S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/14/2020 - 03:32

గుంటూరు (అరండల్‌పేట), ఏప్రిల్ 13: గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కరోనా సెగ తగిలింది. వైద్యశాలలోని గుండె శస్త్ర చికిత్స విభాగంలో ఇటీవల చికిత్స పొందిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి ఆదివారం సాయంత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతనికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన పనుల నిమిత్తం ఈనెల 8వ తేదీన విజయవాడకు వచ్చారు.

04/14/2020 - 03:31

గుంటూరు, ఏప్రిల్ 13: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 విస్తరిస్తున్నప్పటికీ రాజధాని ఉద్యమం పేరిట బయట తిరుగుతూ, ఒకరినొకరు కలుసుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సోమవారం ఈ మేరకు రాజధాని పరిధిలోని వెంకటపాలెం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

04/14/2020 - 03:31

గుంటూరు, ఏప్రిల్ 13: కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసుల నుండి పాస్‌లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని, లాక్‌డౌన్ సమయంలో ప్రజల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు.

04/14/2020 - 03:30

విజయవాడ(సిటీ), ఏప్రిల్ 13: ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తున్న కరోనాను కూడా రాజకీయ లబ్దికి వాడుకోవడం ఒక్క వైసీపీకే చెల్లిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. జై అమరావతి అన్న రైతులపై కరోనా నిబంధనలను అంటూ నోటీసులు ఇస్తున్న పోలీసులు, వైసీపీ నేతలకు మాత్రం నిబంధనలు పట్టవా అంటూ సోమవారం ట్విట్టర్‌లో ఆరోపించారు.

04/14/2020 - 03:29

విజయవాడ, ఏప్రిల్ 13: దేశం కాని దేశం అమెరికాలో గడచిన నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పడుతున్న కష్టాలను ఇప్పటికైనా గుర్తించి స్వస్థాలకు రప్పించే విషయంలో తక్షణం దృష్టి నిలపాలని కోరుతూ టీడీపీఎన్‌ఆర్‌ఐ విభాగం కార్యదర్శి పారిశ్రామికవేత్త కె బుచ్చిరాంప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

04/14/2020 - 03:27

విజయవాడ, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉన్నందున తక్షణమే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు.

04/14/2020 - 03:26

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: సీఎం జగన్ ఇచ్చే మాస్కులు పేద ప్రజల ఆకలి తీర్చవని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న తెలిపారు. మాస్కులతో పాటు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం ప్రతీ ఒక్కరికీ వేయాలని సోమవారం ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు. మూడు మాస్కులతో పాటు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం పంపితే ప్రజల ఆకలి తీరుతుందన్నారు.

04/14/2020 - 03:25

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: అప్పుడు లక్షలాది మంది చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగా మనం ఈరోజు సేచ్ఛను అనుభవిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్‌లో కాల్పుల్లో అమరులైన వారికి నివాళులు అర్పిద్దాం అంటూ సోమవారం ట్విట్టర్‌లో ది గార్డియన్ - లండన్ అనే కథనాన్ని పోస్టు చేశారు.

04/14/2020 - 03:25

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మూడేసి చొప్పన ఎన్ 95 మాస్క్‌లను అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కరోనాపై ఓ బ్రహ్మాస్త్రం వంటిదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కరోనాపై జరుగుతున్న పోరులో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడగమంటూ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

04/14/2020 - 03:23

గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పలు కేసుల్లో దాఖలైన పిటీషన్లపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన రాష్ట్రప్రభుత్వం కొత్త కమిషనర్‌గా మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను నియమించడం, ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.

Pages