S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 00:28

ఓర్వకల్లు, ఏప్రిల్ 29: జిల్లాలో శుక్రవారం వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు. అందులో ఓర్వకల్లు మండల పరిధిలోని గుట్టపాడు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ పెద్ద పెద్దయ్య(58) వడదెబ్బ సోకి శుక్రవారం మృతిచెందాడు. పెద్దయ్య ఉదయానే్న గ్రామానికి చెందిన కూలీలతో కలిసి ఉపాధి పనికి వెళ్లాడు. 10 గంట ల సమయంలో తల నొప్పిగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని తోటి కూలీలతో చెప్పి సృహ తప్పి పడిపోయాడు.

04/30/2016 - 00:27

కర్నూలు, ఏప్రిల్ 29 : జిల్లాలోని 14 నియోజకవర్గ కేంద్రాల్లో 100 ఎకరాల చొప్పున భూమి సేకరించాలని ప్రభుత్వం కలెక్టర్ విజయమోహన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ పనిని తక్షణం పూర్తి చేసి మే 2వ తేదీ జరగనున్న మంత్రివర్గ సమావేశానికి నివేదిక పంపాలని సూచించింది. ఈ భూమిని ఏపిఐఐసికి కేటాయించి ఆ సంస్థ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య(ఎంఎస్‌ఎంఇ) తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

04/30/2016 - 00:26

బేతంచెర్ల, ఏప్రిల్ 29:మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమద్దులేటి నరసింహస్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ. 55,73,995 ఆదాయం చేకూరినట్లు ఇఓ తిమ్మనాయుడు, చైర్మన్ యల్లనాగయ్య తెలిపారు.

04/30/2016 - 00:25

కర్నూలు సిటీ, ఏప్రిల్ 29: గత ఆర్థిక సంవత్సరం రవాణాశాఖ పన్ను వసూళ్లలో నిర్ధేశించిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో వసూలు చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డిటిసి) మీరా ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది రవాణా శాఖ కమిషనర్ జిల్లాకు రూ. 116.84 కోట్లు వసూల్ చేయాలని నిర్ధేశించగా రూ. 133.86 కోట్లు వసూలు చేసినట్లు వివరించారు.

04/30/2016 - 00:24

కోవెలకుంట్ల, ఏప్రిల్ 29: 2026 వరకూ పునర్విభజన జరగదని వైకాపా తన దత్తపత్రికలో ప్రచురించిన కథనా లు అవాస్తవమని, 2016లోనే తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన జరుగనుందని మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

04/30/2016 - 00:22

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 29: ఉడకపెడుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9గంటలకే ప్రచండ భానుడు నిప్పులు గగ్గుతూ ప్రకాశించటంతో ప్రజలు, పశుపక్షాదులు వేడికి అల్లాడుతున్నాయి. మంచినీరు ఎంత తాగినా ఇంకిపోతోంది. దీనికి తోడు ఉక్కపోత కారణంగా వృద్ధులు, పసికందులు ఉడికిపోతున్నారు.

04/30/2016 - 00:22

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 29: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

04/30/2016 - 00:21

నందిగామ, ఏప్రిల్ 29: మండలంలోని దాములూరు కూడలి సంగమేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో పుష్కర నిధులతో నిర్మించిన చెన్నకేశవస్వామి వారి ఆలయ ప్రతిష్ఠలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

04/30/2016 - 00:21

అవనిగడ్డ, ఏప్రిల్ 29: అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.10 లక్షల వ్యయంతో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందార్లు, సహకార సంఘ సభ్యుల అవగాహనా సదస్సును శుక్రవారం స్థానిక గాంధీ క్షేత్రంలో నిర్వహించారు.

04/30/2016 - 00:20

పెడన, ఏప్రిల్ 29: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పట్టణ ప్రధాన రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని చొరవతో రహదారి విస్తరణను ప్రారంభించగా, కొంత మంది కోర్టుకు వెళ్ళటంతో ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ పనిని ప్రారంభించేందుకు ఎవ్వరూ చొరవ చూపలేదు.

Pages