S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీక్లీ సీరియల్

04/06/2019 - 22:18

ఆ రోజు అయిదేళ్ల గౌతమికి పుట్టెడు జ్వరం. ఒళ్లు తెలియకుండా ఎగిరెగిరి పడుతోంది. చుట్టూ భయంకరారణ్యాలు, గుట్టలు వుండే ఆ పల్లెకి వైద్య సౌకర్యాలు గానీ, ప్రయాణ సౌకర్యాలుగానీ ప్రయాణ సౌకర్యాలు గానీ అప్పట్లో లేవు. మరీ అవసరమైతే ఎడ్లబళ్ల మీద గానీ, డోలీల్లో గానీ పక్కగా వున్న పట్నానికి తీసికెళ్లి వైద్యం చేయించుకుంటారు.

03/30/2019 - 22:21

ఆలయం కేసి వచ్చినప్పుడల్లా కూడా శంకరయ్యని ఓ హంతకుడిగా చూస్తూ గుసగుసలాడుకునేవారు. ఇదంతా గౌతమికి బాధ కలిగించడమే కాదు. తండ్రి ఆరోగ్యం దెబ్బ తినడంతో ఆయనేమై పోతాడో అన్న భయం పట్టుకుంది. అయినా నోరెత్తలేని పరిస్థితి! అందుకే పిచ్చిదానిలా ఎక్కడెక్కడో తిరుగుతోంది. ప్రతిరోజూ కాబోయే భర్త అనిల్ దగ్గరికెళ్లడం, ఓ డాక్టర్‌గా అతనికి చేదోడువాదోడుగా ఉండడం అలవాటే కాబట్టి ఇప్పుడూ అలాగే వెళ్తోందనుకున్నాడు తండ్రి.

03/30/2019 - 22:20

అర్ధరాత్రి కావస్తోంది.

03/30/2019 - 22:17

కాలగమనంలో ఆలయ శిఖరం తప్ప ఇంకేం కనిపించనంతగా చెట్లు పెరిగిపోవడం వల్ల ఆలయ పరిసరాల్లో చీకటిగా ఉంటుంది. అలా అని అక్కడ కరెంట్ సౌకర్యాల్లేవని కాదు. భూలోకంలోని కైలాసం అన్నంత వైభవంగా ఉంటుంది. తగ్గ సెక్యూరిటీ ఉంది. అయినా దొంగతనం జరిగింది.

03/30/2019 - 22:14

3
‘ఓ చిన్న క్లూ ఇద్దామని?’ నవ్విందామె. ఆమె నవ్వు అతనికి ఉత్సాహాన్నిచ్చింది.
‘చెప్పండి. ఏవిఁటా క్లూ?’ అన్నాడు ఉత్సాహంగా.
‘చిన్న క్లూయే అనుకోండి. కానీ అది మీకు చాలా ఉపయోగపడవచ్చు. సింగపడవి గుళ్లోని దోపిడీ, ఎవరో ఎక్కడ్నుంచో వచ్చి చెయ్యలేదు. ఆ పరిసరాల్లో తిరుగుతూ, ఆలయపు రహస్యాలన్నీ తెలిసిన వాళ్లే చేశారు. ఆ రూట్‌లోనే పరిశోధన సాగించండి’ అంటూ ఫోన్ పెట్టేసిందామె.

03/30/2019 - 22:11

ఎలా లీకయిందో, ఎవరో హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న వార్త కూడా వ్యాపించింది. ఇదంతా చంద్రకి తలనొప్పిగా తయారైంది. కొందరు శంకరయ్య క్కూడా దోపిడీతో సంబంధం ఉందని గుసగుస లాడుకుంటున్నారు. దీంతో గౌతమి కూడా కృంగిపోయి కొండ దిగడం కూడా మానేసింది.

03/30/2019 - 22:10

చాలా రోజుల తర్వాత ఫోన్ చేసింది క్లూ. ఆమె గొంతు వినగానే ప్రభుకి ప్రాణం లేచొచ్చినట్టయింది.
‘హలో మిస్ క్లూ?’ అన్నాడు ఉత్సాహంగా.
‘మిస్ కాదు. మిసెస్. మిసెస్ క్లూ ఎవిడెన్స్’ నవ్విందామె.
‘వ్వాట్?’
‘ఎస్! నా పేరు క్లూ. మా వారి పేరు ఎవిడెన్స్. వెరసి నా పేరు క్లూ ఎవిడెన్స్’ మళ్లీ నవ్విందామె.
‘బావుంది, చెప్పండి’ తనూ నవ్వుతూ అన్నాడతను.

Pages