S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 04:02

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్ధను అత్యవసర ప్రాతిపదికపై పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ప్రత్యేక పవర్ బ్రేక్ డౌన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

09/24/2016 - 04:01

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని వేడిలో తాను అన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగే ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది.

09/24/2016 - 03:59

హైదరాబాద్, సెప్టెంబర్ 23: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ 2016-17 సంవత్సరానికి ప్రకటించిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు విశ్వవిద్యాలయాలు, తెలంగాణకు చెందిన ఒక విశ్వవిద్యాలయం స్థానాన్ని దక్కించుకున్నాయి.

09/24/2016 - 03:58

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: ఏడాదికి కోటిన్నరకు పైగా టర్నోవర్ ఉండే వ్యాపారాలు, పరిశ్రమలు, సంస్థలు అన్నింటిపై కేంద్ర, రాష్ట్రాలకు నియంత్రణ ఉంటుందని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం కూడా జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం రెండోరోజు జరిగింది. ఈ సమావేశానికి ఏపి తరఫున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు.

09/24/2016 - 03:56

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ విద్యా సంవత్సరంలో స్పోర్ట్స్ కోటా కింద ఆంధ్రాలో ఎంబిబిఎస్, దంత వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించవద్దని హైకోర్టు శుక్రవారం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్ జి తన్మయి తరఫున న్యాయవాది రఘునందనరావు వాదనలు వినిపిస్తూ, స్పోర్ట్స్ కోటా కింద తయారు చేసిన మెరిట్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని తెలిపారు.

09/24/2016 - 03:55

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి సాహితీ మిత్రులు పేరిట గుంటూరు 2/1 బ్రాడిపేటలో కొత్త సాహితీ సంస్థను ఆదివారం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రఖ్యాత కవి, రచయిత డాక్టర్ రావి రంగారావు చెప్పారు. ఈ సందర్భంగా సాహిత్య గోష్ఠి జరుగుతుందని చెప్పారు.

09/24/2016 - 03:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్ ఫ్రాన్స్‌నుంచి 7.87 బిలియన్ల యూరోలు (సుమారు 59వేల కోట్లు) వెచ్చించి 36 రఫాలే యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు శుక్రవారం ఇక్కడ సంతకాలు చేశాయి. ఈ యుద్ధ విమానాలకు ఆధునిక క్షిపణులు, ఆయుధ వ్యవస్థ బిగించి ఉంటుంది. దీంతో పాటు భారత్ అవసరాలకు అనుగుణంగా నిర్దిష్టమైన మార్పులు కూడా ఈ విమానాలకు చేసి ఇస్తారు.

09/24/2016 - 03:40

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 23: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటివరకు రెండు యుద్ధాలు జరిగాయి. రెండు దేశాలు దాయాదుల్లాగా నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే వస్తున్నాయి. రెండు దేశాల మధ్య 50 ఏళ్లుగా కాశ్మీర్ వివాదం రావణ కాష్ఠంలాగా కాలుతూనే ఉంది. అయితే ఒక్క విషయంలో మాత్రం రెండు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తలేదు. అదే సింధూ జలాల ఒప్పందం.

09/24/2016 - 03:39

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రమాణాలు పెంచేందుకు గత ఏడాది నుండి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండగా, రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల ప్రావీణ్యాన్ని పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పనితీరును సమీక్షించాలని కూడా చూస్తోం ది. ఇందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

09/24/2016 - 03:37

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23:ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ మీద నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

Pages