S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

10/05/2019 - 19:11

రాయేలమ్మ చనిపోయే నాటికి ఎనే్నళ్లో తెలియదు. అప్పటికే ఆమె భర్త గతించాడు.
ఆమె తన పదమూడో ఏట నించి నలభై అయిదో ఏటి దాకా పనె్నండు మంది పిల్లలకు తల్లి అయింది.
ఆమె పెద్ద కొడుక్కు ముప్పై ఏళ్లున్నప్పడు, ఆమె చివరి కొడుకు పుట్టాడు. ఆమె కడుపుడికింది.
తన పెద్ద మనుమడికి పనె్నండేళ్లు. తన చిన్న కొడుక్కు ఏడాది దాటింది.

09/28/2019 - 18:59

చాలా రోజుల తర్వాత నేను రవిని కలిశాను. ‘చాలా రోజుల తర్వాత’ అని అంత పర్టిక్యులర్‌గా చెప్పటంలో నా ఉద్దేశం ఏమిటో మీకు నిదానంగా అవగతమవుతుంది. రవి మాటకారి కాదు. అలా అని బిడియస్థుడు కూడా కాదు. మితభాషి. అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకే అతడి సమాధానం ఉంటుంది.

09/21/2019 - 19:43

తుషార నిశ్వాసల్లో మన్యం మత్తుగా నిదురపోతుంది. శిశిరభానుని మన్యప్రవేశాన్ని నీరదాలు నిరాకరిస్తున్నాయి. నిరీక్షణా తాపంతో రగిలిన ఆ చలిదీపం తన మయూఖాస్త్రాలతో మబ్బుల్ని మంచుని చీల్చి మన్యాన్ని వెలిగించింది. మన్యం మత్తు వదిలింది. అస్తాల తాకిడకికి మత్తు వదిలిన కొన్ని జీవులు కూసాయి, కొన్ని లేచాయి. అలా లేచిన ఒక జీవి మారేడుమిల్లి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది.

09/14/2019 - 18:55

తెల్లవారుజాము నాలుగున్నర సమయంలో ఆనందరావు విశాఖపట్నం వెళ్ళడానికి ముమ్మిడివరం బస్‌స్టాప్‌లో తానె్కవలసిన బస్‌కోసం ఎదురుచూస్తున్నాడు. ముందురోజు ఉదయం తొమ్మిది గంటలకే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుసుకున్నాడు. అప్పటికే ముందున్న విండో సీట్లన్నీ రిజర్వేషన్ అయిపోవడంతో పద్దెనిమిదో నెంబర్ గల విండో సీట్ ఎంచుకుని టికెట్ బుక్ చేసుకున్నాడు.

09/07/2019 - 18:59

పెరటిలో కుర్చీ మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు ఆనందరావు ఆ సాయంసంధ్యలో.
‘ఇదుగోండి టీ..’ వచ్చి కప్పు అందించి ఎదురుగా కూర్చుంది తులసి.
ఆలోచనల్లో నిమగ్నమయిన శ్రీవారిని తట్టిందామె.
‘ఏవిటీఁ ఏదో ఆలోచనల్లో నిమగ్నమైనట్టున్నారు?’ సన్నటి చిరునవ్వు ఆమె వదనాన.
కొద్దిగా వికసించింది ఆమె ముఖారవిందం.

08/31/2019 - 20:07

‘కలడందురు దీనులయెడ కలడందురు పరమయోగి గుణముల పాలన్
కలడందురన్ని దిశలను కలడు కలండనెడి వాడు కలడో లేడో!’
నిట్టూరుస్తూ గుర్తు తెచ్చుకుంది నీరజ గజేంద్ర మోక్షంలో తాను చదువుకున్న తనకిష్టమైన పద్యాన్ని.

08/24/2019 - 18:50

చంగల్రావ్‌కి చిన్నప్పటినించీ డిటెక్టివ్ నవలలు చదవటమంటే చాలా ఇష్టం. స్కూలుకి సెలవు దొరికితే చాలు ఏదో ఒక డిటెక్టివ్ నవల పట్టుకుని కూర్చునేవాడు. వేసవి సెలవలైతే ఇక చెప్పనే పనిలేదు. రోజంతా అదే పని. కొమ్మూరి సాంబశివరావు నవలలంటే అతనికి చాలాఇష్టం. డిటెక్టివ్ యుగంధర్ అతని ఆదర్శ డిటెక్టివ్. స్కూల్ రోజులు దాటి కాలేజీకి వెళ్ళేటప్పటికి ఈ పుస్తకాలు చదవటానికి టైం ఉండేది కాదు.

08/17/2019 - 19:43

నల్లని తారురోడ్డు మీద కారు సాఫీగా సాగిపోతోంది. ఆ ప్రయాణం ఎంతవరకూ అలా సాగుతుందో ఎవరికి తెలుసు? కాసేపటికి రోడ్డు మీద గతుకులు రావచ్చు. డ్రైవర్ రెప్పపాటు కునుకు వేస్తే అర్థాంతరంగా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోవచ్చు. జీవితం అంటే అంతే గదా!

08/10/2019 - 18:13

సెల్ మోగుతూ ఉన్న చప్పుడు వంటింట్లో ఉన్న కల్యాణికి వినబడింది. ఇప్పుడింకా ఉసూరుమంటూ ఆఫీసు నుండి వచ్చింది. ఎక్కడివక్కడే పడేసి ఉదయం హడావిడిగా బయలుదేరింది. అవి సర్దుకుంటూ రాత్రి వంటకు మొదలుపెట్టబోతూ ఉండగా ఈ ఫోనొకటి. వదిలించుకోటానికి పదిహేను నిమిషాలయినా అవుతుంది అని విసుక్కుంటూ నంబరు చూసి ఇంటికి రాబోతూ ఫోనెందుకు చేశారు అనుకుంటూ ‘ఏమిటండీ అంత అర్జంటు?’ అంది విసుగును దాచుకుంటూ. ‘మరేం లేదు.

08/03/2019 - 19:06

శేషయ్యకి పిల్లలు లేరు. పిల్లల కోసం మొక్కని చెట్టు, పుట్ట, దైవం లేదు. అందరూ అతన్ని షావుకారు శేషయ్య అనేవారు. శేషయ్యంటే ఎవరో కాదు, మా ఇంటి ఎదురు డాబా ఇల్లే అతనిది. నా చిన్నప్పటి నుంచీ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ నేనంటే ఇష్టంగా ఉండేది ఆ దంపతులకి. ఇల్లు దుకాణంకి ఉపయోగించేలా ఇంటి ముందు గదిని పెద్ద హాలుగా కట్టుకున్నాడు శేషయ్య.

Pages