S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

06/08/2019 - 19:05

జనరల్ మేనేజర్ గదిలోంచి... నా కుర్చీ దగ్గరికి వచ్చి కూలబడాలనుకున్నాను.. 1962 ఆగస్టు పదో తారీఖు అది. అంతలో లేచి నిలబడ్డాను. అది నా కుర్చీ కాదిక.. అనుకుంటూన్నాను. ఎదురుగ్గా మల్లయ్య శాస్ర్తీ వచ్చాడు. అతను క్యాంప్‌లో నా సమకాలీనుడు. ఫార్మసీ ఎమ్‌ఎస్సీ చేశాడు. గోల్డ్‌మెడలిస్ట్.. చాలా ఇష్టం నేనంటే. నా ‘తొలి మలుపు’ నవల అంటే చాలా చాలా ప్రాణం.

06/03/2019 - 22:39

భెజవాడ గాంధీనగర్ ‘పాత పుస్తకాల షాపులు’ అన్నది పేరే గాని మద్రాసు నుంచి నేరుగా పాకెట్ బుక్స్ - అలంకార్ దుర్గామందిరాల మధ్య ఏరియాలో ఉన్న ‘సెకండ్ హ్యాండ్ బుక్‌షాపులకి’ రిలీజ్ అయిపోయేవి, వాటిలో విశ్వప్రసాద్ ‘డాక్టర్’ మరియు ప్రసాద్‌ల బుక్స్, ధనికొండ వగైరాల బుక్స్ ఉండేవి - ధనికొండ రాసిన ‘క్లియోపాత్ర’ ఇంత లావు పుస్తకం. ఈ బుక్స్‌కి వేరే టైపూ కాగితం - ఆర్ట్ పేపరు కవరు వుండేది. అదో వెరైటీ.

05/25/2019 - 18:48

‘కుక్కపిల్ల దొరికింది’ - ఇది రావికొండలరావు గారి నాటిక అనుకుంటాను. ఆంధ్ర మహిళా సభ వారి హాలులో అనుకుంటాను. నాటికల పోటీలు జరిగాయి. అన్నట్లు జ్ఞాపకం. కానీ ఈ నాటకంలో ‘రాజబాబు’ నటన అమోఘం. బహుశ అదే రాజబాబుకి అద్భుతమయిన సినిమా ఛాన్స్‌కి, సినిమా కెరీర్‌కి ఆరంభం అయిందేమో. ‘పాన్‌గల్ పార్క్’కి ఎదురుగుండా ‘చిత్ర’ పత్రిక నరసింహారావుగారి కార్యాలయం, ప్రెస్సు.

05/18/2019 - 19:57

అప్పట్లో చేరిన కొత్తలోనే చాలా పుస్తకాలు నేను రివ్యూ చేశాను. నా నవల ‘విడీవిడని చిక్కులు’కి బదులు బహుమతి పొందిన సింగరాజు లింగరాజుగారి ‘ఆదర్శాలు - ఆంతర్యాలు’ ప్రచురణ కాగా - ఆ నవలని నేనే రివ్యూ చేశాను. ‘మంచి నవలల్లో మంచి నవల’గా నిలుస్తుంది’ అన్నాను.

05/11/2019 - 18:50

కామరాజ నాడార్ అరవై మూడు దాకా తమిళనాడు చీఫ్ మినిస్టర్‌గా ఒక ‘దేముడే’ అన్నట్లుగా పరిపాలించాడన్నది స్థానిక జనవాక్యం. ‘కర్మవీరుడు’ అంటారు జనాలు. మద్రాసు తర్వాత పెద్ద నగరం కోయంబత్తూరే. అక్కడా తెలుగువారిదే రెండో స్థానం. మనవేపు కోయంబత్తూరు ‘హండ్రెడ్ కౌంట్’ నేత చీరలకు విపరీతమయిన గిరాకీ.

05/04/2019 - 17:08

మారుతున్న ప్రపంచంలో నిత్యం కొత్త పదాలు చేరుతూ ఉంటాయి. నాటి న్యూస్ పేపర్ కార్యాలయంలో ఇలా కొత్త పదాలు ఎగిరి వచ్చి చేరేవి కావు.

04/27/2019 - 19:51

కోడి ఒక కోనలో పిల్లలొక కోనలో అన్నట్లుగా ఎడం, దూరం అయిపోయింది బాగా ఆంధ్రపత్రిక - ఆంధ్రప్రదేశ్‌కి. నేను చేరేటప్పటికి ఆరు పేజీలు ఏడు నయాపైసలకి - పది పేజీలు ఆదివారం నాడు - పదమూడు నయా పైసలకి దొరికే పత్రికని, అందితే తెలుగువాడున్న ప్రతీ గ్రామం, ప్రతీ మూలా కళ్లకద్దుకుని అందుకునే వాళ్లే గానీ - అది అందటమే ప్రధాన సమస్య.

04/20/2019 - 19:12

వి.కె.కృష్ణ మీనన్ మన దేశానికి రక్షణ మంత్రిగానే కాదు - ఇంగ్లండ్, అమెరికాలకు దౌత్యాధికారిగా కూడా వెళ్లాడు. సమితిలో మన దేశ ప్రతినిధిగా కాశ్మీర్ సమస్య మీద ఎనిమిది గంటల సేపు అనర్గళంగా ప్రసంగించి, పాక్ విదేశాంగ మంత్రికి చెమటలు పట్టించినవాడు. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. చాలా వివాదగ్రస్తుడే కానీ అప్పట్లో నాకు, ఆయనంటే గొప్ప గ్లామర్.

04/13/2019 - 18:51

తంబుచెట్టి వీధి అంత నిడివి గల రోడ్డే అయినా ‘వన్ వే రోడ్డు’ కావడంతో, నేను రోడ్డు క్రాస్ చేసి - ఆం.ప్ర.లోకి ప్రవేశిద్దామని చూస్తున్నప్పటికీ, ఆ కొస దాకా ఎడం వేపు అంతా కండచీమల బారులాగా మోటారు శకటాలు ఓ ‘కునుకు’ తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. లాగి వదిలిన బాణం లాగా నేను ఆఫీసులోకి దూసుకుపోతూనే, ఓ కన్ను టైమ్‌కీపర్ గోడ గడియారం మీద వేశాను. పైకి హాలులోకి చేరేసరికే, నా బల్ల నిండా టెలిగ్రాములు పలకరిస్తున్నాయి.

04/06/2019 - 22:54

రూమ్‌లో నాన్నగారు తన బల్ల మీధ అప్పుడది ఆఫీసు బల్ల కాదు గనుక, దాని మీదనే పడుక్కునేవారు. అది ఏడడుగులు పొడవు, నాలుగడుగులు వెడల్పు వుంటుంది. సరిగ్గా కిటికీ అంటే, ఆరు, ‘మడత తలుపులు’న్న కిటికీ అది.

Pages