S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

10/21/2018 - 21:32

ఇంఛిపేటలో మొదట్లో మా ఇంట్లో మంచినీటి పంపు కరెంటు రెండూ లేవు. ఆనక వచ్చాయి. పేట మొత్తానికి సరిపడా నీరు ఇవ్వగల పదహారు పంపుల ట్యాంక్ - (దానినే బావి పంపులు అనేవారు) ఉండేది. ఆఫీస్ బాయ్ కొట్టు దగ్గర మునిసిపల్ మంచి నీటి పంపు వుండేది. ఫాతిమా బీ మాకు నీళ్లు తెచ్చి పోసేది బిందెల లెక్కన.

10/13/2018 - 18:39

భారతి స్వతంత్ర స్రవంతి మొదలు బెజవాడలోని- ములుకోల, నెల్లూరు జమీన్ రైతు, ఢంకా, చిత్రగుప్త- వాహిని, ప్రజారాజ్యం, ప్రజాసేవ లాంటి పత్రికలూ - కొత్తగా వచ్చిన కమ్యూనిస్టూ డైలీ విశాలాంధ్ర దాకా - కవితలు ఖండికలు - గల్పికలు స్కెచ్‌లు ప్రచురించేవాళ్లు. ఇవైతే ఫిల్లర్స్ లాగ కూడ పనికొస్తాయని కాబోలు. ఏది ఏమైతేనేం కవిత్వమొక తీరని దాహం.. ఆంధ్రజ్యోతి మాసపత్రిక వచ్చేది.. అందులో నార్లగారు ఓ కాలం రాసేవారు.

10/06/2018 - 19:00

ఆ రోజుల్లో పాసెంజర్ రైలు ఎక్కితే చాలు.. చిడతలు కొట్టుకుంటూ గుడ్డి బిచ్చగాళ్ల పాటలు మొదలు.. ‘ఎంత దూరమో.. లేదూ చెలీ ఆ దేశమే పోదాం..’ అతడు ఆలాపన అందుకుంటాడు. ఆమె అందుకుంటుంది జవాబుగా - ‘దుఃఖము లేదా? దురాశ లేదా?’ అని.. గ్రుడ్డివాడైన చిడతల అన్న శ్రవణపేయమైన కంఠంతో శ్రుతిబద్ధంగా చిడతలు వాయిస్తూ పాట అందుకుంటాడు. ‘దుఃఖమూ లేదూ.. దాస్యమనెడి పాపమూ లేదు, చెల్లీ!

09/29/2018 - 17:47

తెలుగు నవల రెండో ప్రపంచ యుద్ధం తరువాత - ఒక రాజ్యమే ఏలింది. మొదట్లో ఆఖ్యాయిక అన్నారు. కాదంబరి అనుకోమన్నారు. పింగళి సూరన్న గారి కళాపూర్ణోదయమే - తొలి నవల అన్నారు. ఆయన మన తొలి తెలుగు నోవెలిస్ట్ అన్నారు. కానీ అందరికీ తెలుసు - నోవెల్ అన్న మాటే మనము ఫ్రెంచి భాష నుంచి అరుపు తెచ్చుకున్నాం - ‘నవల’ అని అనువాదం చేసుకున్నాము.

09/22/2018 - 18:46

ఏదైనా పడ్డప్పుడు కష్టమే కావొచ్చును కాని - వయసు మళ్లినాక బాల్య స్మృతులు నెమరు వేసుకుంటూ వుంటే భలేగా ఉంటుంది. ‘సరంగు’ తాతయ్య గుర్తొస్తున్నాడు. 1948 నాటి సంగతి. వైజాగ్ పోర్ట్ సహజ రేవు పట్నం అని సోషల్ పుస్తకం చెబుతుంది. నాటికి ఔటర్ హార్బర్‌లో దూరంగా పెద్ద ఓడలు ఆగితే, చిన్నచిన్న పడవలు పోయి సరుకులు దించి ఒడ్డుకు చేర్చేవి. ఈ పడవల్ని నడిపేది ‘సరంగు’లు. ఎక్కువగా మత్స్యకారులదే సరంగులలో డామినేషన్.

09/15/2018 - 22:09

1960: రచనా.. పత్రికా రచనా? ఏది లక్ష్యం?

09/15/2018 - 22:08

మధుసూదన్‌రావు మాస్టారు ఈయన పేరు.. డ్రిల్ కన్నా కబుర్లు ఎక్కువ చెప్పేవాడు. ‘ఏరా’లు, ‘వొరే’లు లేవు. నాకు డ్రిల్లు చెయ్యకుండా కూర్చోడానికి పర్మిషన్ కూడా ఇచ్చాడు. నేను ఎడిటర్నిగా..! పైగా అంగ్రేజీ తోడా తోడా ఆతా హై ముజ్హే...’
మర్నాడు లెక్కల మాస్టారు రాలేదు. ఈయనే ఖాళీ క్లాసులకి.. మళ్లీ డ్రిల్ మాస్టారు రెడీ.
-మీ అందరికీ డిక్టేషన్ చెప్పనా?

09/08/2018 - 18:51

మేకలు ఛదువుతాయా? అనుకోకండి. అవి ఏ ఆకులు కొమ్మలు వాటికి తటస్థపడితే అవే నమిలేస్తాయి. అట్లా చిన్నప్పుడు ఏది దొరికితే అదే - పొట్లాల కాగితాలు సహా చదివేసేవాణ్ని. మా రోజుల్లో సంచులు ప్లాస్టిక్ బ్యాగులు గట్రా లేవు. పాత న్యూస్ పేపర్లకి గొప్ప డిమాండ్ - పప్పులైనా ఉప్పులైనా పత్రికల కాగితాలతోనే పొట్లాలుగా తెచ్చుకోవాలి. ఉదారంగా పేపర్‌లో పేపర్ దన్నుగా పెట్టి - మరీ ప్యాక్ చేసేవాళ్లు..

09/01/2018 - 18:27

హెఢ్డింగ్ ‘స్టిక్కు’లో కూర్చి పెట్టుకుని వచ్చి రెండు అక్షరాలు మించింది.. పీకి పడేస్తున్నా.. లెక్కపెట్టి హెడ్డింగు పెట్టుమీ అనేవాడు - గొప్ప ఇది చేసేవాళ్లం మేమంతా అతన్ని. అయ్యవారు మాత్రం ‘పోరా.. నాకు చూపెట్టకు.. పోరా.. అవతలికి విసిగించకు..’ అనేవాడు. ఆయన మాటల్లో ఎంత అనురాగమో? వాత్సల్యమో? అయ్యవారు అంటే శంభుప్రసాద్‌గారు.

08/25/2018 - 17:42

కోట్లాది రూపాయలు ఖరీదు చేసే సరుకులు వస్తువులు వున్న గూడ్స్ గోడౌన్లు మొత్తం లూటీ అయిపోయాయి. సబ్బులు, పౌడర్లు, పప్పులు, రకరకాల సామాన్లు మొత్తం అన్నీ దోచేస్తున్నారు.. తగలబెట్టేస్తున్నారు.. నేనూ నా బ్యాచ్ - పోలీసు ఫైరింగ్ మొదలయిందన్న వార్తలకి - చలించిపోయి భయం వెంటాడగా ఇళ్లకేసి పరుగులు తీశాం. పదోక్లాసు పిల్లలం ఏమి చెయ్యగలం? మూకలతో కలిసి దోపిడీ చెయ్యకుండా ఆగగలమేమో కాని - దోపిడీని ఆపగలమా?

Pages