S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

12/03/2016 - 22:51

బాలీవుడ్ సుందరాంగులు కెరీర్‌లో పైకి రావాలంటే గ్లామర్‌ను చిందించడం తప్పదన్నది అందరికీ తెలిసిందే. అదే కోవలో దూసుకొచ్చిన నటి కత్రీనాకైఫ్. ఈ గ్లామర్ ప్రపంచంలో అందాల ప్రదర్శన ఏ నటికైనా తప్పదు. అలా చేయలేదంటే ఆ నటికి కెరీర్‌లో ఒడిదుడుకులు తప్పవన్న విషయాన్ని ప్రతి కథానాయిక అంగీకరిస్తుంది. ఈ విషయం గురించి కత్రీనా చెబుతూ- ‘‘చిత్రసీమలో అడుగుపెట్టే ముందు పరిశ్రమ గురించి అన్నీ తెలుసుకొని తీరాలి.

11/19/2016 - 21:04

సినిమాల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలా నిలదొక్కుకోవాలంటే ప్రతిభ ఎంతో ముఖ్యం. అలాంటి ప్రతిభతోనే అడుగులు ముందుకేసింది అందాలతార ప్రియాంక చోప్రా. ఈ బ్యూటీ ప్రతిభకు తోడు అందం... అభినయం కూడా తోడయ్యింది. అంతటితో ఆగకుండా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి సంచనలం సృష్టించింది. చేసిన చిత్రాలు, పోషించిన పాత్రలు ఆమె ప్రతిభను ప్రేక్షకుల ముందుంచాయి.

11/19/2016 - 21:03

‘‘చాలా మంది అనుకుంటుంటారు నటీనటుల వారసులకు పరిశ్రమలో అవకాశాలకు కొదువేలేదని. కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదు. ప్రారంభంలో అవకాశాలు మాత్రమే వస్తాయి. కానీ వాళ్లలా అనుకున్నంత పేరు, ప్రఖ్యాతులు అంత తొందరగా రానే రావు’’ అంటోంది సోహా అలీఖాన్. అలనాటి నటి షర్మిలా ఠాగూర్ కుమార్తెగా, నటుడు సైఫ్ అలీఖాన్ సోదరిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సుందరి సోహా అలీఖాన్. కానీ తల్లి..

11/19/2016 - 21:01

వరుస అవకాశాలతో బాలీవుడ్‌లో రివ్వున దూసుకెళుతోంది క్రేజీతార అలియా భట్. యువతరం ప్రేక్షకుల్లో ఆమెకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. పేరున్న హీరోలు.. అంతకంటే పాపులారిటీ వున్న బ్యానర్లు.. ఇవి అలియాకు కెరీర్‌లో బాగా కలిసొచ్చాయి. ఇదిలా వుండగా ఈ క్రేజీతార తాజాగా తన మకాం మార్చేసింది. ఈ భామ ఇటీవలే ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.

11/19/2016 - 20:55

-అంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్. ఇటీవలి కాలంలో ఈ భామపై వచ్చినన్ని రూమర్స్ మరే తారపై రాలేదంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. కెరీర్‌లో ఎదుగుతున్న కథానాయికలతో పాటు, అప్పుడప్పుడే వచ్చి క్రేజ్‌ని సంపాదించుకున్న అందాలతారలపై పుకార్లు షికారు చేస్తుండటం మనం చూస్తున్నదే. కెరీర్‌లో కాస్త పేరు రాగానే ఇలాంటివి మామూలే.

11/12/2016 - 17:52

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే రూటే వేరు. చేస్తున్న చిత్రాల విషయంలో అయితేనేమి.. పోషిస్తున్న పాత్రల ఎంపికలోనైతేనేమి.. వేటికవే భిన్నంగా వుండేలా చూసుకుంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆమెకు అంతటి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ అలా.. ఇలా కాదు... కెరీర్‌లో ఎక్కడికో వెళ్లేలా చేసింది. ఎప్పటికప్పుడు కెరీర్‌ను కాపాడుకుంటూ ముందుకు పరుగులు పెడుతూనే వుంది దీపికా.

11/12/2016 - 17:51

టాలీవుడ్ క్రేజీభామ రకుల్ ప్రీత్‌సింగ్ రోజురోజుకీ బిజీ..బిజీగా మారుతోంది. చక్కటి చిత్రాలు..అగ్రహీరోలు... పేరున్న బ్యానర్‌లు.. ఇలా ఒకటేమిటి? ఏ విధంగా చూసినా అదృష్టమంటే రకుల్‌దేనంటున్నారు సినీవర్గాలు. వారి మాటల్లో నిజం లేకపోలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తెలుగు చిత్రసీమలో మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీకీ ప్రస్తుతం అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

11/12/2016 - 17:50

అందాలతార టాలీవుడ్ క్వీన్ రాశీఖన్నా ఎన్నో కలలు కంటోందిట! ఏదైనా చారిత్రక కథా చిత్రంలో నటించాలన్నది తన చిరకాల స్వప్నమట. అబ్బో..అప్పుడే ఈ ముద్దుగుమ్మకు ఇలాంటి ఆలోచన వచ్చిందేమిటని ఆలోచిస్తున్నారా? మరి..అదే! ఏ నటి అయినా పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో కలలు కనడం సహజమే! అందుకు రాశీఖన్నా మినహాయింపు ఏమీ కాదుకదా! ఎవ్వరి కోరికలు వారి... ఎవ్వరి కలలు కూడా వారివే మరి! కథల ఎంపికలో హీరోలకు ఎంతో స్వేచ్ఛనిస్తారు..

11/12/2016 - 17:47

బాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనుష్కశర్మ. తొలి సినిమా నుంచే పాత్రలోలీనమవడం నేర్చుకుంది. మొదటి సినిమాలో అనుష్కశర్మను చూసిన చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కథానాయికగా రాణించడం చాలా కష్టమే అని అనుకున్నారంతా. అటు తర్వాత వాళ్లే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అనుష్కశర్మ అంటేనే క్రేజీ క్రేజీ అనేది బాలీవుడ్ నోటా వినిపిస్తున్నమాటే!

11/05/2016 - 21:52

ఇప్పుడు అందరి దృష్టీ ‘2.0’ చిత్రం పైనే వుంది. ఎందుకంటే సౌత్ ఇండియా సూపర్‌స్టార్.. స్టార్ డైరెక్టర్ కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కాబట్టి. ఇప్పటికే వీరిద్దరి కలయిలో వచ్చిన ‘రోబో’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ కు తోడు భారీ తారాగణం కూడా తోడవడం వల్ల సహజంగా అందరి చూపు ఈ చిత్రం మీదే వుంటుంది.

Pages