S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

06/12/2018 - 04:32

నా చదువు ఓ ఫార్సు - మూనె్నల్లు వెళ్తానో లేదో, అలా పడకేసేవాన్ని; స్కూలు డుమ్మా... కాకపోతే డబుల్ ప్రమోషన్ గ్యారంటీ - తలనొప్పితో.. ఓసారి ఓ రకం జ్వరం వచ్చేసింది. ఆ ఏడు వదలేసి మర్సటేడు - మెరిట్ పరీక్ష రాయడం - పై క్లాసులో కూర్చోవడం - చెప్పానుగా, నారాయణరావుగారి మేనల్లుడు అని నాకు అదనపు టైటిల్ వుండేది.

06/12/2018 - 04:30

జీవితం గుర్రబ్బండీని - గుర్రం లాగుతో ఉంటుంది కళ్లెం మన చేతిలో వుంది కనుక మనం తోలుతున్నాం అనుకుంటాం గాని ఈ బండి తోస్తుందో లేక ఆ కంచర గాడిద పరుగులు తీస్తుందో తెలియదు అదో మిస్టరీ - అది దాని మలుపులు తిప్పుకుంటూ - దారి తెలియని భవిష్యత్తులోకి పరుగులు తీస్తూ వుంటుంది - మనం తోలుతున్నాం అనుకోడంలో ఆశ వుంటుంది.. కాని బ్రతుకు బందీలం బండి ఎటుపోతే అటే.. మన గమ్య నిర్ధారణ జరిగిపోతుంది.

06/12/2018 - 04:27

హెఢ్డింగు స్టిక్‌లో పెట్టుకుని వచ్చి ఎందు అచ్చరాలు మించింది.. పీకి వ్రేస్తున్నా.. లీక్ పెట్టి పెట్టుమీ అనేవాడు - గొప్ప ఇది చేసేవాళ్లం మేమంతా - అయ్యవారు మాత్రం (శంభుప్రసాద్ గారు) పోరా.. నాకు చూపెట్టవాకు.. పోరా అవతలికి అనేవాడు ఆ మాటల్లో ఎంత అనురాగమో, వాత్సల్యమో? నేను వీక్లీలో కలం గీకి పడేశాక - ప్రూఫ్ రీడర్ పెద్దాయన - జియోగ్రఫీలో ఆనర్సు - కప్పీ తెచ్చి - ఈ మాట ఏమిటో సారూ అనేవాడు. చేసేవాన్ని.

Pages