న్‌స్టార్. సెక్సీభామ సన్నీలియోన్. మోస్ట్ పాపులర్ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ ఎప్పుడూ వార్తల్లోనే వుంటూ వస్తోంది. అయితే తాజాగా ‘మోస్ట్‌లీ సన్నీ’ అనే పేరుతో ఈ భామ జీవిత కథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రాబోతోందిట. కరేన్‌జిత్ కౌర్ హ్రోగా ఓ సిక్కు కుటుంబంలో సన్నీ పుట్టినప్పటి నుంచి పోర్న్ స్టార్‌గా ఎదిగిన క్రమం..ఆ తర్వాత బాలీవుడ్ నటిగా గుర్తింపు వరకూ ఇది సాగుతుందట.

10/08/2016 - 20:48

టాలీవుడ్‌లో కాస్త ఇమేజ్ రాగానే తమ తదుపరి అడుగు కోలీవుడ్.. ఆపై బాలీవుడ్‌వైపునకు వేయాలని చాలా మంది తారలు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం ఎన్నో కలలు కూడా కంటుంటారు. తమన్నా, శ్రుతిహాసన్, అనుష్క, సమంత ఇలా అనేక మంది అందాల భామలు తెలుగు, తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తుండం మనం చూస్తూనే వున్నాం. అదే కోవలోకి ఇప్పుడు యువతరం కలల సుందరి రాశీఖన్నా కూడా చేరిపోయింది.

10/08/2016 - 20:46

అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్ తను నటిస్తున్న చిత్రాల్లో గ్లామర్‌డోస్‌ని పెంచడం వల్లే అతి తక్కువ కాలంలో ఇంతటి ఆదరణ లభించిందని తోటి కథానాయికలు ఈ ముద్దుగుమ్మపై అక్కసు వెళ్లగక్కుతున్నారట. అవును..మరి! ఇందులో నిజం లేకపోలేదు. చూస్తూ..చూస్తుండగానే అతి తక్కువ కాలంలో తన గ్లామర్‌తో కట్టిపడేసి యువతను తన వైపునకు తిప్పుకుంది. క్షణం తీరిక లేకుండా చిత్రాల మీద చిత్రాలు చేసేస్తోంది.

10/01/2016 - 22:33

ఓ వైపు అగ్రహీరోలతో చిత్రాలు.. మరోవైపు మరచిపోలేని పాత్రలు.. ఇలా వేటికవే సాటిగా కెరీర్‌లో ముందుకు పరుగులుతీస్తూ యమజోరుమీదుంది అందాల భామ, మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన క్యారెక్టర్లు ఆమె కెరీర్‌కు ఎంతగానో ప్లస్ అయ్యాయి. కథానాయికగా మంచి ఫామ్‌లో వున్నప్పుడే ఐటమ్‌సాంగ్స్‌ని కూడా ఏ మాత్రం వదల్లేదు. ఇప్పటికీ అదే తరహా శైలి. అదే ఆసక్తి.

Pages